మీ ఏడుపే మా ఎదుగుదల.. టాలీవుడ్ పై బాలీవుడ్ కు ఎందుకంత కడుపుమంట..!
మనం మామూలుగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆటో వెనకాల కొటేషన్స్ రాస్తారు కదా..! నన్ను చూసి ఏడవకురా..!, అప్పుచేసి ఆటో కొన్న దిష్టి పెట్టకురా..!, మీ ఏడుపే మా ఎదుగుదల.. ఇలా కొన్ని ఇంట్రెస్టింగ్ కొటేషన్స్ చూస్తుంటాం.

మనం మామూలుగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆటో వెనకాల కొటేషన్స్ రాస్తారు కదా..! నన్ను చూసి ఏడవకురా..!, అప్పుచేసి ఆటో కొన్న దిష్టి పెట్టకురా..!, మీ ఏడుపే మా ఎదుగుదల.. ఇలా కొన్ని ఇంట్రెస్టింగ్ కొటేషన్స్ చూస్తుంటాం. తాజాగా బాలీవుడ్ వాళ్ళను చూస్తుంటే ఇవన్నీ ఒకేసారి గుర్తుకొస్తున్నాయి. వాళ్లకు చేతకాదు.. మన వాళ్ళు చేసి చూపిస్తే వాళ్ళు ఓర్చుకోలేరు.. కక్కలేక మింగలేక మన మీద కడుపు మంట ఎప్పటికప్పుడు బయట పెడుతూనే ఉంటారు బాలీవుడ్ మేకర్స్. తాజాగా ఈ టాపిక్ మరోసారి వైరల్ అవుతుంది. దానికి కారణం లెజెండరీ బాలీవుడ్ రైటర్ జావేద్ అక్తర్ చేసిన వ్యాఖ్యలే. బాలీవుడ్ ఎందుకు వెనకబడింది అనే విషయం మీద వీళ్ళు ఒక డిబేట్ పెట్టుకున్నారు.
అక్కడి వరకు ఉంటే బాగానే ఉంటుంది కానీ టాలీవుడ్ ఎందుకు ముందుకు వెళ్తుంది అనే కడుపు మంట కూడా అందులో కనిపించింది. ఎవరో ముక్కు మొహం తెలియని హీరోల సినిమాలకు కూడా హిందీలో 700 కోట్లు వస్తున్నాయి అంటూ జావేద్ అక్తర్ చేసిన కామెంట్స్ పై మండి పడుతున్నారు టాలీవుడ్ అభిమానులు. ఈ మధ్యకాలంలో హిందీలోకి డబ్ అయి.. 700 కోట్లు కాదు 800 కోట్లు వసూలు చేసిన సినిమా పుష్ప 2 మాత్రమే. ఈ లెక్కన ఆయన అన్నది అల్లు అర్జున్ ను అని అర్థమవుతుంది. సౌత్ హీరోలు మన దగ్గర ఎవరో కూడా తెలియదు వాళ్ల సినిమాలకు కలెక్షన్స్ వస్తున్నాయి అని ఆయన ఒక పాజిటివ్ కోణంలోనే అన్నాడు. కానీ అది నెగిటివ్ సెన్స్ లో వెళ్ళిపోయింది. వాళ్లెవరి సినిమాలో మన దగ్గర ఇంత సక్సెస్ అవుతున్నప్పుడు మన సినిమాలు ఎందుకు సక్సెస్ కావట్లేదు అనే కోణంలో జావేద్ ఈ కామెంట్స్ చేశాడు.
ఈ డిబేట్ లో అమీర్ ఖాన్ కూడా ఉన్నాడు. ఆయన సౌత్ ఇండస్ట్రీకి పూర్తిగా సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. రూటేడ్ ఎమోషనల్ కథలు పట్టుకోవడంలో బాలీవుడ్ పూర్తిగా వెనకబడిపోయిందని.. మల్టీప్లెక్స్ ఆడియన్స్ కోసం సినిమాలు తీస్తూ.. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే రొటీన్ ఎమోషన్స్ మన దర్శకులు ఎప్పుడో మరిచిపోయారు అంటూ సంచలన కామెంట్స్ చేశాడు అమీర్ ఖాన్. అదే దక్షిణాది ఇండస్ట్రీలో మాత్రం ప్రేమ, పగ ఇలాంటి కామన్ ఎమోషన్స్ పట్టుకొని సినిమాలు చేస్తున్నారు అని చెప్పుకొచ్చాడు ఈయన. వాళ్ల సక్సెస్.. మన ఫెయిల్యూర్ ఇక్కడే ఉంది అని పోస్టుమార్టం చేసాడు అమీర్ ఖాన్. అంతా బాగానే ఉంది కానీ అప్పుడప్పుడూ కొత్త సినిమా సక్సెస్ ఓర్వలేక జాన్ అబ్రహాం, అర్షద్ వార్షీ లాంటి వాళ్ళు చేసే కామెంట్స్ మొత్తం బాలీవుడ్ మీద విరక్తి కలిగేలా చేస్తున్నాయి.