Ram charan : రామ్ చరణ్ ఎందుకు ఎన్టీఆర్, అల్లు అర్జున్ తో కలవటం లేదు
మెగాపవర్ స్టార్ (Megapower Star) రామ్ చరణ్ (Ram Charan) అండ్ ఇండియన్ బిగ్గెస్ట్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా (Pan India) మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ మీద చరణ్ అభిమానులలో ఎన్ని అంచనాలు అయితే ఉన్నాయో ప్రేక్షకుల్లో కూడా అంతే అంచనాలు ఉన్నాయి. తాజాగా అభిమానులు ఒక విషయంలో చెర్రీని రిక్వెస్ట్ చేస్తున్నారు.

Why is Ram Charan not meeting NTR and Allu Arjun?
మెగాపవర్ స్టార్ (Megapower Star) రామ్ చరణ్ (Ram Charan) అండ్ ఇండియన్ బిగ్గెస్ట్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా (Pan India) మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ మీద చరణ్ అభిమానులలో ఎన్ని అంచనాలు అయితే ఉన్నాయో ప్రేక్షకుల్లో కూడా అంతే అంచనాలు ఉన్నాయి. తాజాగా అభిమానులు ఒక విషయంలో చెర్రీని రిక్వెస్ట్ చేస్తున్నారు.
చరణ్ తో పాటు టాలీవుడ్ (Tollywood) టాప్ హీరోలైన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఎన్టీఆర్ (NTR), అల్లు అర్జున్ లు తమ రాబోయే సినిమాల రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్నారు. ఓజి (OG) సెప్టెంబర్ 23 ,దేవర (Devara) ఆక్టోబర్ 10 , పుష్ప అగస్ట్ 15 న వస్తున్నాయి. అలాగే మొన్నీ ఈ మధ్యనే ప్రారంభమైన చిరంజీవి విశ్వంభర కూడా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10 న వస్తుంది. ఇలా ముందుగానే అన్ని సినిమాలు తమ రిలీజ్ డేట్ ని ప్రకటించుకొని తన సత్తా చాటడానికి సిద్ధం అవుతున్నారు. కానీ చరణ్ మాత్రం తన గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ని ప్రకటించడం లేదని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. అసలు ఆ విషయంలో ఎందుకు లేటు చేస్తున్నాడో కూడా వాళ్ళకి అర్ధం కావటంలేదు. పైగా అందరి కంటే ముందుగా చరణ్ తన గేమ్ చేంజర్ ని స్టార్ట్ చేసాడు.మరి ఎందుకు రిలీజ్ డేట్ ఇవ్వడంలేదని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
గేమ్ చేంజర్ షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి రకరకాల కారణాల వల్ల షూటింగ్ పోస్ట్ పోన్ అవుతు వస్తుంది. కానీ కొన్ని రోజుల క్రితం ఒక భారీ షెడ్యూల్ తో షూటింగ్ జరుపుకోవడంతో ఫ్యాన్స్ ఎంతో హ్యాపీగా ఫీలయ్యారు.కానీ మళ్ళీ ఎలాంటి ఊసు లేదు. చరణ్ తమ కోసమైనా కల్పించుకొని గేమ్ చేంజర్ షూటింగ్ అప్ డేట్ ని ఇవ్వాలని ముఖ్యంగా రిలీజ్ డేట్ ని ప్రకటించాలని కోరుకుంటున్నారు. దిల్ రాజు లాంటి ప్లానింగ్ ఉన్న వ్యక్తి ప్రొడ్యూసర్ గా ఉండి కూడా ఎందుకు అప్ డేట్ అవ్వడంలేదని కూడా ఫ్యాన్స్ అనుకుంటున్నారు.