ఎన్టీఆర్ పై కోపం ఎందుకు…?
సరిపోదా శనివారం… చాన్నాళ్ళ నుంచి మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న న్యాచారుల్ స్టార్ నానీకి మంచి జోష్ ఇచ్చిన సినిమా ఇది. ఈ సినిమాతో నానీ మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వచ్చేసాడు అనే చెప్పాలి. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ సహా కథ కూడా బాగుండటంతో జనాలకు సినిమా బాగా నచ్చింది అనే చెప్పాలి. ఇక నానీ కాస్త నటన మీద కూడా ఫోకస్ పెట్టడంతో జనాలు సినిమాను ఆదరించారు అనే చెప్పాలి. దర్శకుడు వివేక్ ఆత్రేయ కూడా గతంలో కంటే భిన్నంగా సరిపోదా శనివారం కోసం పని చేసాడు.
ఇక చిత్ర యూనిట్ కి మంచి లాభాలు రావడంతో నానీతో మరో ప్రాజెక్ట్ చేసేందుకు నిర్మాతలు సిద్దమవుతున్నారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలా ఉంచితే ఇప్పుడు ఈ సినిమాలో కొన్ని సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఒక సీన్ కి మంచి క్రేజ్ వచ్చింది. అదే హీరోకి ఎవరి మీదైనా కోపం వస్తే వాళ్ళ పేరుని తన డైరీలో రౌండ్ చేసుకోవడం. అలా ఒక పేరుని నానీ రౌండ్ చేసుకున్నాడు. ఆ పేరే దయా… సినిమాలో విలన్ పేరు దయానంద్.
తన డైరీలో దయా అని రాసుకుని రౌండ్ చేసుకుంటాడు నానీ. అయితే ఏంటీ అంటారా…? మీమ్స్ వాళ్లకు చిన్న క్లూ దొరికితే చాలు కదా… అల్లుకుపోతారు. టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పేరు కూడా దయా. అందులో ఎన్టీఆర్ కూడా పోలీస్ పాత్రలో నటించారు. అలా దయా పేరుని రౌండ్ చేసుకుంటే… చివరికి అది జెర్సీ క్లైమాక్స్ అయింది. జెర్సీలో నానీ ఫోటోకి దండ వేసే సీన్ ని… నానీ పేరుని రౌండ్ చేసుకునే సీన్ ని, టెంపర్ లో ఎన్టీఆర్ ఫోటోని ఒక ఫ్రేం లో పెట్టి వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మీం బాగా వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో. మీమ్ మాదిరి తీసుకుంటే సమస్య లేదు గాని ఎక్కువ ఆలోచిస్తేనే సమస్య.