Pawan Kalyan: కళ్లముందు అన్యాయం జరుగుతున్నా.. పవన్ కళ్యాణ్ చూస్తూ ఊరుకుంటున్నాడా..?
తన విషయంలో, ముఖ్యంగా త్రివిక్రమ్ విషయంలో పవన్ కళ్యాణ్ కళ్లు మూసుకుని వ్యవహరిస్తున్నాడు అంటున్నారు కొందరు విశ్లేషకులు. అందుకే పవన్‌ని అడ్డు పెట్టుకుని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ హీరోయిన్లను, నిర్మాతలను ఏడిపిస్తున్నాడట.

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడ అన్యాయం ఎదురైనా ప్రశ్నిస్తాడు. ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తాడు. కాని ఎందుకో తన విషయంలో, ముఖ్యంగా త్రివిక్రమ్ విషయంలో పవన్ కళ్యాణ్ కళ్లు మూసుకుని వ్యవహరిస్తున్నాడు అంటున్నారు కొందరు విశ్లేషకులు. అందుకే పవన్‌ని అడ్డు పెట్టుకుని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ హీరోయిన్లను, నిర్మాతలను ఏడిపిస్తున్నాడట.
ఆల్రెడీ బండ్ల గణేష్ త్రివిక్రమ్‌ని గురూజీకి కాస్ట్ లీ గిఫ్టిస్తేనే ఏ నిర్మాతకైనా పవన్ కళ్యాణ్ డేట్లు దొరుకుతాయన్నాడు. త్రివిక్రమ్ తలుచుకుంటే భార్యభర్తలను, తండ్రి కొడుకులను, గురు శిష్యులను విడదీస్తాడన్నాడు. అంటే పవన్-రేణూ దేశాయ్‌ని, ఎన్టీఆర్-బాలయ్యని, ఇక పవన్ శిష్యుడైన బండ్ల గణేష్‌తో పవర్ స్టార్ బంధాన్ని త్రివిక్రమే చెరిపేసినట్టు పరోక్షంగా ట్వీట్లు చేశాడు. ఆల్రెడీ త్రివిక్రమ్ శైలి నచ్చకే అరవింద సమేత వీరరాఘవ రెడ్డి మూవీ తర్వాత త్రివిక్రమ్‌ని తారక్ పక్కనపెట్టాడు. మహేశ్ ఎప్పటినుంచో పక్కన పెట్టినా, చివరికి ఓ మూవీ మొదలుపెట్టి మధ్యలో వదిలించుకోలేక ఇబ్బంది పడుతున్నాడు అంటున్నారు.
ఇక పవన్ మూవీ హరి హర వీరమల్లు పూర్తి కాకుండా త్రివిక్రమ్ కొత్త సినిమాలను పురమాయిస్తూ వస్తున్నాడనే కామెంట్స్ ఉన్నాయి. ఏదేమైనా త్రివిక్రమ్‌ని గురువుగా భావించే పవన్.. మరీ బ్లైండ్‌గా మాటల మాంత్రికుడిని నమ్మాడా? ఆ నమ్మకాన్నే త్రివిక్రమ్ క్యాష్ చేసుకుంటున్నాడా? ఇంత జరుగుతున్నా పవన్ కి ఇదంతా తెలియట్లేదా? ఇవి పవన్‌ని ఆలోచనల మత్తులోకి నెట్టేసి పండగ చేసుకుంటున్న త్రివిక్రమ్ ఘనకార్యాలు.