Tillu Square: టిల్లు స్క్వేర్‌లో నేహాని ఎందుకు తీసుకోలేదు..?

టిల్లు స్క్వేర్‌లో నేహా ప్లేస్‌లో అనుపమ పరమేశ్వరన్‌ను తీసుకున్నారు. హీరోతో గొడవ కారణంగా నేహా తప్పుకుందన్న వార్తలొచ్చాయి. అయితే, సీక్వెల్లో ఎందుకు లేదో చెప్పుకొచ్చింది నేహా. టాలీవుడ్‌లో చిన్న హీరోల పాలిట అందాల దేవతగా నేహా శెట్టి నిలిచింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 18, 2023 | 08:52 PMLast Updated on: Sep 18, 2023 | 8:52 PM

Why Radhika Alias Neha Shetty Is Not Part Of Dj Tillu 2 Here Is The Clarity

Tillu Square: డిజె టిల్లు హిట్‌ తర్వాత టిల్లు స్క్వేర్‌లో కూడా నేహా శెట్టి ఉంటుందని అందరూ ఊహించారు. కానీ.. టిల్లు స్క్వేర్‌లో నేహా ప్లేస్‌లో అనుపమ పరమేశ్వరన్‌ను తీసుకున్నారు. హీరోతో గొడవ కారణంగా నేహా తప్పుకుందన్న వార్తలొచ్చాయి. అయితే, సీక్వెల్లో ఎందుకు లేదో చెప్పుకొచ్చింది నేహా. టాలీవుడ్‌లో చిన్న హీరోల పాలిట అందాల దేవతగా నేహా శెట్టి నిలిచింది. అందాల తారలకు కేరాఫ్‌ అడ్రెస్‌ మంగళూరులో పుట్టిన నేహాశెట్టి మోడల్‌గా కెరీర్‌ స్టార్ట్ చేసి, మెహబూబా మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది.

నేహా 2018లోనే ఎంట్రీ ఇచ్చినా బిజీ కావడానికి ఐదేళ్లు పట్టింది. డిజె టిల్లుతో పాపులర్‌ అయి, యంగ్ హీరోలతో వరుస సినిమాలు చేసేస్తోంది. డిజె టిల్లుతో గ్లామర్ హీరోయిన్‌గానే ముద్ర పడడంతో అలాంటి రోల్సే వస్తున్నాయి. ఈ అమ్మడు ప్రస్తుతం రూల్స్‌ రంజన్‌, గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి అనే సినిమాల్లో నటిస్తోంది. నేహాశెట్టి ఏ సినిమా చేసినా రొమాంటిక్‌ సాంగ్‌ వుండాల్సిందే. సినిమా నుంచి అదే ఫస్ట్ సింగిల్‌గా రావాల్సిందే. సాధారణంగా సీక్వెల్లో హీరో, హీరోయిన్లు కంటిన్యూ అవుతూ వుంటారు. ఒక్కోసారి హీరోయిన్‌ మారిపోవచ్చు. కానీ, డీజే టిల్లులో నేహా నటించడం లేదు.

డిజె టిల్లుతో సంబంధం లేకుండా.. కొత్త కథతో టిల్లు స్క్వేర్‌ వుండడంతో మరో హీరోయిన్‌ను తీసుకున్నారంటోంది అనుపమ. సీక్వెల్‌ క్లైమాక్స్‌లో నేహా కనిపిస్తుందన్న కథనాలు వస్తున్నాయి. గెస్ట్ అపీరియన్స్‌ ఇస్తున్నారా? అని అడిగితే.. వెయిట్ అండ్‌ సీ అంటూ తప్పుకుంది ఈ కుర్ర బ్యూటీ. మొత్తానికి సినిమాపై ఒక క్లారిటీ అయితే వచ్చింది. డీజే టిల్లుకి టిల్లు స్క్వేర్ సీక్వెల్ కాదు.