Ritu Varma: మరో మెగా కోడలిగా ఫోకస్ అవుతున్న రీతూ వర్మ..!

నిజానికి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠికి ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చాడు బన్నీ. ఆపార్టీకి వరుణ్, లావణ్యతో పాటు మెగా యూత్ మొత్తం వచ్చింది. అంతవరకు బానే ఉంది. కాని కొన్ని ఫ్రేముల్లో రీతూవర్మ కూడా కనిపించింది. తను అసలు మెగా హీరోలతో ఒక్క సినిమా కూడా చేయలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 17, 2023 | 07:06 PMLast Updated on: Oct 17, 2023 | 7:06 PM

Why Ritu Varma In Mega Family Picture Is She In Relationship With Mega Hero

Ritu Varma: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రి వెడ్డింగ్ పార్టీలో మరో మెగా కోడలు తళుక్కుమంది. తనెవరో కాదు.. పెళ్లిచూపులు, టక్ జగదీష్ లాంటి మూవీలతో ఫోకస్ అయిన హీరోయిన్ రీతూ వర్మ. నిజంగా మరో మెగా కోడలు అంటూ ఇప్పడు ఈమె పేరే వైరలవుతోంది. నిజానికి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠికి ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చాడు బన్నీ. ఆపార్టీకి వరుణ్, లావణ్యతో పాటు మెగా యూత్ మొత్తం వచ్చింది. అంతవరకు బానే ఉంది. కాని కొన్ని ఫ్రేముల్లో రీతూవర్మ కూడా కనిపించింది.

తను అసలు మెగా హీరోలతో ఒక్క సినిమా కూడా చేయలేదు. అయినా తను ఈ పార్టీలోకనిపించటం సింక్ అవ్వట్లేదు ఫ్యాన్స్‌కు. సరే నితిన్ తన వైఫ్‌తో పాటు వచ్చాడంటే వరుణ్ ఫ్రెండ్ కాబట్టి వచ్చాడనుకోవచ్చు. మరి రీతూ వర్మ, తను కూడా లావణ్య ప్రెండ్‌గా వచ్చిందా..? అంటే వాళ్లిద్దరికీ స్నేహం ఉన్నట్టు ఎక్కడా చిన్న వార్తలేదు. సరే స్నేహం ఉంటే ఉండొచ్చు. కానీ, ఎక్స్‌క్లూజివ్ పార్టీలో మెగా వారసులతో రీతూ వర్మ దిగిన ఫోటో చూసి తను మరో లావణ్య త్రిపాఠి అంటున్నారు. ఎందుకంటే, లావణ్య త్రిపాఠి కూడా వరుణ్ తేజ్ తన ప్రేమ వ్యవహారం తేల్చకముందు మెగా ఈవెంట్లు, మెగా హీరోల ఇంట్లో జరిగే ఫంక్షన్లలో సందడి చేసింది.

ఇప్పుడు రీతూ వర్మ కూడా అలానే సందడి చేయటంతో మరో మెగా కోడలంటున్నారు. ఐతే మెగా హీరోల్లో బ్యాచిలర్స్ అంటే, సాయితేజ్, వైష్ణవ్ తేజ్, శిరీషే మిగిలారు. వీళ్లలో రీతూ వర్మ ఎవరి గాల్ ఫ్రెండ్ అంటే మాత్రం ఆన్సర్ లేదు.