Anil Ravipudi : అనిల్ రావిపూడి కి ఎందుకు ఎదురు చూపులు..

భగవంత్‌ కేసరి రిలీజై 50 రోజులు అవుతున్నా అనిల్‌ రావిపూడి నెక్ట్స్‌ మూవీపై క్లారిటీ రాలేదు. ఇప్పటివరకు మూడు ఆప్షన్స్‌ వుంటే.. రోజులు గడుస్తున్న కొద్దీ.. చివరికి ఒక్కటే మిగిలింది. అదైనా.. వర్కవుట్ అవుతుందా? ఇంతకీ అనిల్‌ ముందున్న ఆప్షన్‌ ఏంటి? భగవంత్‌ కేసరి రిలీజ్‌ కాకుండానే.. అనిల్‌ చిరంజీవిని డైరెక్టర్‌ చేస్తాడని.. దిల్‌ రాజు నిర్మాత అంటూ ప్రచారం సాగింది. చిరంజీవితో సినిమా అనుకున్నా.. ఆయనతో ఇంకా మాట్లాడింద లేదన్నాడు దర్శకుడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 10, 2023 | 12:46 PMLast Updated on: Dec 10, 2023 | 12:46 PM

Why Wait For Anil Ravipudi

భగవంత్‌ కేసరి రిలీజై 50 రోజులు అవుతున్నా అనిల్‌ రావిపూడి నెక్ట్స్‌ మూవీపై క్లారిటీ రాలేదు. ఇప్పటివరకు మూడు ఆప్షన్స్‌ వుంటే.. రోజులు గడుస్తున్న కొద్దీ.. చివరికి ఒక్కటే మిగిలింది. అదైనా.. వర్కవుట్ అవుతుందా? ఇంతకీ అనిల్‌ ముందున్న ఆప్షన్‌ ఏంటి? భగవంత్‌ కేసరి రిలీజ్‌ కాకుండానే.. అనిల్‌ చిరంజీవిని డైరెక్టర్‌ చేస్తాడని.. దిల్‌ రాజు నిర్మాత అంటూ ప్రచారం సాగింది. చిరంజీవితో సినిమా అనుకున్నా.. ఆయనతో ఇంకా మాట్లాడింద లేదన్నాడు దర్శకుడు. ఒకవేళ మాట్లాడి కథ ఓకె అయినా.. ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్‌ వుండదు. మెగాస్టార్‌ ఇంకో ఏడాదిపాటు.. వశిష్ట సినిమాతోనే వుంటాడు. ఈ సోషియో ఫాంటసీ మూవీ పూర్తి కావడానికి ఏడాది పడుతుందట. ఆతర్వాతే అనిల్‌కు ఛాన్స్‌ . అప్పటివరకు ఖాళీ కూర్చోలేని ఈ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్ మరో ఆప్షన్‌ ఎంచుకోవాల్సిందే.

అనిల్ రావిపూడి తీసిన ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్స్‌లో ఎఫ్2ది టాప్‌ ప్లేస్‌. సీక్వెల్‌గా ఎఫ్‌3 తీస్తూ.. ఫ్రాంఛైజీగా కొనసాగిస్తామన్నారు. ఈక్రమంలో వెంకటేశ్‌.. వరుణ్‌ డేట్స్‌తో పెద్ద ప్రాబ్లమ్‌ కాదు కాబట్టి.. భగవంత్ కేసరి తర్వాత ఎఫ్‌4 తీసే ఛాన్స్‌ తీస్తాడనుకున్నారు. ఎఫ్‌3 కమర్షియల్‌గా బ్రేక్‌ ఈవెన్‌ అయినా.. ఎఫ్‌2ను మించి లేకపోవడంతో అనిల్‌ ఇప్పట్లో ఎఫ్‌4 స్టార్ట్ చేయాలనుకోవడం లేదు దర్శకుడు. స్టార్‌ను డైరెక్ట్‌ చేసే ఛాన్స్‌ అనిల్‌కు లేదు. అందరూ బిజీనే. దీంతో అనిల్‌ ముందున్నమరో ఆప్షన్‌ రవితేజ. రాజా దిగ్రేట్‌ హిట్ తర్వాత ఈ హిట్‌ కాంబో రిపీట్‌ కాలేదు. రవితేజ, గోపీచంద్‌ మలినేని సినిమా వాయిదాపడడంతో.. ఆ డేట్స్‌ను అనిల్‌కు ఇచ్చే ఛాన్స్‌ వుంది. అయితే కథ రెడీ చేయడానికి ఇంకో నాలుగు నెలలు పడుతుంది. హిట్‌ ఇచ్చిన అనిల్‌ కోసం.. మాస్‌ రాజా వెయిట్‌ చేస్తాడేమో చూడాలి.