వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే నాకెందుకు అసూయ, కుండబద్దలు కొట్టిన సమంత

హీరోయిన్ సమంత జీవితం ప్రతీ ఒక్కరికీ తెరిచిన పుస్తకమే. ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికి తెలిసినవే. తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగ చైతన్య, సమంతలు 2017లో పెళ్లి చేసుకున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 7, 2025 | 02:14 PMLast Updated on: Feb 07, 2025 | 2:14 PM

Why Would I Be Jealous If They Both Got Married

హీరోయిన్ సమంత జీవితం ప్రతీ ఒక్కరికీ తెరిచిన పుస్తకమే. ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికి తెలిసినవే. తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగ చైతన్య, సమంతలు 2017లో పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇండస్ట్రీలో బెస్ట్ జోడిగా ఉంటారనుకునేలోపే వీరు విడిపోయారు. పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. సమంత ప్రస్తుతం ఒంటరికి ఉంటున్నారు. సమంతతో విడాకులు తర్వాత నాగ చైతన్య శోభితతో రిలేషన్‌లో ఉన్నాడు. నాగ చైతన్య శోభితతో ఉన్న బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలనుకున్నాడు. మరోవైపు సమంత మాత్రం సింగిల్‌గానే ఉంటూ వస్తున్నారు. ఆ మధ్య బాలీవుడ్ దర్శకుడు రాజు నిడుమోరుతో సమంత ప్రేమలో ఉందని, త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి.

ఇటీవలే రాజు నిడుమోరుతో సమంత ఎక్కువగా కనిపిస్తున్నారు. దీంతో వీరి మధ్య ఏదో నడుస్తుందనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. మరోవైపు సమంతతో విడాకులు తర్వాత నాగ చైతన్య , శోభితతో రిలేషన్‌లో ఉన్నాడు. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో వీరి వివాహం చాలా సింపుల్‌గా జరిగింది. అయితే వీరి పెళ్లిపై మొదటిసారి సమంత ఓ ఇంటర్య్వూలో మాట్లాడారు. రీసెంట్‌గా సామ్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతన్య రెండో పెళ్లిపై ప్రశ్న ఎదురవడంతో ఆమె రియాక్ట్ అయింది. మీ మాజీ భర్త జీవితంలోకి మరో అమ్మాయి రావడంతో మీరు ఏమైనా అసూయ పడుతున్నారా ? అంటూ సదరు యాంకర్ సమంతను ప్రశ్నించారు. దీనిపై చాలా క్లియర్‌గా ఆన్సర్‌ ఇచ్చింది సమంత.. ”నా జీవితంలో అసూయకు తావులేదు. నా జీవితంలో అది భాగం కావడాన్ని కూడా అంగీకరించను. అసూయే అన్ని చెడులకు మూలమని నేను భావిస్తాను. కాబట్టి నాకు వాళ్లపై ఎలాంటి అసూయ లేదు. అలాంటి వాటి గురించి ఆలోచించను” అని చెప్పుకొచ్చింది. నాగ చైతన్య రెండో పెళ్లిపై సమంత చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.