మెగా మల్టీ స్టారర్ షురూ అవుతుందా..? ఎక్సపెక్ట్ చేయని రేంజ్ లో.
టాలీవుడ్ లో మెగా మల్టీస్టారర్ కు రంగం సిద్ధం అవుతుంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మల్టీస్టారర్ కోసం కథ రెడీ అయిపోయింది. మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే రామ్ చరణ్ అభిమానులు అందరూ కూడా వీళ్ళ ముగ్గురి కాంబినేషన్లో ఒక సినిమా కోసం ఎప్పటినుంచో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు.
టాలీవుడ్ లో మెగా మల్టీస్టారర్ కు రంగం సిద్ధం అవుతుంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మల్టీస్టారర్ కోసం కథ రెడీ అయిపోయింది. మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే రామ్ చరణ్ అభిమానులు అందరూ కూడా వీళ్ళ ముగ్గురి కాంబినేషన్లో ఒక సినిమా కోసం ఎప్పటినుంచో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అప్పుడెప్పుడో ఆరేళ్ల క్రితం సుబ్బరామిరెడ్డి, చిరంజీవి.. పవన్ కళ్యాణ్ తో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నానని ప్రకటన కూడా చేశారు.
ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ కూడా రెడీ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే అప్పట్లో బడ్జెట్ దాదాపు 150 కోట్ల వరకు కావడంతో ఈ విషయంలో సుబ్బిరామిరెడ్డి వెనకడుగు వేశారు. అయితే అప్పుడు మెగా ఫ్యామిలీలో విభేదాలు కూడా ఓ రేంజ్ లో ఉండటంతో ఈ సినిమా వచ్చే ఛాన్స్ లేదనే ప్రచారం కూడా పెద్దగానే జరిగింది. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ లో విభేదాలు తొలగిపోయాయి పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితానికి చిరంజీవి తన వంతు సహాయ సహకారాలు అందించారు. ఇక తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చిరంజీవి వద్దకు వెళ్లి కాళ్లు మొక్కిమరి ధన్యవాదాలు చెప్పారు పవన్ కళ్యాణ్.
ఇక చిరంజీవి అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు సినిమాలను మంచి స్వింగ్ లో చేయడంతో… ఈ మల్టీస్టారర్ విషయంలో వెనకడుగు వేయవద్దని సుబ్బిరామిరెడ్డి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా రోటీ కాపడా సినిమా డైరెక్టర్ విక్రమ్ రెడ్డి మెగా మల్టీ స్టార్ చేయబోతున్నట్లు ఒక ప్రకటన చేశారు. మెగాస్టార్ చిరంజీవి అలాగే రామ్ చరణ్ తో కలిసి మల్టీస్టారర్ చేయబోతున్నానని దీనికి కథ కూడా రెడీగా ఉందంటూ ఆయన ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. అయితే ఆ కథ రెడీగా ఉందా లేదా అనేది దానిపై క్లారిటీ లేదు కానీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా యాక్ట్ చేయబోతున్నారని సినీ వర్గాలు అంటున్నాయి.
ఈ సినిమా బడ్జెట్ దాదాపు 250 కోట్ల వరకు అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి రెండు సినిమాలు లైన్ లో పెట్టగా పవన్ కళ్యాణ్ మూడు సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాల తర్వాత చిరంజీవి మల్టీ స్టార్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. చిరంజీవి వయసు కూడా పెరిగిపోవడంతో ఇదే కరెక్ట్ సమయం అని, మెగా అభిమానుల కోరిక నెరవేర్చడానికి ఇప్పుడే సినిమా మొదలు పెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారు అటు చిరంజీవి కూడా కాస్త స్లోగా సినిమాలు చేస్తున్నారు. మరి ఈ ప్రాజెక్టు విషయంలో పవన్ కళ్యాణ్ నుంచి ఎంతవరకు సపోర్ట్ ఉంటుందో చూడాలి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న మూడు సినిమాలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయో చెప్పలేని పరిస్థితి ఉంది.