చిరంజీవి పక్కా, మరి బన్నీ వస్తాడా…? హార్ట్ బీట్ పెరిగిపోతుంది…
మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ గా ఉండే వార్ ఇప్పుడు కొణిదెల వర్సెస్ అల్లుగా మారిపోయింది. ఏ ముహూర్తంలో అల్లు అర్జున్ తన ఫ్రెండ్ కోసం ఎన్నికల ప్రచారం చేసారో ఆ తర్వాతి నుంచి వీరి మధ్య విభేదాలు ఏదోక సందర్భంలో బయట పడుతూనే ఉన్నాయి.
మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ గా ఉండే వార్ ఇప్పుడు కొణిదెల వర్సెస్ అల్లుగా మారిపోయింది. ఏ ముహూర్తంలో అల్లు అర్జున్ తన ఫ్రెండ్ కోసం ఎన్నికల ప్రచారం చేసారో ఆ తర్వాతి నుంచి వీరి మధ్య విభేదాలు ఏదోక సందర్భంలో బయట పడుతూనే ఉన్నాయి. ఇక ఇటీవల అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలతో ఆ వివాదం మరింత పెద్దది అయిందనే చెప్పాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో చిన్నపాటి యుద్దమే నడుస్తోంది వీరి ఫ్యాన్స్ మధ్య. దానికి తోడు జనసేన నేతలు కూడా పెట్రోల్ పోసి వివాదాన్ని మరింత పెద్దది చేస్తున్నారు.
ఇప్పుడు ఒక ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటీ అంటే… త్వరలో నందమూరి బాలకృష్ణ సినిమా రంగంలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరు అవుతున్నారు. ఇదే వేడుకకు అల్లు అర్జున్ ని సైతం ఆహ్వానించారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో జరగబోయే భారీ వేడుకకు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి… ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్, తెలంగాణ స్టేట్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ అనుపమ రెడ్డి, మా అసోసియేషన్ నుండి మాదాల రవి, శివ బాలాజీ, నిర్మాత ముత్యాల రామదాసు సహా పలువురు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ… బాలయ్యతో నాకు మంచి అనుబంధం ఉందని నేను తప్పకుండా వస్తా అని అన్నారట. అయితే ఇదే వేడుకలకు చిరంజీవి కూడా రావడంతో అల్లు అర్జున్ హాజరు అవుతారా లేదా అన్నది ప్రశ్నగా మారింది. అల్లు అర్జున్ వస్తే అక్కడ ఉన్న మెగా ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు, ఒకవేళ చిరంజీవి, అల్లు అర్జున్ కలుసుకుంటారా… అల్లు అరవింద్ కూడా వస్తారు కాబట్టి ఆయన చిరంజీవితో మాట్లాడే ప్రయత్నం చేస్తారా అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.