Balayya : ఆ యాక్షన్‌ ఎపిసోడ్‌లో ఇరగదీస్తాడా.?

నందమూరి నటసింహం (Nandamuri Natasimham) బాలకృష్ణ (Balakrishna) వరుస సినిమాలతో జోరుమీదున్నారు. ఈ మధ్య కాలంలో హిట్లు మీద హిట్లు కొడుతూ హ్యాట్రిక్‌ను నమోదు చేసుకున్న బాలయ్య.. మరింత ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 25, 2024 | 10:20 AMLast Updated on: Mar 25, 2024 | 10:20 AM

Will Balayya Play A Role In That Action Episode

నందమూరి నటసింహం (Nandamuri Natasimham) బాలకృష్ణ (Balakrishna) వరుస సినిమాలతో జోరుమీదున్నారు. ఈ మధ్య కాలంలో హిట్లు మీద హిట్లు కొడుతూ హ్యాట్రిక్‌ను నమోదు చేసుకున్న బాలయ్య.. మరింత ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన దర్శకుడు బాబీ కాంబినేషన్‌ లో ఓ సినిమా చేస్తున్నాడు. NBK109గా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా 1980 దశకం నాటి కథతో రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే షెడ్యూల్ లో ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ షూట్ ను స్టార్ట్ చేయబోతున్నారని ఓ టాక్ వినిపిస్తోంది. అయితే.. దీనికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రస్తుతం ఈ సీక్వెన్స్ కోసం భారీ సెట్ వేస్తున్నట్లు ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సీక్వెన్స్ లో బాలయ్య ఓ రేంజ్ లో యాక్షన్ ఇరగదీస్తాడని తెలుస్తోంది. ఈ సినిమాలోని యాక్షన్ విజువల్స్ కూడా వండర్ ఫుల్ గా ఉంటాయట. పైగా ఈ సీక్వెన్స్ కోసం బాలయ్య సరికొత్త గెటప్ లో కనిపిస్తాడంటూ వార్తలు వైరల్‌గా మారాయి. కాగా.. క్రేజీ యాక్షన్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో బాలయ్య చేస్తున్న పాత్ర గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇందులో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో బాలకృష్ణ మూడు గెటప్‌లలో కనిపిస్తాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వినిపిస్తున్న ఈ క్రేజీ న్యూస్ ఫిలిం నగర్‌లో (Film Nagar) లీక్ అయింది. దీంతో.. బాలయ్య బాబు మాస్‌ యాక్షన్‌ కోసం నందమూరి ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ఇక.. ఈ మూవీలో వయసు పెరిగిన స్టైలిష్ లుక్‌తో బాలకృష్ణ మెస్మరైజ్ చేసేలా ఉంటాడట. ఆయన గత చిత్రాల్లో ఎప్పుడూ కనిపించని విధంగా ఉండబోతున్నాడట.. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్‌ఫోర్ సినిమాపై సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.. కాగా ఈ చిత్రంలో ఊర్వశి రౌటేలా (Urvashi Rautela) , బాబీ డియోల్, చాందిని చౌదరి మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.