Chiranjeevi: అన్‌స్టాపబుల్ మూడో సీజన్‌లో మెగా ఎపిసోడ్.. చిరు వస్తారా..?

ఈ మూడో సీజన్‌లో అయినా మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా వస్తాడా..? తనకి బాలయ్య ప్రశ్నలతో వెల్‌కమ్ చెబుతాడా..? ఈ డౌట్లు పెరిగిపోయాయి. ఐతే రెండో సీజన్‌లోనే చిరుతో ఓ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. కానీ, కుదర్లేదు. ఐతే త్రివిక్రమ్ పుణ్యమాని అన్‌స్టాపబుల్ షో కి పవన్ కళ్యాణ్ వచ్చాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 12, 2023 | 05:53 PMLast Updated on: Oct 12, 2023 | 5:53 PM

Will Chiranjeevi Participate In Ahas Unstoppable Show

Chiranjeevi: బాలయ్య హోస్ట్‌గా ఆహాలో నడుస్తోన్న టాక్ షో అన్‌స్టాపబుల్. ఇప్పటికే రెండు సీజన్‌లు కంప్లీటై మూడో సీజన్ వచ్చే వారం మొదలు కాబోతోంది. 17న టెలికాస్ట్ కాబోయే ఎపిసోడ్‌లో భగవంత్ కేసరి టీం సందడి చేయబోతోంది. ఆ ఎపిసోడ్ షూటింగ్ పూర్తైంది. ప్రోమో సందడి మొదలైంది. సరే ఇవన్నీ పక్కన పెడితే ఈ మూడో సీజన్‌లో అయినా మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా వస్తాడా..? తనకి బాలయ్య ప్రశ్నలతో వెల్‌కమ్ చెబుతాడా..? ఈ డౌట్లు పెరిగిపోయాయి. ఐతే రెండో సీజన్‌లోనే చిరుతో ఓ ఎపిసోడ్ ప్లాన్ చేశారు.

కానీ, కుదర్లేదు. ఐతే త్రివిక్రమ్ పుణ్యమాని అన్‌స్టాపబుల్ షో కి పవన్ కళ్యాణ్ వచ్చాడు. సందడి చేశాడు. ఆ ఎపిసోడ్ ఏరేంజ్‌లో వైరలైందో తెలిసింది. మరి ఇప్పుడు ఒకే స్క్రీన్ మీద బాలయ్య, చిరు ఉంటే.. అది ఓ టాక్ షో అయితే ఎలా ఉంటుంది..! మెగా ఫ్యాన్స్‌కి, నందమూరి ఫ్యాన్స్‌కి ఊహించనంత కిక్కు కన్పామ్. ఐతే రెండో సీజన్‌లో మిస్ అయిన ఈ మ్యాజిక్ మూడో సీజన్‌లో ఉంటుందా అంటే డౌటే..! కారణం.. ప్రస్తుతం చిరు మోకాళ్ల సర్జరీ తర్వాత ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు. కాబట్టి మరో రెండు నెలల వరకు అన్‌స్టాపబుల్ షోకి ఛాన్స్ లేదు. అంతమాత్రనికే నాలుగో సీజన్‌లో చిరు ఎపిసోడ్ అంటున్నారు.

కాని మూడో సీజన్‌లోనే మెగాస్టార్ గెస్ట్‌గా షో ఉండొచ్చని తెలుస్తోంది. అన్‌స్టాపబుల్ షో వచ్చే వారం మొదలవుతోంది. సో.. చివరి ఎపిసోడ్‌లోగా చిరు కోలుకుంటే షోకి వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టే.. చిరు కోసం ప్రశ్నలు, ప్లానింగ్ మొత్తం జరిగాయి. వన్స్ చిరు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే బాలయ్య వర్సెస్ చిరు అన్‌స్టాపబుల్ షో కన్పామ్ అయినట్టే.