Pawan Renu : సెకండ్ మ్యారేజ్ ని ఎంజాయ్ చేస్తా..
హీరో పవర్ స్టార్ (Pawan Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎలక్షన్స్ లో పోటీచెయ్యడం..రికార్డు మెజారిటీ తో గెలవడం.. ఆయన పార్టీ కాండిడేట్స్ అందరు కూడా గెలవడం.. పవన్ మాజీ వైఫ్ రేణుదేశాయ్ కంగ్రాట్స్ చెప్పడం..ఇలా అన్ని చకచకా జరిగిపోయాయి.

Will enjoy second marriage
హీరో పవర్ స్టార్ (Pawan Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎలక్షన్స్ లో పోటీచెయ్యడం..రికార్డు మెజారిటీ తో గెలవడం.. ఆయన పార్టీ కాండిడేట్స్ అందరు కూడా గెలవడం.. పవన్ మాజీ వైఫ్ రేణుదేశాయ్ కంగ్రాట్స్ చెప్పడం..ఇలా అన్ని చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు రేణు దేశాయ్ చేసిన నయా కామెంట్స్ కూడా చక చకా వైరల్ అవుతున్నాయి
పవన్, రేణు దేశాయ్ (Renu Desai) 2012 లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పవన్ వేరే వివాహం చేసుకొని సెటిల్ అయ్యాడు. కానీ రేణు దేశాయ్ మాత్రం పెళ్లి చేసుకోలేదు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యక్తితో ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. కానీ ఆ తర్వాత క్యాన్సిల్ చేసుకుంది. దీంతో ఇక ఆమె పెళ్లి చేసుకోదని అందరు భావించారు. కానీ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. నాకు మ్యారేజ్ లైఫ్ కావాలి. అందరిలా నేను కూడా మ్యారేజ్‌లైఫ్‌ని ఎంజాయ్ చెయ్యాలి.కాకపోతే ఇంకో రెండు మూడేళ్ళ తర్వాత చేసుకుంటానని చెప్పింది. లేటు ఎందుకు అవుతుందనే విషయం మీద క్లారిటీ కూడా ఇచ్చింది. ఇప్పుడు అకిరా, ఆధ్య ఇద్దరు చిన్నపిల్లలు. కాబట్టి ఇప్పుడే నేను పెళ్లి చేసుకుంటే భర్తతో ఎక్కువ టైమ్ కేటాయించాల్సి వస్తుంది. దీంతో పిల్లలు ఒంటరైపోతారు. ఇప్పటికే తండ్రికి దూరంగా ఉంటున్నారు. నేను కూడా దూరమైతే ఇద్దరు ఒంటరి ఫీలింగ్‌ని ఫేస్ చేయాల్సి వస్తుంది.
మరో రెండు మూడేళ్లలో పిల్లలు పెద్ద అవుతారు. కాలేజ్‌కి వెళ్తారు. అప్పుడు వాళ్లకి ఫ్రెండ్స్, లవర్స్ అనే కొత్త లోకం ఏర్పడుతుంది. వారితోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తారు. పేరెంట్స్ మీద పెద్దగా డిపెండ్ అవ్వరు. కేవలం సపోర్టింగ్ కోసమే పేరెంట్స్ అవసరం అవుతారు. అప్పుడు నేను ఫ్రీ అవుతాను. మ్యారేజ్‌లైఫ్ ని ఎంజాయ్ చెయ్యగలుగుతానని చెప్పింది. ఇక ఎప్పటినుంచో అకిరా ఆద్యాలు కూడా రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకోమని అంటున్నారు.