ఆంధ్రాలో దేవరకొండను ఎన్టీఆర్ ఆదుకుంటాడా…? వాయిస్ ఓవర్ టార్గెట్ అదే…!
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో వస్తున్న సినిమా కింగ్డమ్. ఎప్పటినుంచొ ఎదురుచూస్తున్న టైటిల్ ను అఫీషియల్ గా బుధవారం అనౌన్స్ చేశారు. ఇక టైటిల్ తో పాటుగా టీజర్ ని కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో వస్తున్న సినిమా కింగ్డమ్. ఎప్పటినుంచొ ఎదురుచూస్తున్న టైటిల్ ను అఫీషియల్ గా బుధవారం అనౌన్స్ చేశారు. ఇక టైటిల్ తో పాటుగా టీజర్ ని కూడా రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగు వెర్షన్ కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెప్పగా తమిళ్ వర్షన్ కు సూర్య, హిందీ వర్షన్ కు రణబీర్ కపూర్ వాయిస్ అందించారు. ఈ వాయిస్ ఓవర్ కు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ముగ్గురు హీరోలు ప్రాణం పెట్టి విజయ్ దేవరకొండ కోసం వాయిస్ ఇచ్చారు.
ఇక ఈ సినిమాను వేరే లెవల్ కు తీసుకెళ్లేందుకు మూవీ మేకర్స్ నానా కష్టాలు పడుతున్నారు. ఎలాగైనా సరే సినిమాతో హిట్టు కొట్టి పాన్ ఇండియా లెవెల్లో తన దమ్ము ఏంటో చూపించాలని విజయ్ దేవరకొండ కమిట్మెంట్ తో వర్క్ స్టార్ట్ చేశాడు. ఇక టీజర్ విడుదల తేదీ అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గరనుంచి సినిమాపై హైప్ వేరే లెవెల్ లో పెరిగింది. ఇక ఎన్టీఆర్ వాయిస్ ఇస్తున్నాడు అనగానే ఎన్టీఆర్ అభిమానులు కూడా పండగ చేసుకున్నారు. సాధారణంగా ఇలాంటి వాయిస్ ఇచ్చే విషయంలో ఎన్టీఆర్ తాను ఏంటి అనేది ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు.
త్రిబుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ కు ఎన్టీఆర్ వాయిస్ ఇచ్చాడు. ఆ టీజర్ అప్పట్లో సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు మరోసారి విజయ్ దేవరకొండ కోసం ఎన్టీఆర్ వాయిస్ ఇవ్వడంతో, ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని, విజయ్ దేవరకొండ పాన్ ఇండియా లేవలో హీరోగా దుమ్ము రేపుతాడని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఈ ఏడాది మే 30న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాపై విజయ్ దేవరకొండ తో పాటుగా డైరెక్టర్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు.
ఇక ఈ సినిమాకు ముఖ్యంగా ఆంధ్రాలో మార్కెట్ పెంచాలని టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి విజయ్ దేవరకొండ సినిమాలు ఆంధ్రాలో మార్కెట్ చాలా తక్కువ. అలాగే కన్నడలో కూడా తన సినిమాలకు రేంజ్ పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ వాయిస్ ఇవ్వటంతో కచ్చితంగా ఈ సినిమాకు ఆంధ్రాలో కూడా క్రేజ్ పెరిగే అవకాశం ఉంది అని మేకర్స్ ధీమాగా ఉన్నారు. ఎన్టీఆర్ కు తెలంగాణ కంటే ఆంధ్రాలో ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇక విజయ్ దేవరకొండకు తెలంగాణలో ఇబ్బంది లేకపోయినా ఆంధ్రాలో మాత్రం కలెక్షన్లు చాలా తక్కువగా ఉంటాయి. గతంలో అతని సినిమాలకు ఆంధ్రాలో అంతగా క్రేజ్ లేదనే చెప్పాలి. ఇప్పుడు ఎన్టీఆర్ వాయిస్ ఇవ్వటంతో కచ్చితంగా నందమూరి అభిమానులతో పాటుగా నార్మల్ ఆడియన్స్ కూడా ఈ సినిమాను చూసే ఛాన్స్ ఉంది. దీనితో కలెక్షన్లు కూడా భారీగా వస్తాయని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే నిర్మాత సూర్యదేవర నాగావంశి.. ఎన్టీఆర్ ను పట్టుబట్టి ఒప్పించాడు.