Pooja Hegde : పూజా హెగ్డే కష్టాలు తీరనున్నాయా?

టాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్‌ పూజాహెగ్డేకు కష్టాలు తీరుతున్నాయి. వరుస ఫ్లాపులు ఒకవైపు ఇబ్బందిపెడుతుంటే.. మరోవైపు.. చేతికొచ్చిన ఆఫర్స్‌ జారిపోతున్నాయి. కష్టాల్లో వున్న పూజాను యంగ్‌ హీరోలు ఆదుకుంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 9, 2023 | 11:34 AMLast Updated on: Dec 09, 2023 | 11:34 AM

Will Pooja Hegdes Troubles Be Over

టాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్‌ పూజాహెగ్డేకు కష్టాలు తీరుతున్నాయి. వరుస ఫ్లాపులు ఒకవైపు ఇబ్బందిపెడుతుంటే.. మరోవైపు.. చేతికొచ్చిన ఆఫర్స్‌ జారిపోతున్నాయి. కష్టాల్లో వున్న పూజాను యంగ్‌ హీరోలు ఆదుకుంటున్నారు. వాళ్లెవరో చూసేద్దామా. సవరుస ఫ్లాపులు పూజాహేగ్డేని ఇబ్బంది పెట్టడమే కాదు.. చేతిలో వున్న ఆఫర్స్‌ను కూడా లాక్కెళ్లిపోయాయి. గురూజీనే నమ్ముకుని గుంటూరు కారం’లో చాన్స్‌ సంపాదిస్తే.. ఫ్లాప్‌ హీరోయిన్‌ ముద్ర పూజాను ఇబ్బంది పెట్టింది. ఈ ప్లేస్‌ను శ్రీలీల భర్తీ చేసింది. పూజాహెగ్డే సైన్‌ చేసిన గుంటూరు కారమే కాదు.. ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ కూడా చేజారింది. దువ్వాడ జగన్నాథమ్‌.. గద్దలకొండ గణేశ్‌తో కలిసి రావడంతో.. ఉస్తాద్‌లోనూ పూజానే తీసుకోవాలనుకున్న దర్శకుడు హరీశ్‌ శంకర్ కల తీరలేదు.

పూజాహెగ్డే హిందీలో షాహిద్‌ కపూర్‌తో జత కట్టే ఛాన్స్‌ అందుకున్నా.. తెలుగులో ఆఫర్స్‌ దక్కడం లేదు. పెద్ద హీరోలేమో.. పూజా వైపు చూడడం లేదు. ఖాళీగా వుంటే ఆస్తులు కరిగిపోతాయి. ఏదో ఒక సినిమా చేయకపోతే.. ఫేడౌట్‌ అయిపోతామన్న భయంతో హీరోలతో నటించడానికి రెడీ అయింది పూజా. సాయిధరమ్ తేజ్‌ నటిస్తున్న గంజాలో పూజా పేరు వినిపిస్తోంది. ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ పూజా.. యంగ్ హీరోల భామగా మారిపోతోంది. తమిళ హిట్‌ డాన్‌ తీసిన శిబి చక్రవర్తి నానీతో సినిమా కమిటయ్యాడు. ఇందులో హీరోయిన్‌గా పూజా పేరు వినిపిస్తోంది. గతంలో మూడు కోట్లు డిమాండ్‌ చేసిన పూజా.. ప్రస్తుతం రెండు కోట్లతో సరిపెట్టుకుంటోందట. ఖాళీగా కూర్చొని ఫేడౌట్‌ కావడం కంటే.. యంగ్ హీరోలతో సర్దుకుపోవాలన్న ఆలోచనలో పూజా వుందట.