పాన్ ఇండియా కింగే కాపాడాలి… రాజా సాబ్ మీదే అందరి ఆశలు..

2021 నుంచి పాన్ ఇండియాని ఏదో ఒక తెలుగు సినిమా కాపాడుతూ వస్తోంది. 2021 లో పుష్ప, 2022 లో త్రిబుల్ ఆర్, 2023 ని సలార్ కాపాడింది. 2024లో అయితే ఏకంగా హనుమాన్, కల్కీ, దేవర, పుష్ప2, లక్కీ భాస్కర్ హిట్లతో పాన్ ఇండియా షేక్ అయ్యింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 3, 2025 | 08:30 PMLast Updated on: Jan 03, 2025 | 8:30 PM

Will Prabhas Rajasab Save Tollywood This Year

2021 నుంచి పాన్ ఇండియాని ఏదో ఒక తెలుగు సినిమా కాపాడుతూ వస్తోంది. 2021 లో పుష్ప, 2022 లో త్రిబుల్ ఆర్, 2023 ని సలార్ కాపాడింది. 2024లో అయితే ఏకంగా హనుమాన్, కల్కీ, దేవర, పుష్ప2, లక్కీ భాస్కర్ హిట్లతో పాన్ ఇండియా షేక్ అయ్యింది. మరి 2025 ని కాపాడేదెవరు? ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రాబోతోంది. కాని ఎవరికీ కూడా ఈ సినిమా మీద పెద్దగా హోప్స్ లేవు.
బన్నీ, మహేశ్ బాబు సినిమాలు ఈ ఏడాది వచ్చే అవకాశాలు లేవు.. వార్ 2 మూవీ ఉన్నా అది హిందీ సినిమానే కాబట్టి, ఎన్టీఆర్ సినిమా ఈ ఏడాది దుమ్ముదులిపినా అది టాలీవుడ్ ఎకౌంట్ లో పడదు.. సో ఏం చేసినా పెద్ద మనసు చేసుకుని, ది రాజా సాబే బాక్సాఫీస్ ని షేక్ చేయాలి… ఆల్రెడీ 2023 లో తెలుగు సినిమా పెద్దగా వెలగలేదు. వసూల్ల గోల లేదు.. అతి కష్టం మీద సలార్ వచ్చి 800 కోట్లతో గట్టెక్కించింది. తర్వాత కల్కీ తో 2024 సీనే మారిపోయింది. అందుకే 2025 ని కూడా కలెక్షన్స్ తో కాపాడి, హ్యాట్రిక్ తో గట్టెక్కించే బాధ్యత ది రాజా సాబ్ మీదే పడినట్టుంది…

2024 ఏడాదిని టాలీవుడ్ హీరోలు దున్నిపడేశారు. ఓపెనింగే హనుమాన్ తో హిట్ పడితే, వెంటనే కల్కీ తో సినీ సునామీ వచ్చింది. తర్వాత దేవర వసూళ్ల దరువుతో సౌత్ ని మించేలా నార్త్ మార్కెట్ షేక్ అయ్యింది. కట్ చేస్తే, సరిపోలేదా శనివారం, లక్కీ భాస్కర్ లాంటి మీడియం రేంజ్ మూవీలు కూడా హిట్టయ్యాయి..

పుష్ప2 మూవీకి సౌత్ లో టాక్ వీకైనా హిందీ మార్కెట్ వల్ల 1700 కోట్లు రాబట్టిందంటున్నారు.. ఎలా చూసినా కనీసం ఐదు పాన్ ఇండియా హిట్లు కేవలం టాలీవుడ్ నుంచే వచ్చాయి. సో 2021 నుంచి చూస్తే పుష్ప, 2022 లో త్రిబుల్ ఆర్, 2023 లో సలార్, 2024లో ఐదు పాన్ ఇండియా హిట్లు.. ఎలాచూసినా మూడేళ్లుగా తెలుగుసినిమానే పాన్ ఇండియాని ఏలుతోంది.

మరి ఈ ఏడాది పరిస్థితేంటి. 2025 తెలుగు సినిమా వెలిగే అవకాశాలు చాలా తక్కువ… కారణం ఈ ఇయర్ పాన్ ఇండియాని షేక్ చేసేంత సీన్ ఉన్న సినిమాల సంఖ్య తక్కువ. సంక్రాంతికి గేమ్ ఛేంజర్ వస్తోంది. కాని భారతీయుడు 2 రిజల్ట్ చూశాక శంకర్ మేకింగ్ మీద జనాలకు నమ్మకంపోయింది. గేమ్ ఛేంజర్, టీజర్ పాటల రెస్పాన్స్ చూస్తే ఇది గట్టెక్కడమే కష్టం అంటున్నారు

ఇక రాజమౌళి సినిమాతో మూడేళ్ల వరకు మహేశ్ అటే అంకితం.. కాబట్టి ఇప్పట్లో తన సినిమా రాదు.. ఈ ఏడాది ఛాన్సేలేదు. అల్లు అర్జున్ పుష్ప2 తర్వాత త్రివిక్రమ్ తో ప్లాన్ చేసిన సినిమా 2027లోనే అంటున్నారు కాబట్టి, ఈ ఏడాది తన సినిమా సందడికి అవకాశం లేదు. ఎన్టీఆర్ హిందీ మూవీ వార్ 2 ఆగస్ట్ 15 కి విడుదలంటున్నారు. కాని అది తెలుగు సినిమా కాదు కాబట్టి, అది పాన్ ఇండియాని షేక్ చేసినా, ఆ క్రెడిట్ టాలీవుడ్ ఎకౌంట్ లో పడదు

సో మిగిలింది ఒకే ఒక్కడు పాన్ ఇండియా కింగ్ రెబల్ స్టార్ ప్రభాస్. తన మూవీ దిరాజా సాబ్ ఏప్రిల్ 10 కి రాబోతుందన్నారు. షూటింగ్ డిలే వల్ల జూన్ కి విడుదల తేదీ మారొచ్చన్నారు. విడుదల తేదీ మారినా, ఇదే ఏడాది ఈ మూవీ రావటం పక్కా. సో ఫస్ట్ టైం తన కెరీర్ లో ప్రభాస్ చేసిన కామెడీ హర్రర్ మూవీ ఒక్కటే ఈ ఏడాది టాలీవుడ్ ని కాపాడాలి.. ఇది తప్ప ఈ ఏడాది టాలీవుడ్ నుంచి పాన్ ఇండియాని షేక్ చేసే పెద్ద మూవీ ఏది రావట్లేదు. కాబట్టి అందరి హోప్స్ పాన్ ఇండియా కింగ్ రెబల్ స్టార్ మీదే ఉన్నాయి.