పుష్ప 2 ఫ్లాప్ అయినా డబ్బులు వచ్చేస్తాయా?
తెలుగులోనే కాదు.. ఇండియాలోనే పుష్ప2 మానియా నడుస్తోంది. ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా.. రిలీజ్ కి ముందే వెయ్యి కోట్ల బిజినెస్ చేసిన తొలి ఇండియా మూవీ అంటూ మాట్లాడుతున్నారు.హైప్ పీక్స్‌కు చేరింది.ఇంతకీ పుష్ప2 థియేటరికల్ బిజినెస్ ఎంత? ఎంత వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది.
తెలుగులోనే కాదు.. ఇండియాలోనే పుష్ప2 మానియా నడుస్తోంది. ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా.. రిలీజ్ కి ముందే వెయ్యి కోట్ల బిజినెస్ చేసిన తొలి ఇండియా మూవీ అంటూ మాట్లాడుతున్నారు.హైప్ పీక్స్‌కు చేరింది.ఇంతకీ పుష్ప2 థియేటరికల్ బిజినెస్ ఎంత? ఎంత వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ? ఒక వేల ఫ్లాప్ అయినా కూడా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ లాబాల్లోనే ఉంటారట. ఇండియాలో ఏ సినిమా కూడా ఇంతవరకు వెయ్యి కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోలేదు. ఈవిషయాన్ని నిర్మాతలే చెప్పేశారు. అయితే.. ఇందులో వరల్డ్‌వైడ్ థియేటరికల్ బిజినెస్‌తోపాటు..ఓటీటీ ..శాటిలైట్.. ఆడియో రైట్స్ కూడా వున్నాయి. ఇప్పుటివరకు ఆర్‌ఆర్‌ఆర్ జరుపుకున్న థియేటరికల్ రైట్స్‌ను పుష్ప2 దాటేసింది. ఆర్‌ఆర్‌ఆర్ వరల్డ్ వైడ్ ధియేటరికల్ రైట్స్ 451 కోట్లకు అమ్ముడైతే 614 కోట్ల షేర్ .. 1152 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత ఎక్కువ బిజినెస్ జరుపుకున్న సినిమా కల్కి. ప్రపంచవ్యాప్తంగా 370 కోట్లకు అమ్ముడైతే… 519 కోట్ల షేర్.. 1018 కోట్ల గ్రాస్ తీసుకొచ్చింది. కొన్ని కొన్ని ఏరియాల్లో బ్రేక్‌ఈవెన్ కాకపోయినా.. ఓవరాల్‌గా లాభాలబాట పట్టింది. పుష్ప2 అయితే క్రేజ్‌కు మించిన బిజినెస్ జరుపుకుంది. ఇప్పటివరకు పుష్ప పేరు మీద వున్న 451 కోట్ల థియేటరికల్ రైట్స్ దాటేసి 617 కోట్లకు అమ్ముడైంది. థియేటరికల్ రైట్స్‌లో 500 కోట్ల మార్క్ దాటిన తొలి ఇండియన్‌మూవీగా పుష్ప నిలిచింది.
సుకుమార్ అసలే లెక్కల మాష్టారు. అందుకేనేమో పుష్ప2తో లెక్కల్లో రికార్డులు క్రియేట్ చేశారు. 617 కోట్ల బిజినెస్ అంటే మాటలు కాదు. సినిమా హిట్ అనిపించుచకోవాలంటే.. ముందు పెద్ద టార్గేట్టే వుంది. ఫస్ట్ డే 300 కోట్ల గ్రాస్.. 160 కోట్ల షేర్ వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పుష్ప బిజినెస్‌తో పోల్చుకుంటే..పుష్ప2 రేంజే వేరు. అసలు తగ్గేదేలేదన్న మ్యానరిజం బిజినెస్‌లో ప్రూవు అయింది . పుష్పను కేవలం 145 కోట్లకు అమ్మితే.. 185 కోట్ల షేర్… 360 కోట్ల గ్రాస్ వచ్చింది. ఫస్ట్ పార్ట్ పాన్ ఇండియా హిట్ కావడంతో.. పుష్ప2పై హైప్ క్రియేట్ కామనే అయినా.. 617 కోట్ల బిజినెస్ జరగడం షాక్ ఇస్తోంది. నైజాంలో 100 కోట్ల బిజినెస్ జరిగిన తొలి మూవీ కూడా పుష్ప2నే. అలాగే తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్ల మార్క్ దాటిన ఫస్ట్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప అన్ని భాషల్లో హిట్ కావడంతో.. అన్ని ఏరియాల్లో ప్యాన్సీ రేట్లుకు కొనేశారు. కర్నాటక.. 32 కోట్లు.. తమిళనాడు 52 కోట్లు.. మలయాళంలో 20 కోట్లు.. ఓవర్సీస్‌ఓ 100 కోట్లు.. హిందీ.. రెస్ట్ ఆఫ్ ఇండియాలో 200 కోట్ల బిజినెస్ జరుపుకుంది. ఈలెక్కన ఈ రేంజ్ బిజినెస్‌ను రాబట్టాలంటే.. మొదటి ఆటకే హిట్ టాక్ వస్తే.. టార్గెట్ ఈజీ అవుతుంది.