ఎన్టీఆర్ తొడకొడితే 510 కోట్లు… మరి ఫ్రెండ్ కొడితే…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరతో రాజమౌళి రాడార్ నుంచి బయట పడ్డాడు. జక్కన్న సపోర్ట్ లేకుండా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు మెగా గ్లోబల్ స్టార్ వంతొచ్చింది. ఒక వైపు తన కజిన్ అల్లు అర్జున్, పుష్ప2 తో నార్త్ లో దుమ్ముదులుపుతున్నాడు. 621 కోట్లు, 829 కోట్లంటూ వస్తున్న వసూళ్ల లెక్కలు డౌట్ ఫుల్ గా ఉన్నాయి.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరతో రాజమౌళి రాడార్ నుంచి బయట పడ్డాడు. జక్కన్న సపోర్ట్ లేకుండా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు మెగా గ్లోబల్ స్టార్ వంతొచ్చింది. ఒక వైపు తన కజిన్ అల్లు అర్జున్, పుష్ప2 తో నార్త్ లో దుమ్ముదులుపుతున్నాడు. 621 కోట్లు, 829 కోట్లంటూ వస్తున్న వసూళ్ల లెక్కలు డౌట్ ఫుల్ గా ఉన్నాయి. పుష్ప2 రిలీజ్ అయిన రెండో రోజే, తెలుగు బాక్సాఫీస్ లో టాక్ రివర్స్అయ్యిందన్నారు. ఇవన్నీ ఒకవైపు, నార్త్ లో మాత్రం పుష్ప2 కి వసూల్ల వరద బానే ఉందనే టాక్ మరో వైపు.. సో మొత్తంగా పుష్ప2 తో రెండో పాన్ ఇండియా హిట్ పడినట్టే అన్న మాటే బలపడుతోంది. కాని వసూళ్ల లెక్కలే కాస్త డౌట్ ఫుల్ గా ఉన్నాయనే కాన్స్ పిరసి థియరీస్ వినిపిస్తున్నాయి.. అవెలా ఉన్నా, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ ముగ్గురు గట్టెక్కారు. ఇక గేమ్ ఛేంజర్ తో గట్టెక్కాల్సిన అవసరం చరణ్ కి వచ్చింది. త్రిబుల్ ఆర్ తో ఎన్టీఆర్, చరణ్ కలిసి పాన్ ఇండియా హిట్ కొట్టారు. మరి విడిగా తారక్ దుమ్ముదులిపినట్టే తన ఫ్రెండు బాక్సాఫీస్ బెండు తీస్తాడా?
పాన్ ఇండియా పేరు చెబితే స్టార్స్ భయపడే పరిస్థితులొచ్చాయి.. అదేదో హీరోకొత్తగా మొదటి సినిమాతో ప్రూవ్ చేసుకున్నట్టు, పాన్ ఇండియా మూవీతో ప్రతీ సారి ప్రూవ్ చేసుకోవాల్సి వస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి 2 తర్వాత పాన్ ఇండియా లెవల్లో కోలుకుని, దుమ్ముదులిపేలా మార్కెట్ లో జెండా పాతేందుకు 3 సినిమాలు చేయాల్సి వచ్చింది. నాలుగో మూవీ సలార్, ఐదో మూవీ కల్కీతో పాన్ ఇండియా కింగ్ గా మారాడు ప్రభాస్
కట్ చేస్తే త్రిబుల్ ఆర్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ గ్లోబల్ స్టార్స్ గా మారారు. నాటు నాటు పాటతో హాలీవుడ్ రేంజ్ లో ఫోకస్ అయ్యారు. కట్ చేస్తే దేవర హిట్ తో పాన్ ఇండియా లెవల్లో రెండో బ్లాక్ బస్టర్ తో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా పాతుకుపోయాడు. రాజమౌళి సాయం లేకుండా సోలోగా ఎదగగలనని ప్రూవ్ చేసుకున్నాడు. దీనికి తోడు రాజమౌలి సెంటిమెంట్ ని కూడా బ్రేక్ చేశాడు. దీంతో తర్వాత వంతు రామ్ చరణ్ దే అన్నారు
ఇంతలో సీన్ లోకి పుష్పరాజ్ వచ్చాడు. భారీ హైప్ కి తగ్గట్టే పుష్ప2 ఓపెనింగ్స్ అదిరాయి.. కాని మరీ బయట వినిపిస్తున్న లెక్కలే డౌట్ ఫుల్ గా ఉన్నాయనే కామెంట్లు పెరిగాయి. అవెలా ఉన్నా, పుష్ప హిట్ కాబట్టి పుష్ప2 ఆటోమేటిగ్గా హిట్ అనుకోవాలన్నారు. సౌత్ లో టాక్ వీకవ్వటంతో సీన్ మారేలా ఉంది. కాని నార్త్ లో మాత్రం పుష్ప2 కి భానే వసూళ్లొస్తున్నాయని తెలుస్తోంది
అంటే పుష్ప 2 తో బన్నీ కూడా పాన్ ఇండియా లెవల్లో సెట్ అయినట్టే కనిపిస్తున్నాడు. సో ఎలా చూసినా త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణే రెండో పాన్ ఇండియా హిట్ తో తనని తాను ప్రూవ్ చేసుకోవాలి. తారక్ తో కలిసి చరణ్ 1350 కోట్ల వసూల్లతో త్రిబుల్ ఆర్ లాంటి హిట్ మెట్టెక్కారు. అందులో సగం ఆంటే ఆల్ మోస్ట్ 510 కోట్లతో సోలోగా తానేంటో తారక్ రెండో సారి ప్రూవ్ చేసుకుంటే, కుదిరితే 500 కోట్లు లేదంటే 6 వందలకోట్లతో పాన్ ఇండియా లెవల్లో గేమ్ ఛేంజర్ హిట్టవ్వాలి.. లేదంటే ఆచార్య గాయాలకు గేమ్ ఛేంజర్ మందురాయకపోగా పుండుమీద కారం లా మారే ఛాన్స్ ఉంది
ఎలాచూసినా పుష్ప2 టాక్ వీకైనా, నార్త్ లో వసూల్లు వీక్ అవకపోవటంతో అందరి కన్ను నెక్ట్స్ గేమ్ ఛేంజర్ మీదుంది. అసలే శంకర్ కి మేకింగ్ మీద పట్టుపోయిందనే భయాలున్న టైంలో, భారతీయుడు 2 ప్లాప్ అయిన సమయంలో, గేమ్ ఛేంజర్ వస్తోందంటే ఇది కూడా ఫ్లాపే అనుకుంటున్నారు. ఇలాంటి టైంలో పుష్ప 2 వసూళ్లు గేమ్ ఛేంజర్ ని కంగారు పెట్టే ఛాన్స్ ఉంది… ఆ వసూల్ల నిజమైనా కాకున్నా, నార్త్ వసూళ్లలో కాస్త నిజం ఉన్నట్టే కనిపిస్తోంది కాబట్టి, పాన్ ఇండియా లెవల్లో నెక్ట్స్ అగ్ని పరీక్ష గేమ్ ఛేంజర్ కే అని తేలింది..