Shankar: గోవిందా .. గోవిందా..
నిర్మాత దిల్ రాజు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ఇబ్బంది పెడుతున్న డైరెక్టర్ శంకర్.
శంకర్ ఇప్పుడు నిర్మాత దిల్ రాజునే కాదు, మెగా పవర్ స్టార్ ని అలానే మెగా ఫ్యాన్స్ ని డైలామాలో పడేస్తున్నట్టున్నాడు. ఎందుకంటే గేమ్ ఛేంజర్ ఎప్పుడొస్తుందో తేల్చట్లేదు. భారతీయుడు 2 షూటింగ్ ని నాన్చకుండా ఉండట్లేదు. ఇక అసలు విషయానికొస్తే భారతీయుడు 2 రిలీజ్ అయ్యే వరకు గేమ్ ఛేంజర్ ని విడుదల చేయకూడాదనేది మొదట్లో శంకర్ పెట్టిన కండీషన్. దానికి కట్టుబడే దిల్ రాజు ఇంతవరకు గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ తేల్చలేదు.
కాని ఇప్పుడు సీన్ చూస్తే అసలు భారతీయుడు 2 ఇప్పట్లో వస్తుందా అన్న అనుమానాలు పెరిగయి. 180 కోట్ల బడ్జెట్ ని 300 కోట్లకు పెంచిన శంకర్, ఇప్పడు భారతీయుడు 2 నిర్మాతల్ని కూల్ చేసేందుకు భారతీయుడు 3 ప్లాన్ చేశాడని, అందుకే ఆపార్ట్ ని కూడా ఇప్పుడే తీస్తున్నాడు కాబట్టే మరో వందరోజుల షూటింగ్ పెండింగ్ ఉందని ప్రచారంజరుగుతోంది.
ఇదే నిజమైతే భారతీయుడు 2, భారతీయుడు 3 తో బిజ అయ్యే శంకర్ ఎప్పుడు గేమ్ ఛేంజర్ ని పూర్తి చేస్తాడు? 90శాతం షూటింగ్ ఎప్పుడో పూర్తైందన్నారు. అలాంటి గేమ్ ఛేంజర్ నుంచి టీజర్ లేదు, సాంగ్ లేదు, అసలు రిలీజ్ ఎప్పుడో తేలట్లేదు. ఇంత కన్ ఫ్యూజన్ కి శంకరే కారణం. ఇక భారతీయుడు 2 పూర్తై, రిలీజ్ తర్వాతే గేమ్ ఛేంజర్ అన్న మాట వరకు ఓకే. కాని భారతీయుడు 3 ని కూడా శంకర్ ఇప్పడే తీస్తే దిల్ రాజుని మోసం చేసినట్టే. మెగా ఫ్యాన్స్ ని కూడా మోసం చేసినట్టే.. అదే ఇప్పుడు గొడవగా మారేలా ఉంది. భారతీయుడు 2 ఎలా వివాదాల వల్ల ఆగి ఇప్పుడు మళ్లీ తెరకెక్కుతుందో, అలానే గేమ్ ఛేంజర్ వివాదంలో చిక్కుకునేలా ఉందట. శంకర్ మీద దిల్ రాజు ఫైర్ అవుతున్నాడట.