Sanjay Dutt : సంజయ్‌ దత్‌ విలన్‌గానే స్థిరపడిపోతాడా..

నార్త్‌లో అతనో స్టార్ హీరో. సౌత్‌తో మాత్రం విలన్ పాత్రలకి పరాకాష్ఠగా మారాడు. హీరోలని డామినేట్ చేసే క్యారెక్టర్స్‌తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఇప్పటికే శాండిల్ వుడ్‌లో తన సౌండ్ వినిపించింది. కోలీవుడ్‌లోనూ తన కటౌట్ హైలెట్ అయింది. ఇప్పుడు టాలీవుడ్‌లో తన మానియా షురూ కాబోతోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్‌దత్‌కి సౌత్‌లో డిమాండ్ పెరిగింది. కేజీఎఫ్‌లో తను చేసిన పాత్ర హైలైట్‌ అవ్వడంతో.. స్టార్ హీరోల కోసం ఖల్ నాయక్‌ ని బరిలో దింపుతున్నారు మేకర్స్. ఇటీవలే విజయ్ లియోలో డిఫరెంట్ క్యారెక్టర్ చేసి మెప్పించాడు సంజయ్ దత్. అర్జున్ లాంటి సీనియర్ మోస్ట్ యాక్టర్ పక్కన ఉన్నా.. తన డామినేషన్‌లో ఎక్కడా తగ్గలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 13, 2023 | 02:39 PMLast Updated on: Dec 13, 2023 | 2:39 PM

Will Sanjay Dutt Settle As A Villain

నార్త్‌లో అతనో స్టార్ హీరో. సౌత్‌తో మాత్రం విలన్ పాత్రలకి పరాకాష్ఠగా మారాడు. హీరోలని డామినేట్ చేసే క్యారెక్టర్స్‌తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఇప్పటికే శాండిల్ వుడ్‌లో తన సౌండ్ వినిపించింది. కోలీవుడ్‌లోనూ తన కటౌట్ హైలెట్ అయింది. ఇప్పుడు టాలీవుడ్‌లో తన మానియా షురూ కాబోతోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్‌దత్‌కి సౌత్‌లో డిమాండ్ పెరిగింది. కేజీఎఫ్‌లో తను చేసిన పాత్ర హైలైట్‌ అవ్వడంతో.. స్టార్ హీరోల కోసం ఖల్ నాయక్‌ ని బరిలో దింపుతున్నారు మేకర్స్. ఇటీవలే విజయ్ లియోలో డిఫరెంట్ క్యారెక్టర్ చేసి మెప్పించాడు సంజయ్ దత్. అర్జున్ లాంటి సీనియర్ మోస్ట్ యాక్టర్ పక్కన ఉన్నా.. తన డామినేషన్‌లో ఎక్కడా తగ్గలేదు.

అలాగే ప్రజెంట్ కన్నడలో కేడి డెవిల్ అనే పాన్ ఇండియా మూవీలో సంజయ్ నటిస్తున్నాడు. ఇప్పుడు తన ఎంట్రీ టాలీవుడ్ దాకా వచ్చేసింది. ప్రభాస్ హీరోగా మారుతీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌లో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు సంజయ్ దత్. ఇప్పటికే ముంబైలో లుక్ టెస్ట్ జరిగింది. డేట్స్ కూడా లాక్ అయ్యాయ్. త్వరలోనే సెట్స్‌లో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. కేజీఎఫ్‌లో రాఖీ భాయ్‌నే భయపెట్టిన సంజయ్ దత్.. ఇప్పుడు ప్రభాస్‌తో తలపడటం అంటే యాక్షన్ లవర్స్‌కి మంచి ఫీస్ట్ దొరికినట్టే. చిరంజీవి హీరోగా వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విశ్వంభరలో కూడా సంజయ్ దత్‌ని మెయిన్ విలన్‌గా చూపించేందుకు మేకర్స్ చర్చలు జరుపుతున్నారు. వన్స్ డేట్స్ లాక్ అయితే.. అఫిషీయల్‌గా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని చేస్తున్న డబుల్ ఇస్మార్ట్‌లో కూడా సంజయ్ నటిస్తున్నాడు. సౌత్‌లో సంజయ్‌దత్‌ అడుగు పెట్టింది కేజీఎఫ్‌తో కాదు. 1998లో వచ్చిన చంద్రలేఖతో. ఇందులో కొద్ది నిమిషాలు కనిపించే చిన్న క్యామియో చేశాడు. సినిమా ఫ్లాప్ అవ్వడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. అట్లీ తెరకెక్కించిన జవాన్‌లో కూడా సంజయ్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. ట్విస్ట్ ఏంటంటే.. సంజయ్ దత్‌కి బాలీవుడ్‌లో ఇన్ని క్రేజీ ఆఫర్లు లేవు. సౌత్ ఇండస్ట్రీలోనే తను మోస్ట్ వాంటెడ్‌గా మారాడు. మరి 2024లో ఇంకెన్ని ఆఫర్స్.. ఖల్ నాయక్ అకౌంట్‌లో పడతాయో చూడాలి.