Pawan Kalyan: బ్రో మూవీ డిజాస్టర్‌గా మిగిలిపోనుందా?
సినిమాలో పొలిటికల్ డైలాగుల గురించి మాట్లాడుకుంటున్నారు కానీ.. సినిమా గురించి మాట్లాడుకోవడం లేదు ఎవరు ! ఇదీ బ్రో మూవీ పరిస్థితి. పవన్ సినిమా రేంజ్ బజ్ ఎక్కడా బ్రో మూవీ విషయం కనిపించడం లేదు. వానలు కారణం అని చెప్తున్నా.. వానలు మాత్రమే కారణం కాదు. ఎందుకిలా చేశారో.. కావాలని చేయకుండా ఉన్నారో అర్థం కాని పరిస్థితి.
పవన్ కల్యాణ్ సినిమా వస్తుందంటే.. రిలీజ్‌కు వారం ముందు నుంచే ఆ ఫీవర్ కనిపించేది. బ్రో మూవీ విషయంలో మాత్రం అలా జరగలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా పవన్ వస్తాడా రాడా అనే అనుమానమే కనిపించింది తప్ప.. బ్రో మూవీ గురించి ఎక్కడా చర్చ జరగలేదు. పైగా బ్రో మూవీలో పవన్‌ది గెస్ట్ రోల్ అనే మెసేజ్.. ప్రేక్షకుల్లోకి వెళ్లిపోయింది. ఇదే సినిమాకు పెద్ద దెబ్బగా మారింది. మొదటిరోజు 45కోట్ల గ్రాస్ వచ్చిందని మూవీ టీమ్ చెప్తోంది. పవన్ మూవీకి ఓపెనింగ్ కలెక్షన్స్ ఈ స్థాయిలో ఉండడం పెద్ద మ్యాటర్ కాదు. సెకండ్ డే నుంచి ఎలా ఉన్నాయ్ కలెక్షన్స్ అన్నదే అసలు విషయం.
రెండోరోజు నుంచే వసూళ్లు తగ్గుతున్నాయ్. ఈ పరిస్థితికి సరైన బజ్ క్రియేట్ కాకపోవడమే కారణం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ప్రమోషన్‌లో కానీ, మూవీ ఎమోషన్‌ను కానీ.. ప్రేక్షకుడి వరకు తీసుకెళ్లడంతో సినిమా యూనిట్ ఫెయిల్ అయింది. బ్రో మూవీ కోసం పవన్ కల్యాణ్ 21రోజులు మాత్రమే షూటింగ్ చేశాడనే ప్రచారం.. సినిమాకు నెగిటివ్ క్రియేట్ చేసింది. పవన్‌ది గెస్ట్ రోల్ అని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. వినోదయ సీతమ్ ఎలాగూ చాలా మంది చూసి ఉంటారు కాబట్టి.. పవన్ రోల్ కూడా కాస్త సమయమే కనిపిస్తుందని ఎవరికి వారు లెక్కలేసుకున్నారు. ఇదే దెబ్బ తీసింది.
కానీ మూవీలో సీన్ మాత్రం వేరు. హీరోయిన్ లేకపోయినా.. సింగిల్ హ్యాండ్‌తో మూవీ మొత్తం నడిపించాడు పవన్. 80 శాతం సినిమాలో పవన్ కల్యాణ్ ఉంటాడు. ఐతే మొదటి నుంచి సినిమాలో కేవలం పవన్‌ది గెస్ట్ రోల్ అనే అభిప్రాయం జనాల్లోకి వెళ్లిపోయింది. సినిమా మొత్తం పవన్ కల్యాణే మోస్తున్నాడనే విషయాన్ని ఆడియెన్స్ లోకి తీసుకెళ్లడంలో మూవీ టీమ్ అట్టర్‌ఫ్లాప్ అయింది. ఆ ప్రభావం సినిమా మీద కనిపిస్తోంది. దీనికితోడు మూవీ ప్రమోషన్ కూడా సరిగ్గా చేయలేకపోయారు.
సాయిధరమ్ తేజ్ తప్ప.. మూవీ టీమ్ ఎవరూ రిలీజ్‌కు ముందు మీడియా ముందు కనిపించలేదు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ తప్ప.. బ్రో మూవీకి ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ కూడా కండక్ట్ చేయలేదంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏంటో ! ఫస్ట్ డే కలెక్షన్లు.. సెకండ్ నుంచి వస్తున్న వసూళ్లు, జనాల్లో సినిమా మీద ఉన్న బజ్ లెక్కేస్తే.. పవన్ రేంజ్‌కు ఇది డిజాస్టర్‌గా మిగలనుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.