Pushpa 3 : పుష్ప 3 ఉంది.. కానీ

పాన్ ఇండియా (Pan India) మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్‌ పుష్ప2 (Pushpa 2) పై అంచనాలు భారీగా ఉన్నాయి. సుకుమార్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 28, 2024 | 10:02 AMLast Updated on: May 28, 2024 | 10:02 AM

Will There Be A Party 3 For Pushpas Movie Which Has Gained A Level Of Pan India Craze With Pushpa In Tollywood

 

 

పాన్ ఇండియా (Pan India) మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్‌ పుష్ప2 (Pushpa 2) పై అంచనాలు భారీగా ఉన్నాయి. సుకుమార్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ (Devishri Prasad) సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆగష్టు 15న పుష్ప2 రిలీజ్ కానుంది. దీంతో.. ఇప్పటి నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ఇక మే 29న కపుల్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నారు. ఈ పాటలో పుష్పరాజ్, శ్రీవల్లి స్టెప్పులు మామూలుగా ఉండవని అంటున్నారు. ఇక్కడి నుంచి పుష్ప 2 నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్టేడ్స్ ఇవ్వనున్నారు. అయితే.. పుష్ప2కి కొనసాగింపుగా పుష్ప3 (Pushpa 3) కూడా ఉంటుందని చాలా రోజులుగా వినిపిస్తునే ఉంది. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే, పుష్ప2 రిలీజ్ వరకు ఆగాల్సి ఉంది. పుష్ప3కి లీడ్ ఇస్తూ పుష్ప2 క్లైమాక్స్ ఉంటుందని చెబుతున్నారు. కానీ లేటెస్ట్‌గా పుష్ప3 ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.

కానీ ఇప్పుడిప్పుడే ఈ సినిమా ఉండే ఛాన్స్ లేదట. పుష్ప2 తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ (Allu Arjun) రెండేసి సినిమాలు చేసిన తర్వాత పార్ట్ 3 పై దృష్టి పెడతారని సమాచారం. ఈ లెక్కన పుష్ప 3 రావడానికి చాలా సమయం పట్టనుంది. ఈలోపు రామ్ చరణ్‌తో సుకుమార్ ఆర్సీ 17తో పాటు విజయ్ దేవరకొండ సినిమా కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంది. బన్నీ వచ్చేసి.. త్రివిక్రమ్ సినిమాతో పాటు సందీప్ రెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేయనున్నాడు. కుదిరితే.. మధ్యలో అట్లీతో కూడా ఓ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాతే పుష్ప3 ఉంటుందని అంటున్నారు. మరి పుష్ప3 ఎప్పుడుంటుందో చూడాలి