దేవర 2 ఉండదా..? విష ప్రచారం? 2వేల కోట్ల కుట్ర..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర జపాన్ లో దుమ్ముదులుపోతోంది. అక్కడ దేవర హడావిడికి ఇబ్బందేంలేదు. ఎన్టీఆర్ ప్రమోషన్ కూడా బానే వర్కవుట్ అయ్యింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 4, 2025 | 08:50 PMLast Updated on: Apr 04, 2025 | 8:53 PM

Will There Be Deora 2 Is It A Malicious Campaign A Conspiracy Worth Rs 2000 Crore

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర జపాన్ లో దుమ్ముదులుపోతోంది. అక్కడ దేవర హడావిడికి ఇబ్బందేంలేదు. ఎన్టీఆర్ ప్రమోషన్ కూడా బానే వర్కవుట్ అయ్యింది. అలా అంతా బాగుందనుకున్న టైంలో దేవర 2 రాదు, వచ్చే ఛాన్సేలేదని విష ప్రచారం మొదలు పెట్టారు. ఎన్టీఆరే రంగంలోకి దిగి దేవర పార్ట్ 2 లో వర పాత్రే సినిమాకు హైలెట్ అన్నాడు. మొదటి భాగం కంటే, భీకరమైన ఫైట్లు, డైనమిక్ యాక్షన్ సీన్స్ మతిపోగొడతాయని ప్రామిస్ చేశాడు. ఇలా తను స్టేట్ మెంట్ ఇచ్చి రెండు రోజులు కూడా కాలేదు. ఇంతలోనే దేవర 2 వచ్చేదిలేదనే దాడి మొదలైంది. బేసిగ్గా ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కి రెడీ అయ్యిందంటే తన మీద యాంటీ ఫ్యాన్స్ దాడి కామన్. కాని దేవర వచ్చి వసూళ్ల వరద తెచ్చింది. జపాన్ లో కూడా ఇప్పుడు రిలీజై దూసుకెళుతోంది. అలాంటప్పుడు ఇంకా సెట్స్ పైకెళ్లని దేవర2 మీద ఎందుకీ దాడి..? పనికట్టుకుని ఈ కుట్ర చేస్తోంది ఎవరు? మొత్తంగా అసలేం జరుగుతోంది? టేకేలుక్

దేవర 2 వచ్చేఛాన్స్ లేదు. కథ సిద్దమైనా, కథానాయకుడికే అసలా ఇంట్రస్ట్ లేదు.. ఇది బాలీవుడ్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ కూతలు… సౌత్ లోకూడా కుట్రకోణంలో వస్తున్న రాతలు… నిజంగా టూ డేస్ గ్యాప్ లోనే సోషల్ మీడియాలో ఎన్టీఆర్ మీద జరుగుతున్న దాడులు షాకింగ్ గా ఉన్నాయి. త్రిబుల్ ఆర్ రిలీజ్ కి ముందు ఇలానే యాంటీ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు.అసలు తన సినిమా వస్తోందంటే చాలు యాంటీ ఫ్యాన్స్ నెగెటీవ్ టాక్ ని స్ప్రెడ్ చేస్తుంటారు. విచిత్రం ఏంటంటే సౌత్ హీరోల డామినేషన్ నచ్చని నార్త్ బ్యాచ్ లో కొంతమంది పనికట్టుకుని త్రిబుల్ ఆర్ రిలీజ్ ముందు ఎన్టీఆర్ ని కామెంట్లతో కార్నర్ చేశారు. తర్వాత దేవర టైంలో మరీ ఘోరంగా సోసల్ మీడియాలో ట్రోలింగ్స్ పెంచారు.కట్ చేస్తే త్రిబుల్ ఆర్ గ్లోబల్ గా హిట్టైంది. ఆస్కార్ దక్కింది. దేవరకి 670 కోట్ల వసూళ్ల వరదొచ్చింది. జపాన్ లో రీసెంట్ గా రిలీజై దూసుకెళుతోంది. అయినా పనికట్టుకుని ఇప్పుడు దేవర 2 లేదు, రాదు అనంటున్నారు. జపాన్ లో దేవర నిజంగా దూసుకెళితే వసూళ్లెంతో చెప్పాలంటూ ప్రశ్నలు, కౌంటర్లు, కామెంట్లతో దాడి చేస్తున్నారు.

థియేటర్స్ లో రిలీజ్ అయిన ఏమూవీకైనా వసూళ్ల లెక్కలుంటాయి. అక్కడి బ్యాచ్ త్రిబుళ్ ఆర్, బాహుబలి, ఇలా ప్రతీ మూవీకి వసూళ్ల లెక్కల్ని, సినిమా రిలీజైన 2 వారాలకి ప్రకటించటం కామన్ గా మారింది. అది తెలిసీ కూడా కావాలని దేవర జపాన్ వసూళ్లెన్ని అన్న ప్రశ్నలు వేస్తున్నారు. ఇక కొరటాల శివ దేవర 2 పనులు మొదలుపెట్టామన్నాడు. కథలో మార్పులు కూడా పూర్తయ్యాయని మీడియాకు ఆఫ్ ద రికార్డులో క్లియర్ గా చెప్పాడు. ఎన్టీఆర్ కూడా దేవర2 లో వర పాత్ర గురించి చెప్పాడు. పార్ట్ వన్ కంటే డైనమిక్ గా సీక్వెల్ మతిపోగొడుతుందన్నాడు తారక్. ఇలా జపాన్ లో ఫ్యాన్స్ కి ఊపుతెచ్చేలా దేవర2 ప్రకటన కూడా ఇచ్చాడు.

కాని దేవర2 ప్లానింగ్ లేదని, ఎన్టీఆర్ కి అసలు దేవర 2 చేయాలని లేదని, ఉంటే ఎనౌన్స్ మెంట్ ఎక్కడని ప్రశ్నిస్తున్నారు. విచిత్రం ఏంటంటే దేవర 2 మీద ఫిల్మ్ టీం సైలెంట్ గా ఉంటే ఈ ప్రశ్నలు వేయాలి. కాని ఆన్సర్ ఇచ్చాక కూడా ఇలా దేవర 2 రాదని అనటం, ప్రచారం చేయటం, యాంటీ ఫ్యాన్స్ పనే అంటున్నారు. మొన్నటి వరకు యాంటీ ఫ్యాన్స్ అంటే మరొకరి ఫ్యాన్స్.. కాని ఇప్పుడు ఇది ఓ బిజినెస్ అయిపోయింది. సోషల్ మీడియాలో పలానా హీరో మీద బురద చల్లితే, ఇంత అంటూ డబ్బిచ్చి ట్రోలింగ్ చేయించే సంస్క్రుతి పెరుగుతోంది. అదే బాలీవుడ్ ని ముంచింది. ఇప్పుడు టాలీవుడ్ కి అదే జబ్బు పాకినట్టు కనిపిస్తోంది.