Sai Dharam Tej VS Allu Arjun : పవన్‌ను బాధ పెడతారా.. మీతో కటీఫ్..బన్నీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సాయిధరమ్..
మేనమామ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అంటే సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నికల ఫలితాలు రాగానే పవన్‌ను ఎత్తుకొని తన ప్రేమ చూపించిన తేజ్.

Will you hurt Pawan.. Katif with you.. Saidharam gave Bunny a dizzying shock..
మేనమామ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అంటే సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నికల ఫలితాలు రాగానే పవన్‌ను ఎత్తుకొని తన ప్రేమ చూపించిన తేజ్.. చిరు ఇంటికి అన్నాలెజినోవాతో సేనాని వచ్చినప్పుడు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. విజిల్స్‌తో మోత మోగించాడు. ఇప్పటికీ ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయ్. అలాంటి సాయి ధరమ్ ఇప్పుడు.. పవన్ కోసం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కొంతకాలంగా సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ అనే యుద్ధం జరుగుతోంది.
పవన్ పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగితే… ఆయనకు కేవలం సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పేసి చేతులు దులుపుకున్నాడు బన్నీ. ఐతే తన స్నేహితుడు వైసీపీ (YCP) అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి కోసం ఏకంగా నంద్యాల వెళ్లారు. అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్.. బన్నీని ఓ ఆట ఆడుకుంటున్నారు. ఐతే అటు బన్నీ ఫ్యాన్స్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. తమ హీరోని వెనకేసుకొస్తూ.. మెగా హీరోలను టార్గెట్ చేస్తున్నారు. ఐతే కూటమి అద్భుతంగా విజయం సాధించడం.. బన్నీ ప్రచారం చేసిన అభ్యర్థి ఓడిపోవడంతో.. యుద్ధం మరింత పీక్స్‌కు చేరింది.
ఇలాంటి పరిణామాల మధ్య ఆసక్తికర అంశం ఒకటి తెరమీదకు వచ్చింది. మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్… అల్లు అర్జున్ (Allu Arjun) తో పాటు ఆయన భార్య అల్లు స్నేహారెడ్డిని (Snehareddy) కూడా సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశాడు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో వారిద్దరిని అన్‌ఫాలో చేశాడు. ప్రస్తుతానికి అల్లు కుటుంబం నుంచి కేవలం అల్లు శిరీష్‌ని మాత్రమే సాయిధరమ్ తేజ్ ఫాలో అవుతున్నాడు. అయితే ధరమ్ తేజ్ కాకుండా మిగతా మెగా హీరోలందరూ… అల్లు అర్జున్‌ను ప్రస్తుతానికి ఫాలో అవుతున్నారు.