Prabhas Spirit : స్పిరిట్ లో మాట్లాడే ప్రభాస్ ని చూస్తారా ?

సలార్‌లో ప్రభాస్‌కు డైలాగ్‌ వెర్షన్‌ చాలా తక్కువ. కానీ.. సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో నటించే సినిమాలో డైలాగ్స్‌ పుంఖాను పుంఖానులుగా వుంటాయి. అర్జున్‌రెడ్డి.. యానిమల్‌ కలిపితే ఎలా వుంటుందో.. అంతకు మించి స్పిరిట్ లో ప్రభాస్‌ క్యారెక్టర్‌ ఉంటుందనే టాక్ నడుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 30, 2023 | 05:00 PMLast Updated on: Dec 30, 2023 | 5:00 PM

Will You See Prabhas Speaking In Spirit

సలార్‌లో ప్రభాస్‌కు డైలాగ్‌ వెర్షన్‌ చాలా తక్కువ. కానీ.. సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో నటించే సినిమాలో డైలాగ్స్‌ పుంఖాను పుంఖానులుగా వుంటాయి. అర్జున్‌రెడ్డి.. యానిమల్‌ కలిపితే ఎలా వుంటుందో.. అంతకు మించి స్పిరిట్ లో ప్రభాస్‌ క్యారెక్టర్‌ ఉంటుందనే టాక్ నడుస్తోంది.

సందీప్‌ సినిమాల్లో హీరోలు మాట్లాడుతూనే ఉంటారు. మూడు గంటలకు తక్కువ సినిమా తీయడు. హీరో.. చేతి కంటే నోటికే ఎక్కువే పని చెప్పాల్సి ఉంటుంది. యానిమల్‌లో సీన్స్‌ లెంగ్తీగా ఉంటే.. రణ్‌బీర్‌ మాట్లాడుతూనే ఉంటాడు. ముఖ్యంగా తండ్రి అనిల్‌ కపూర్‌తో.. భార్య రష్మికతో వచ్చే డైలాగ్స్‌కు ఫుల్‌స్టాపే ఉండదు. ఇదే రేంజ్‌లో స్పిరిట్‌ కూడా ఉంటే.. ప్రభాస్‌ కష్టం మామూలుగా ఉండదు.

పూరీ జగన్నాథ్‌ హీరోలే కాదు.. సందీప్‌ రెడ్డి వంగా హీరోలు కూడా మారరు. పూరీ సినిమాల్లో హీరోలు ఆవారాల్లా.. పోకిరీల్లా.. మనసుకు నచ్చింది చేసేస్తూ ఉంటారు. అమ్మాయి నచ్చితే.. పెళ్లి చేసుకుందామా అని అడిగేస్తారు. సందీప్‌ రెడ్డి హీరోలు ఏ మాత్రం మారరు. సినిమా సినిమాకూ యాటిట్యూట్‌ పెరుగుతుందేగానీ.. ఏమాత్రం తగ్గదు. అర్జున్‌రెడ్డిని మించి యానిమల్లో యారగెంట్‌గా రణ్‌బీర్‌ కనిపించాడు. సందీప్‌ బ్రదర్‌ ప్రణయ్‌ మాటలు వింటుంటే.. స్పిరిట్‌ మూవీలో ప్రభాస్‌.. అర్జున్‌ రెడ్డి, యానిమల్‌ను మించిపోతాడా అనిపిస్తోంది. యానిమల్‌ బ్లాక్‌ బస్టర్‌ ఆనందంలో ఉన్న నిర్మాత ప్రణయ్‌ రెడ్డి.. ప్రభాస్‌తో తీయబోయే స్పిరిట్‌ సినిమా విశేషాలు పంచుకున్నాడు. ఫస్ట్ టైం పోలీస్‌గా నటిస్తున్న ప్రభాస్‌ యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా కనిపిస్తాడన్నారు. ఈలెక్కన డైరెక్టర్‌ అర్జున్‌రెడ్డి, యానిమల్‌ను మించి యాగ్రెసీవ్‌గా క్యారెక్టర్‌ డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.

వచ్చే ఏడాది సెకండాఫ్‌లో స్పిరిట్‌ షూటింగ్ మొదలుకానుంది. ఈలోగా డార్లింగ్‌ ‘కల్కి’.. మారుతి సినిమా పూర్తి చేసి స్పిరిట్‌గా మారతాడు. సందీప్‌ తన ప్రతి సినిమాలో హీరోలను గుబురు గడ్డం.. మీసాలతో పాటు.. యంగ్‌ లుక్‌తో రెండు రకాలుగా చూపిస్తారు. ఇక యానిమల్లో రణ్‌ బీర్‌ను నాలుగు వేరియేషన్స్‌లో కనిపించాడు. మరి స్పిరిట్‌లో ప్రభాస్‌ లుక్‌ను ఎలా డిజైన్‌ చేస్తాడో.. ఎలా చూపిస్తాడో చూడాలి మరి. స్పిరిట్‌ తర్వాత సందీప్‌ బన్నీని డైరెక్ట్ చేస్తాడు. ఈ ప్రాజెక్ట్ గురించి ప్రణయ్‌ను అడిగితే.. ఇంత వరకు కథ రెడీ కాలేదని.. బన్నీ కమిటైన సినిమాలు పూర్తయ్యాక.. తన ఇమేజ్‌కు తగ్గ కథను సిద్ధం చేస్తారన్నాడు.