100 మంది కమేడియన్స్ తో.. హిస్టారికల్ రికార్డు..

రెబల్ స్టార్ ప్రభాస్ తో మారుతి తీస్తున్న సినిమా ది రాజా సాబ్. 25 రోజుల పెండింగ్ షూటింగ్ పూర్తి చేస్తే ఇక సినిమా షూటింగ్ కి గుమ్మడి కాయ కొట్టొచ్చు. ఐతే ఇప్పడు నాలుగు సాంగ్స్ షూటింగ్ తప్ప ఇంకేం షూటింగ్ పెండింగ్ లేని ఈప్రాజెక్ట్, గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసేలా ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 24, 2025 | 09:00 PMLast Updated on: Feb 24, 2025 | 9:00 PM

With 100 Comedians Historical Record

రెబల్ స్టార్ ప్రభాస్ తో మారుతి తీస్తున్న సినిమా ది రాజా సాబ్. 25 రోజుల పెండింగ్ షూటింగ్ పూర్తి చేస్తే ఇక సినిమా షూటింగ్ కి గుమ్మడి కాయ కొట్టొచ్చు. ఐతే ఇప్పడు నాలుగు సాంగ్స్ షూటింగ్ తప్ప ఇంకేం షూటింగ్ పెండింగ్ లేని ఈప్రాజెక్ట్, గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసేలా ఉంది. ప్రపంచం లో ఎక్కడ జరగనిది, ఎన్నడూ చూడనిది ది రాజా సాబ్ లో కనిపించబోతోంది. ఏకంగా వంద మంది కమేడియన్స్ తో ఈ సినిమాను తెరకెక్కించారని తెలుస్తోంది. తెలుగులో కమేడియన్స్ కి కొదువ లేదు. అలాని ఏకంగా వంద మంది కమేడియన్స్ ఉంటారా అంటే, ఫోకస్ లో ఉంది మాత్రం రెండు మూడు డజన్ల నటులే… అయినా వందమంది కమేడియన్స్ తో హర్రర్ కామెడీ దాడికి సిద్దమైంది ది రాజా సాబ్ టీం. ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది. కేవలం ప్యాచ్ వర్క్, 4 సాంగ్స్ షూటింగ్ మాత్రమే పెండింగ్… అంటే వందమంది కమేడియన్స్ తో నిజంగా షూటింగ్ పూర్తి చేసినట్టేనా? ఎందుకు అంతమంది అవసరమొచ్చింది… ? ఇది కేవలం నెంబర్ గేమా? అంతకు మించి రీజన్ ఏదౌనా ఉందా? హావేలుక్

ప్రభాస్ ప్రజెంట్ తన కెరీర్ లోఎన్నడూ చేయని పాత్రలు, ఎన్నడూ టచ్ చేయని జోనర్లు టచ్ చేస్తున్నాడు. ఫౌజీ లో సైనికుడిగా, స్పిరిట్ లో పోలీస్ ఆఫీసర్ గా అలానే ది రాజా సాబ్ లో ఆత్మగా, అలానే తాతటా కనిపించబోతున్నాడు. ఆలుక్కు, గెటప్పు ఇలా అన్నీ కొత్తవే…. అందులో ది రాజా సాబ్ ఇప్పుడు ఏకంగా గిన్నీస్ బుక్ లో చేరేలా ఉంది. ప్రస్థుతానికిది ప్రజార దశలోనే ఉంది. టీజరో, అఫీషియల్ ఎనౌన్స్ మెంటో వస్తే అప్పుడు అఫీషియల్ గా కన్ఫామ్ అవుతుంది.ఇంతకి ఆ రికార్డు ఏంటంటే, వందమంది కమేడియన్లతో ఓ సినిమా రాబోతుండటం. ఒక సినిమాలో ఇద్దరూ లేదంటే ముగ్గురు కమేడియన్లు ఉండటం కామన్. లేదంటే ఇరవై ముప్పై మందితో కామెడీ ఫిల్మ్ తీయటం కూడా కామనే. అలా తెలుగు సినిమాల్లో ఈవీవీ ఎన్నో సార్లు డజన్ల కొద్ద కామెడీ ప్రయోగాలు చేశాడు. శ్రీనువైట్ల హీరో నుంచి విలన్ వరకు అందరినీ కమేడియన్లుగా మార్చాడు కూడా.

జమానాలో హాస్య బ్రహ్మ జంధ్యాల అయితే బ్రహ్మానందం నుంచి కోట శ్రీనివాసరావు వరకు డజన్లు కొద్ది కమేడియన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అయినా వాళ్లెవరి సినిమాలకు ది రాజా సాబ్ కి దక్కిన రికార్డు దక్కలేదు. కారణం తెలుగు, తమిల్, మలయాళం, హిందీ, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీల నుంచి మొత్తంగా 100 మంది కమేడియన్స్ ని ఈ సినిమాకోసం తీసుకున్నారట.కేవలం 4 పాటల షూటింగ్, కొంత ప్యాచ్ వర్క్ మాత్రమే పెండింగ్ అంటే, ఈపాటికే 95 శాతం షూటింగ్ అయిపోయినట్టు. కాని ఎక్కడా కూడా వందమంది కమేడియన్స్ ని ఈ సినిమా కోసం తీసుకున్నట్టు ఎక్కడా వార్త రాలేదు. బయటికి మ్యాటర్ పొక్కలేదు. ఎంత పెద్ద సినిమా అయినా 60 నుంచి 80 సీన్లకుమించి ఉండవు. సో ఒక్కో కమేడియన్ కి ఒక్కో సీన్ వేసుకున్నా 80 సీన్లలో 80 మందే పట్టే ఛాన్స్ఉంది.

కాని ఇక్కడ హీరో అండ్ కో మేజర్ రోల్ ప్లేస్ చేసే ఇలాంటి భారీ బడ్టె్ మూవీల్లో, 100 మంది కమేడియన్స్ కి ఛాన్స్ఇచ్చినా, వాళ్లలో ఎందరికి డైలాగ్స్ చెప్పే ఛాన్స్ఉంటుందో, ఎన్ని పాత్రలకు ఫోకస్ అయ్యే అవకాశం ఉంటుందో డౌటే… సూపర్ స్టార్ మహేశ్ బాబు మూవీ బ్రహ్మోత్సవం లో ఇలానే కుప్పలు తెప్పలుగా పెద్ద పెద్ద నటులని పెట్టి, వాళ్లని ఫ్రేములకే పరిమితం చేశారు. చాలా మందికి సీన్ లో కనిపించే ఛాన్స్ తప్ప డైలాగ్ చెప్పే అవకాశం రాలేదు. ఇది అలానే అవుతుందా అంటే టీజర్ వస్తే కాని చెప్పలేం. కాని ప్రపంచంలో ఎక్కడా 100 మంది ప్రొఫేషనల్ కమేడియన్స్ ఒకే సినిమాలో కనిపించటం అనేది జరగలేదు. అందుకే ఫిల్మ్ టీం గిన్నీస్ బుక్ కి ఇదే విషయాన్ని అప్లై చేసిందట. ఇక వాళ్ల నుంచి రికార్డు కన్ఫామ్ అని ఆన్సర్ వస్తే, లెక్కే మారిపోయే ఛాన్స్ ఉంది.