ఎన్టీఆర్, ప్రభాస్ ఇద్దరితో… దర్శక ధీరుడి ధైర్యం…?
రాజమౌళితో ఏ హీరో సినిమా చేసినా, అది హిట్టు. ఆతర్వాత ఆ స్టార్ హీరోకి ఫ్లాపులు పడటం సెంటిమెంట్ అయ్యింది. దేవరతో ఎన్టీఆర్ ఆసెంటిమెంట్ నే బ్రేక్ చేశాడు.

రాజమౌళితో ఏ హీరో సినిమా చేసినా, అది హిట్టు. ఆతర్వాత ఆ స్టార్ హీరోకి ఫ్లాపులు పడటం సెంటిమెంట్ అయ్యింది. దేవరతో ఎన్టీఆర్ ఆసెంటిమెంట్ నే బ్రేక్ చేశాడు. ఏదేమైనా రాజమౌళితో మూవీ చేసేప్పుడే నెక్ట్స్ ఏంటనే ప్రశ్నకు హీరోలు ముందుగానే సమాధానం సిద్దం చేసుకుంటారు. మరో మూవీని ప్లాన్ చేసుకుంటారు. కాని ఇప్పుడు ఆ ప్రశ్న దర్శక ధీరుడికి ఎదురౌతోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు తో తీస్తున్న సినిమా రెండు భాగాలైతే ఓకే, లేదంటే 2027లో ఈ మూవీ వచ్చేట్టైతే, నెక్ట్స్ ఏంటి? త్రిబుల్ ఆర్ చేసేటప్పుడే నెక్ట్స్ సినిమా సూపర్ స్టార్ తో అని తేలింది. మరి మహేశ్ బాబుతో ఆల్రెడీ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లాడు రాజమౌళి. కాబట్టి నెక్ట్స్ ఏంటనే ప్రశ్నకు తన దగ్గర సమాధానం ఉందా? ఎన్టీఆర్ , ప్రభాస్ లో ఒకరితో సినిమా అని ప్రచారం జరుగుతోంది. కాదు ఆ ఇద్దరితో మరో త్రిబుల్ ఆర్ లాంటి ప్రాజెక్ట్ అనంటున్నారు… ఇంతకి ఈ ప్రచారానికి కారనం ఏంటి? ఇందులో ఏది నిజం అయ్యే అవకాశం ఎంతుంది? టేకేలుక్
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పడు రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. ఎలాగూ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది కాబట్టి 2028 వరకు మరో మూవీ గురించి ఆలోచించే ఛాన్స్ లేదు. కాని బయట వినిపిస్తున్న ప్రచారం నిజమైతే కేవలం ఒకే భాగంగా ఈ సినిమా తెరకెక్కితే, 2027 లో ఆ మూవీ వచ్చే ఛాన్స్ఉంది. అదే జరిగితే ఆతర్వాత ఏంటనే ముందుగా జాగ్రత్త పడాలి. అందుకే సందీప్ రెడ్డి, సుకుమార్ ని రంగంలోకి దింపుతున్నాడు మహేశ్ బాబు అని ప్రచారం మొదలైంది.విచిత్రం ఏంటంటే, ఇక్కడ రాజమౌళి కూడా నెక్ట్స్ ఏంటనే ప్రశ్నకు సమాధానం సిద్దం చేస్తున్నాడు. ఎప్పుడూ రాజమౌళితో సినిమా చేసే హీరో, హిట్ మెట్టెక్కడం, తర్వాత ఫ్లాపులు ఫేస్ ,చేయటం కామన్. అది తెలిసే దేవరతో ఎలాగోలా గట్టెక్కాలని, త్రిబుల్ ఆర్ టైంలోనే ఫిక్స్ అయ్యాడు తారక్. అదే చేశాడు కూడా. అలా హీరోలు రాజమౌళి మూవీ చేస్తుంటే, నెక్ట్స్ ఏంటనే ప్రశ్నకు సమాధానం వెతుక్కోవటం ఇప్పటి వరకు చూశాం.
కాని ఫస్ట్ టైం రాజమౌళినెక్ట్స్ ఏంటనే ప్రశ్నకి ఆన్సర్ ఇబ్బందిగా మారేలా ఉంది. ఎందుకంటే, మహేశ్ బాబు తో అనుకున్న సినిమా రెండు భాగాలు కాబట్టి, నాలుగేళ్లు రెండు భాగాలకే పోతుంది. ఆలోపు నెక్ట్స్ ఎవరితోనో, ఏ పాయింట్ తోనో ఓ క్లారిటీ తెచ్చుకోవచ్చు.. కాని రెండు భాగాలు కాకుండా ఒకే భాగంగా సినిమాను మార్చేస్తున్నాడంటున్నారు.కాబట్టే మరో రెండేళ్ల తర్వాత రాజమౌళి ఖాలీ… త్రిబుల్ ఆర్ టైంలోనే మహేశ్ తో సినిమాఅని తేల్చాడు.కాని మహేశ్ బాబుతో మూవీ మొదలైనా, నెక్ట్స్ ఎవరితోనో తేల్చలేదు. చాలా వరకు రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. ఎలాగూ ఎస్ ఎస్ ఎమ్ బీ 29 పూర్తయ్యేలోపు ప్రభాస్ కూడా తన కమిట్మెంట్స్ పూర్తి చేసే చాన్స్ఉంది. మరో కోణంలో చూస్తే, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో రాజమౌళి సినిమా కన్పామ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఫైనల్ గా ప్రభాస్, ఎన్టీఆర్ ని కలిపి త్రిబుల్ ఆర్ స్టైల్లో కూడా ధుర్యోధన, అర్జున పాత్రలని ప్రేరణగా తీసుకుని ప్రాజెక్టు ప్లాన్ చేయాలనేది కూడా జక్కన్న ఆలోచనని ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ తన రైటర్స్ టీంతో చేసిన డిస్కర్షన్స్ మాత్రమే… ఏది ఫైనల్ కాలేదు. మొత్తానికి మహేశ్ బాబు సినిమా సగం పూర్తయ్యేలోపు, నెక్ట్స్ ఎవరితో సినిమానో మాత్రం రాజమౌళి ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది.