పవర్ స్టార్ కొడుకుతో…. త్రివిక్రమ్ కొడుకు… క్యా సీన్ హై…
రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి తీయబోతున్న సినిమా స్పిరిట్. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగొచ్చనే విషయం తప్ప మరే అప్ డేట్ లేదు.

రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి తీయబోతున్న సినిమా స్పిరిట్. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగొచ్చనే విషయం తప్ప మరే అప్ డేట్ లేదు. ఇందులో కొరియన్ స్టార్ డాన్ లీ విలన్ అన్న పుకారు తప్ప, ఇంకో విషయం బయటికి రాలేదు. అంతెందుకు ఇందులో పక్కగా హీరోయిన్ ఎవరో ఇంతవరకు ఎవరికైనా తెలుసా.. కాని ఈ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రం త్రివిక్రమ్ కొడుకన్న వార్త వైరలైంది. విచిత్రం ఏంటంటే ఈమూవీకి హీరో అనో, లేదంటే హీరోయిన్ అనో, కాదంటే మ్యూజిక్ డైరెక్టర్ అనో ఎవరిపేరైనా వైరలైతే అర్ధముంది.. కాని ఇంకా స్టార్ట్ కాని మూవీకి అప్పుడే అసిస్టెంట్ డైరెక్టర్ గా త్రివిక్రమ్ కొడుకు మారబోతున్నాడనే వార్త వైరలైంది. ఇదే ఇక్కడ విచిత్రం. అంతకంటే విచిత్రం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అఖీరా నందన్ తొలి సినిమా త్రివిక్రమ్ కొడుకే తీస్తాడట. దానికి మాటలమాంత్రికుడే కథ అందిస్తాడట. ఇదేదో విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి కాంబినేషన్ లా వింటానికి ఆస్కార్ రేంజ్ లోఉంది. కాని ఇంకా లాంచ్ కాని త్రివిక్రమ్ వారసుడి సుడిని, ప్రమోషన్ తో తిప్పుతున్నారా..? పవన్ తన వారసుడి బాధ్యత నిజంగా త్రివిక్రమ్ కొడుకుచేతిలో పెట్టాడా? టేకేలుక్
త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకొడుకుని లాంచ్ చేయబోతున్నాడు. అది కూడా తనలానే దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం చేయబోతున్నాడు. ఆల్రెడీ వారసుడు ఆన్ దివే… రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ స్పిరిట్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేయబోతున్నాడు త్రివిక్రమ్ కొడుకు రిషి. ఆల్రెడీ విజయ్ దేవరకొండ మూవీ కింగ్ డమ్ కి అసిస్టెంట్ గా వర్క్ చేసిన తను, స్పిరిట్ సినిమా మొదలవ్వకుండానే ఏడీగా మారాబోతున్నాడని తేలింది. ఎక్కడైనా ఓ సినిమా కి ఫలానా హీరో అనో, లేదంటో ఇంకెవరో హీరోయిన్ అనో న్యూస్ వైరలౌతుంది. లేదంటే ఆ హీరోతో ఈ డైరెక్టర్ సినిమా అని రూమర్స్ వస్తాయి… విచిత్రం ఓ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ త్రివిక్రమ్ కొడుకు అన్న వార్త వైరలవ్వటం.. అసిస్టెంట్ డైరెక్టర్ అంటే అదేదో సినిమాకే హీరో అన్నంత రేంజ్ లో న్యూస్ గ్యాస్ లా స్ప్రెడ్ అవుతోంది
దీనికంటే విచిత్రం త్రివిక్రమ్ కొడుకు సీన్ ఎంతో, స్టామినా ఏంటో తేలకముందే, తన డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొడుకు అఖీరా సినిమా అంటూప్రచారం మొదలైంది. దానికి త్రివిక్రమ్ స్క్రిప్ట్ అందిస్తాడని కూడా ప్రచారం పెంచేశారు. షాకింగ్ న్యూస్ ఏంటంటే, అసలు త్రివిక్రమ్ కి కొడుకున్నాడనే విషయం తెలియని వాళ్లకి కూడా, తన వారసుడి పేరు రిషీ అని అర్ధమైపోయింది.సోషల్ మీడియాలో ఇదో రచ్చ మొదలైంది. త్రివిక్రమ్ కొడుకైనంత మాత్రానా, తను గొప్ప దర్శకుడౌతాడని అనలేం. అలాని తనకి ట్యాలెంట్ లేదని అండరెస్టిమేట్ చేయటం కూడా కరెక్ట్ కాదు. ట్యాలెంట్ ఎవరి సొత్తూ కాదు. కాని త్రివిక్రమ్ లాంటి వ్యక్తే రైటర్ గా ఎదిగి, మెల్లిగా నువ్వే నువ్వే, అతడు తో ప్రూవ్ చేసుకున్నాక పవన్ దయతో ఈ స్థాయికి చేరుకున్నాడు
కాని గుంటూరు కారం తర్వాత తను పూర్తిగా సినిమాలకు దూరమైనట్టే కనిపిస్తున్నాడు. వారానికి 4 రోజులు పవన్ పొలిటికల్ పార్టీ పనులతోనే బిజీ అవుతన్నాడు. ఫలితంగానే బన్నీతో ప్రాజెక్ట్ డైలామాలో పడేలా ఉంది. ఏదేమైనా పవన్ తోనే త్రివిక్రమ్ జర్నీ కొనసాగేలా ఉంది. పవన్ సినిమాలు సెట్ చేస్తూ కూడా చాలానే సంపాదించిన త్రివిక్రమ్, ఇక దర్శకత్వా బాధ్యతలు తన కొడుకు రిషికి అప్పచెప్పేందుకే రెండేళ్లుగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టున్నాడు. స్టార్ రైటర్ గా పేరొచ్చినా ఎప్పుడూ లోప్రొఫైల్ మేయింటేన్ చేసిన త్రివిక్రమ్, తన కొడుకు అసిస్టెంట్ డైరెక్టర్ కాగానే ఏదో స్టార్ అయినట్టు తెగ ప్రచారం చేయిస్తున్నాడు.. ఇది సోషల్ మీడియాలో పెరిగిన ట్రోలింగ్. ఏదేమైనా అఖీరా నందన్ హీరోగా ఎంట్రి ఇచ్చేందుకు ఏడైదైనా పడుతుంది. అప్పటి లోగా త్రివిక్రమ్ కొడుకు దర్శకుడిగా మ్యాజిక్ చేసే చాన్స్ తక్కువ… తనని తాను ప్రూవ్ చేసుకునే స్టేజ్ లోఉన్న వ్యక్తి చేతిలో అఖీరా కెరీర్ ని పెట్టే పరిస్థితుల్లో పవన్ ఉంటాడని ఎవరూ అనుకోరు.. ఏదేమైనా ఈ వార్త్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరలైంది.