Vijay Devarakonda: దిల్ రాజుతో.. సినిమా ఆపేయమన్న విజయ్ దేవరకొండ..
రౌడీ మాట్లాడితే ఈవెంట్ ఏదైనా తూటాల వర్షమే.. అలాంటి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సన్యాసం పుచ్చుకున్నాడా? అసలే తన సినిమా సందడి లేదు. తన సందడి అంతకన్నా లేదనుకుంటే, అసలు తను కమిటవ్వాల్సిన సినిమానే లేదని తెలుస్తోంది.

విజయ్ దేవరకొండతో దిల్ రాజు 250 కోట్లతో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేశాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ మేకింగ్ లో జఠాయువు ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు. కాని ఇది వద్దని తేల్చాడట విజయ్. కారనం లైగర్ లాంటి ప్లాప్ పడటమే.
విజయ్ అర్జున్ రెడ్డి చేస్తే సౌత్, నార్త్ అంతటా తన పేరుమారుమోగింది. గీతా గోవిందం తెలుగులో విడుదలైనా, సౌత్ నార్త్ అంతటా తనకి పేరు తెచ్చింది. ఇలా లోకల్ మూవీలు చేసినప్పుడే విజయ్ కి కలిసొచ్చింది. అదే లైగర్ అంటూ పాన్ ఇండియా మూవీ చేయగానే, అసలు అడ్రస్సే గల్లంతయ్యే పరిస్తితి వచ్చింది. అందుకే ఇప్పట్లో పాన్ ఇండియా మూవీలకు విజయ్ ఒప్పుకునేలా లేడు. పరశురామ్, గౌతమ్ తిన్ననూరి మేకింగ్ లో చేసే సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయట్లేదనే తెలుస్తోంది. ఇది రౌడీ స్టార్ నిర్ణయమంటూ ప్రచారం జరుగుతోంది.