ఎన్టీఆర్ లేకుండానే.. 1500 కోట్ల రాముడు కూడా…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేకుండానే డ్రాగన్ షూటింగ్ మొదలైంది. అది కొత్త విషయం కాదు... తారక్ వార్ 2 మూవీ షూటింగ్ తో బిజీ అవటం వల్లే అలా చేశాడు ప్రశాంత్ నీల్..

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేకుండానే డ్రాగన్ షూటింగ్ మొదలైంది. అది కొత్త విషయం కాదు… తారక్ వార్ 2 మూవీ షూటింగ్ తో బిజీ అవటం వల్లే అలా చేశాడు ప్రశాంత్ నీల్.. కాని వార్ 2 షూటింగ్ ఈ మంత్ ఎండ్ లోగా పూర్తి కాబోతోంది.. అలాంటప్పుడు డ్రాగన్ సెట్లో ఎన్టీఆర్ ఎంట్రీకి టైం దగ్గర పడినట్టే… అయినా ఇప్పటికీ ఎన్టీఆర్ లేకుండానే డ్రాగన్ షూటింగ్ జరుగుతోంది. మొన్నటి వరకంటే ఎన్టీఆర్ లేని సీన్లు తీశారు… కాబట్టి ఎన్టీఆర్ చేయాల్సిన సీన్ల షూటింగ్ ఈ మంత్ ఎండ్ నుంచి మొదలౌతుందనుకున్నారు. కాని ఎన్టీఆర్ నటించాల్సిన సీన్లు కూడా తను లేకుండానే తెరకెక్కుతున్నాయా..? విచిత్రం ఏంటంటే 500 కోట్ల బడ్జెట్ తో తెరకోక్కే ఈ సినిమానే కాదు, 1500 కోట్ల బాలీవుడ్ రామయణం కూడా హీరో లేకుండానే తెరకెక్కుతోంది. దీని వెనక సాలిడ్ రీజన్ ఉంది… ఈమంథ్ ఎండ్ లో డ్రాగన్ సెట్లో ఎన్టీఆర్ అడుగుపెట్టబోతున్నాడు. కాని షూటిగ్ లో జాయిన్ కాడు… మరో నెలవరకు తను లేకుండానే షూటింగ్ జరిగబోతోంది.. మాస్ మతిపోగొట్టేందుకే ఎన్టీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడట. తన లుక్ వల్లే ఇలా జరుగుతోందట… ఇంతకి సెట్లో హీరోలేకుండా షూటింగ్ అంటే అర్ధమేంటి? మాస్ మతిపోగొట్టేలా ఎన్టీఆర్ అంతగా ఏం ప్లాన్ చేశాడు.. తన లుక్ ఎలా డ్రాగన్ షూటింగ్ ని ఎఫెక్ట్ చేస్తోంది..? హావేలుక్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేకుండానే డ్రాగన్ మూవీ ని లాంచ్ చేయటమే కాదు, షూటింగ్ కూడా కొంత పూర్తి చేశారు. విచిత్రంగా ఎన్టీఆర్ చేయాల్సిన సీన్స్ లో తను లేకున్నా కూడా షూటింగ్ ని ఇప్పడు కంటిన్యూ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీకి షాకింగ్ గా మారుతోంది. ఎన్టీఆర్ పర్మీషన్ తోనే ఇదంతా జరుగుతోంది. దీంతో ఎన్టీఆర్ డూప్ ని పెట్టి ఫైట్స్ తీస్తున్నారా అన్న డౌట్లు మొదలయ్యాయి.
పవర్ స్టార్ పాలిటిక్స్ తో బిజీ అయినప్పడుు క్రిష్ కూడా హరి హర వీరమల్లు ఫైట్లు, లాంగ్ షాట్ సీన్లు పవన్ డూప్ తో తీశాడని ప్రచారం జరిగింది. ఇప్పుడు డ్రాగన్ ని కూడా ఎన్టీఆర్ డూప్ తో కొంత వరకులాగిస్తున్నాడా ప్రశాంత్ అనే డౌట్లు పెరిగాయి. కాని అవేవి నిజం కాదు. ఎన్టీఆర్ లేకుండా ఎన్టీఆర్ చేయాల్సిన సీన్లు తెరకెక్కకూడదు.. కాని తెరకెక్కుతున్నాయి. డూప్ పెట్టట్లేదు, అలానే ఎన్టీఆర్ ఉండాల్సిన సీన్ల షూటింగ్ ఆగట్లేదు.
ఇదే ఎలా సాధ్యమంటే, ఎన్టీఆర్ ఉండే సీన్లలో హీరోయిన్ షాట్, మిగతావాళ్ల షాట్లు చాలా ఖచ్చితమైన లెక్కతో తీస్తున్నాడట ప్రశాంత్ నీల్. ఇదంతా ఎన్టీఆర్ రాక లేట్ అవటం వల్లనే అని తెలుస్తోంది. హిందీ మూవీ వార్2 షూటింగ్ ఈనెల మొదటి వారంలోగా పూర్తవ్వాలి. కాని ఈ మంత్ ఎండ్ వరకు పెండింగ్ షూటింగ్ కొనసాగేలా ఉంది. అలా చూసినా ఈ మంత్ ఎండ్ నుంచి తారక్ డ్రాగన్ సెట్లో కొస్తాడా అంటే, ఆచాన్స్ లేదు.
మార్చ్ ఎండ్ లేదంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి తాను డ్రాగన్ సెట్లో షూటింగ్ కి రెడీ అవుతాడట. అంతవరకు అంటే వార్ 2 షూటింగ్ పూర్తి చేసి, ఒక నెల గ్యాప్ తీసుకోబోతున్నాడు. అది కూడా రెస్ట్ కోసం కాదు, తన లుక్ మార్చుకోవటం కోసమే. హేయిర్ స్టైల్, బాడీ లుక్ మార్చుకునేందుకు మరీ ఎక్కువ మార్పులు లేకుండా, చిన్న ఛేంజ్ కోసం లుక్ మార్చుకుంటున్నాడట.
డ్రాగన్ లో మాస్ లుక్ కోసం ఇలా ఎన్టీఆర్ నెల టైం తీసుకోవటం వల్ల, షూటింగ్ కి ఇబ్బంది కలక్కుండా ఉండేందుకు ముందు, ఎన్టీఆర్ లేని సీన్లు తీస్తూ వచ్చారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్న సీన్లలో తన డైలాగ్ సీన్ వదిలేసి, మిగతా వాళ్ల డైలాగ్ షాట్స్ తీస్తున్నారు. సో ఎన్టీఆర్ వచ్చాక, తన ఒక్కడి క్లోజ్ షాట్స్ విత్ డైలాగ్స్ తీస్తారట.. అన్నీ ఎమోషనల్ డ్రామా సీన్లే కాబట్టి, టెక్నికల్ గా ఇబ్బంది ఏం లేకుండా ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్.
అచ్చంగా హిందీ మూవీ రామాయణ్ కి కూడా ఈ టెక్నిక్కే వాడుతున్నారు. 1500 కోట్ల బడ్జెట్ తో మూడు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ రామాయణ్ లో రాముడు లేకుండా సీతా అండ్ కో పాత్రలతోనే షూటింగ్ చేస్తున్నారు. రణ్ బీర్ రాముడిగా పూర్తి స్థాయిలో లుక్ మార్చుకునేందుకు, ఇంకా మూడు నెల్లు టైం పడుతుందట. అంటే జూన్ లోతను సెట్లో అడుగుపెడతాడు. తను వచ్చేలోపు తన లేని సీన్లే కాదు, తను ఉన్న సీన్లలో మిగతా ఆర్టిస్ట్ ల షాట్లు తీస్తోంది ఫిల్మ్ టీం. అలా రాముడు లేకుండా రామాయణం, ఎన్టీఆర్ లేకుండా డ్రాగన్ సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి.