సమంతా లేకపోతే నేను లేను… కీర్తి సురేష్ సెన్సేషనల్ కామెంట్స్
2024 కీర్తి సురేష్ కు ఎంత స్పెషల్ ఇయర్ గా చెప్పాలి. పెళ్లి చేసుకోవడమే కాకుండా బాలీవుడ్ లో కూడా ఆమె అడుగు పెట్టింది. బేబీ జాన్ అనే సినిమాతో బాలీవుడ్ లో పెట్టింది.
2024 కీర్తి సురేష్ కు ఎంత స్పెషల్ ఇయర్ గా చెప్పాలి. పెళ్లి చేసుకోవడమే కాకుండా బాలీవుడ్ లో కూడా ఆమె అడుగు పెట్టింది. బేబీ జాన్ అనే సినిమాతో బాలీవుడ్ లో పెట్టింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో కీర్తి సురేష్ మంచి ఊపు మీద ఉంది. ఇక ఈ సినిమాలో తనకు ఛాన్స్ ఎలా వచ్చిందో కీర్తి బయట పెట్టింది. స్టార్ హీరోయిన్ సమంత కారణంగానే ఆ సినిమాలో తనకు ఛాన్స్ వచ్చిందని బాలీవుడ్ లో సమంత కారణంగానే అడుగు పెట్టాను అంటూ ఆసక్తికర విషయాలు పంచుకుంది.
బేబీ జాన్ సినిమా హిందీలో రీమేక్ చేయాలని సినిమా యూనిట్ ప్లాన్ చేయగానే సమంత తన పేరు చెప్పారని తమిళంలో ఆమె పోషించిన పాత్రను హిందీలో తాను చేయడం చాలా ఆనందంగా ఉందని కీర్తి చెప్పుకొచ్చింది. ఈ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడం ఎప్పటికీ మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అంటూ పొంగిపోయింది కీర్తి సురేష్. తేరి సినిమాలో సమంత నటన తనకు చాలా ఇష్టం అని… నిజాయితీగా చెప్పాలంటే ఈ రీమేక్ కోసం సమంత నా పేరు చెప్పగానే భయపడ్డానని కీర్తి వివరించింది.
కానీ ఆమె తనకు చాలా సపోర్ట్ చేసిందని సినిమా మేకర్స్ కూడా తన పేరు చెప్పగానే నువ్వు తప్ప ఈ పాత్రను మరెవరు చేయలేరు అంటూ సోషల్ మీడియాలో స్టోరీ లో కూడా పెట్టారని కీర్తి సురేష్ చెప్పింది. ఆ మెసేజ్ తనలో కాన్ఫిడెన్స్ ని పెంచిందని ఎంతో ఎనర్జిటిక్ గా సినిమా షూటింగ్లో పాల్గొన్నానని ఆమె ఇచ్చిన కాన్ఫిడెన్స్ తోనే షూటింగ్ కూడా కంప్లీట్ చేశానని సమంత కారణంగానే తాను ఇప్పుడు కెరీర్ లో ముందుకు వెళుతున్నాను అంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. గతంలో కీర్తి సురేష్ సమంతతో మహానటి సినిమాలో కలిసి యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే.
మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన సినిమాలో సమంత జర్నలిస్ట్ గా నటించగా కీర్తి సురేష్ సావిత్రిగా నటించారు. కీర్తి తన పాత్రకు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ఇక బేబీ జాన్ సినిమాలో కీర్తి సురేష్ తో పాటుగా బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కూడా నటించాడు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ఈనెల 25న రిలీజ్ కాగా బాలీవుడ్ లో మంచి వసూళ్లు సాధిస్తుంది. తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. పెళ్లయిన వెంటనే కీర్తి సురేష్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని ఎనర్జిటిక్ గా కనిపించింది. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మెడలో మంగళసూత్రంతోనే ఆమె సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడం ఒక సెన్సేషన్. ఇక వరుణ్ ధావన్ పెళ్లి తర్వాత దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఆ ఫోటోలు పై డిఫరెంట్ కామెంట్స్ వచ్చాయి.