Yash-Allu arjun: అల్లు అర్జున్‌తో యష్.. ఇద్దరికీ పోలికలతో సోషల్ మీడియాలో చర్చ

ఓవర్ నైట్ ఒకే ఒక్క సినిమాతో ఆ ఇద్దరు ఇండియా వ్యాప్తంగా పేరు సంపాదించారు. యష్ కేజిఎఫ్‌తో, అల్లు అర్జున్ పుష్పతో ఆ ఘనత సాధించారు. తాజాగా ఆ ఇద్దరికీ సంబంధించి పోలిక ఉన్న న్యూస్ ఒకటి ఇరువురి అభిమానులతో పాటు మూవీ లవర్స్‌ని ఆకట్టుకుంటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 9, 2024 | 01:59 PMLast Updated on: Feb 09, 2024 | 1:59 PM

Yash And Allu Arjun Fans Discussing About Their Success And Movies With Comparison

Yash-Allu arjun: యష్, అల్లు అర్జున్ ఇద్దరు కూడా ఎప్పటి నుంచో తమ మాతృ భాషలో సినిమాలు చేసుకుంటు అగ్రహీరోలుగా కొనసాగుతూ వస్తున్నారు. కానీ ఓవర్ నైట్ ఒకే ఒక్క సినిమాతో ఆ ఇద్దరు ఇండియా వ్యాప్తంగా పేరు సంపాదించారు. యష్ కేజిఎఫ్‌తో, అల్లు అర్జున్ పుష్పతో ఆ ఘనత సాధించారు. తాజాగా ఆ ఇద్దరికీ సంబంధించి పోలిక ఉన్న న్యూస్ ఒకటి ఇరువురి అభిమానులతో పాటు మూవీ లవర్స్‌ని ఆకట్టుకుంటుంది.

EAGLE REVIEW: ఈగల్ రివ్యూ.. యాక్షన్ ఫీస్ట్.. రవితేజ ఊచకోత నెక్ట్స్ లెవల్

2018లో యష్ హీరోగా వచ్చిన కేజిఎఫ్ చాప్టర్ 1, 2021లో వచ్చిన అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ పార్ట్ 1 లు ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో వచ్చి పాన్ ఇండియా ప్రేక్షకులని ఒక ఊపు ఊపాయి. అలాగే రికార్డు స్థాయి కలెక్షన్స్ కూడా సాధించాయి. అంతే కాకుండా అన్ని భాషల సినీ మేకర్స్‌కి ఛాలెంజ్ కూడా విసిరాయి. ఆ తర్వాత 2022లో కేజిఎఫ్ చాప్టర్ 2 వచ్చి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద తన పవర్ తగ్గలేదని నిరూపించింది. ఇప్పుడు 2024లో పుష్ప ది రూల్ పార్ట్ 2 సునామీని సృష్టించడానికి సిద్ధం అవుతుంది. పైగా ఇంకో విషయం ఏంటంటే యష్, అల్లు అర్జున్ మరో సినిమా ఒప్పుకోకుండా వరుసగా కేజిఎఫ్, పుష్పలని చేసుకుంటు వచ్చారు. అలాగే కేజిఎఫ్ చాప్టర్ 2 ఎండింగ్‌లో చాప్టర్ 3 కూడా ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పాడు. ఇప్పుడు కూడా పుష్ప 2 తర్వాత పుష్ప 3 ది రోర్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

ఇలా కేజిఎఫ్‌కి పుష్పకి పోలికలు వేసుకొని ఇరువురి అభిమానులతో పాటు సినిమా ప్రేమికులు చాలా ఇంట్రెస్ట్‌గా చర్చించుకుంటున్నారు. యష్ ప్రస్తుతం కేజిఎఫ్ కాకుండా వేరే కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అంటే ఆ తర్వాత కేజిఎఫ్ 3 ఉంటుందేమో. అలాగే అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. అంటే ఆ తర్వాత పార్ట్ 3 చేస్తాడేమో. ఇప్పుడు యష్ అల్లు అర్జున్‌కి ఉన్న ఈ పోలికలని దృష్టిలో పెట్టుకొని వీళ్ళిద్దరినీ ఆపేదెవరు అని సినిమా మనుషులు మాట్లాడుకుంటున్నారు.