KGF Hero Yesh: యష్ కొంపముంచిన ఫ్యాన్స్.. దెబ్బకు సినిమా ఆగిపోయింది..
కేజీయఫ్ ఫేం రాకీ భాయ్ కి ఫ్యాన్సే పంచ్ ఇచ్చారు. పవన్, చిరు, రజినీ కాంత్ ఎలా అయితే తమ ఫ్యాన్స్ ని కాదని నిర్ణయం తీసుకోరో, తన అభిమానుల మనసులు నొప్పించరో.. అలానే కన్నడ స్టార్ యష్ కూడా తన ఫ్యాన్స్ హర్ట్ అయ్యే ఏ పని చేయడు.. ఆ అలవాటే తన కొంపముంచేలా ఉంది.

Yesh Reject the Ravanasura Role
యష్ ఈమధ్య బాలీవుడ్ లో మూడు భాగాలుగా తెరకెక్కే రామాయణం లో ఆఫర్ కి సై అన్నాడు. అల్లు అరవింద్ తోపాటు ఇద్దరు బాలీవుడ్ నిర్మాతలు ప్లాన్ చేసిన ఈ పాన్ ఇండియా రామాయణం, ఆదిపురుష్ కంటే ముందే ప్లాన్ చేసిన ప్రాజెక్ట్. ముందుగా రాముడి ప్లేస్ లో హృతిక్ అనుకుంటే కుదర్లేదు. తర్వాత తన స్ఠానంలో రణ్ బీర్ కపూర్ వచ్చాడు. రావణుడిగా యష్ ఓకే అయ్యాడు.
కట్ చేస్తే యష్ ఇప్పుడు రావణుడి పాత్ర వేయాలనుకోవట్లేదట. నిజానికి రావణుడి పాత్ర వేస్తే యష్ ఎక్కడ హైలెట్ అయ్యే ఛాన్స్ ఉందని, పాత్ర నచ్చి యష్ ఓకే అన్నాడట. కాని ఫ్యాన్స్ నో చెప్పడంతో, తన అభిమానులని కాదని తనేం చేయలేనని, ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్టు చెప్పాడు యష్.
ఐతే రంగంలోకి దిగిన అల్లు అరవింద్ యష్ ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడట. ఇక్కడ ప్రభాస్ కి, యష్ కి ఓ విషయం కామన్ అవుతోంది. బాహుబలి లో హీరో పాత్రని రాముడి ప్రేరణగానే రాశానన్నాడు రాజమౌళి. విచిత్రంగా ఆతర్వాత ప్రభాస్ రాముడి పాత్రలో ఆదిపురుష్ చేశాడు. ఇక కేజీయఫ్ లో విలన్ చెల్లెల్ని ఎత్తుకొచ్చి సామ్రాజ్యాన్ని ఆక్రమించే రాఖీ భాయ్ పాత్రకి ప్రేరణ రావణుడే.. అదేంటో ఈ మూవీ తర్వాత యష్ కి హిందీ రామాయణంలో రావణుడి పాత్రే ఆఫర్ చేశారు. సో గతంలో ఏ పాత్ర ప్రేరణగా సినిమా చేశారో, అదే పాత్ర తో మరో ఆఫర్ రావటం కోఇన్స్ డెంటే అయినా, యష్ మాత్రం ఫ్యాన్స్ నిర్ణయం వల్ల ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు.