YASH: యష్ ఒక్కడే.. ఒంటరిగా.. పాపం పాన్ ఇండియా హీరో..

పాన్ ఇండియా మూవీలెన్ని వచ్చినా, సౌత్‌కి, నార్త్‌కి మధ్య ఉన్న అడ్డు గోడల్ని కూల్చిన బాహుబలి మూవీతో ప్రభాస్, ఆ వెంటనే అదే పనిచేసిన కేజీయఫ్ స్టార్ యషే గుర్తుకొస్తారు. అంటే ప్రభాస్ తర్వాత ప్రభాస్ అనిపించునే రేంజ్‌ని యష్ సొంతం చేసుకున్నట్టే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 29, 2024 | 05:37 PMLast Updated on: Mar 29, 2024 | 5:37 PM

Yash Starrer Toxic To Go On Floors Soon Yash Is The Producer Of The Film

YASH: పాన్ ఇండియా స్టార్స్ అనగానే ఫస్ట్ ప్రభాస్, తర్వాత యష్ పేర్లే వినిపిస్తాయి. ఆ తర్వాత త్రిబుల్ ఆర్‌తో ఎన్టీఆర్, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్స్ అనిపించుకున్నారు. పుష్ప రాజ్‌గా ఐకాన్ స్టార్ ట్రెండ్ సెట్ చేశాడు. కాని పాన్ ఇండియా స్టార్స్ అనగానే ప్రభాస్ తర్వాత యష్ పేరు వినిపించటానికి కారణం.. బాహుబలి తరహాలోనే కేజియఫ్ ట్రెండ్ సెట్ చేయటమే. చంద్రుని మీద ఎంతమంది కాలు పెట్టినా మొట్టమొదట కాలుపెట్టిన నీల్ ఆర్మ్ స్ట్రాంగే అందరికీ గుర్తుంటాడు.

KALKI 2898 AD: ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఝలక్ ఇచ్చేలా ఉన్న కల్కి టీం..?

అలానే పాన్ ఇండియా మూవీలెన్ని వచ్చినా, సౌత్‌కి, నార్త్‌కి మధ్య ఉన్న అడ్డు గోడల్ని కూల్చిన బాహుబలి మూవీతో ప్రభాస్, ఆ వెంటనే అదే పనిచేసిన కేజీయఫ్ స్టార్ యషే గుర్తుకొస్తారు. అంటే ప్రభాస్ తర్వాత ప్రభాస్ అనిపించునే రేంజ్‌ని యష్ సొంతం చేసుకున్నట్టే. కాని ప్రభాస్ సాహో, రాదేశ్యామ్, ఆదిపురుష్, సలార్ మూవీస్ చేశాడు. అందులో కొన్ని హిట్లు కొన్ని ఫ్లాపులైనా తన జోరు ఆగలేదు. కాని యష్ మాత్రం కేజీయఫ్ 2 తర్వాత ఇంతవరకు మరో ముందడుగు వేయలేదు. బన్నీ పుష్ప తర్వాత పుష్ప 2 చేస్తూనే, అట్లి, త్రివిక్రమ్, సందీప్ రెడ్డి, ప్రశాంత్ నీల్.. ఇలా అందరినీ లైన్లో పెట్టాడు. చరణ్ అయితే శంకర్‌తో సినిమా, ఆ తర్వాత సుకుమార్ సాయం తీసుకుంటున్నాడు. ఎన్టీఆర్.. దేవర చేస్తూనే వార్ 2తో బాలీవుడ్ మీద దండెత్తబోతున్నాడు. కాబట్టి, పాన్ ఇండియా రూట్లో తోటి స్టార్లంతా ఫ్యూచర్ ప్లానింగ్‌లో బిజీ అయ్యారు.

యష్ ఒక్కడే ఒంటరిగా మరో డైరెక్టర్ సపోర్ట్ దొరక్కపోవడంతో సాలిడ్ హిట్ కోసం నిర్మాతగా మారి టాక్సిక్ అనే సినిమా తీస్తున్నాడు. అక్కా తమ్ముళ్ల ఎమోషనల్ కంటెంట్‌తో టాక్సిక్ మూవీ ప్లాన్ చేశాడు. ఇంతవరకు షూటింగ్ మొదలు కాలేదు. కాని 2025 ఏప్రిల్ 5 కి రిలీజ్ అని విడుదల తేదీ ఎనౌన్స్ చేశారు. ఆ లెక్కన జనవరి లేదంటే ఫిబ్రవరిలోగా షూటింగ్ అవ్వాలి. కాని షూటింగ్ మొదలే కాలేదు. సొంతంగా నిర్మిస్తున్న మూవీ అవటంతో, యష్ ఒక్కడే అటు హీరోగా, ఇటు నిర్మాతగా డబుల్ షిఫ్ట్ చేస్తున్నాడు. నెక్ట్స్ ప్రాజెక్ట్ ఓరేంజ్‌లో ఉండాలని గట్టిగా కష్టపడుతున్నాడు. అది కూడా ఎవరి సపోర్ట్ లేకుండా. ఆఖరికి ప్రశాంత్ నీల్ సపోర్ట్ కూడా కరువైన టైంలో ఇది యష్ పరిస్థితి. ఏదైతేనేం.. యష్ మంచి కంబ్యాక్ ఇస్తే చాలంటున్నారు ఫ్యాన్స్.