Yatra 2: జ‌గ‌న్ పాత్ర చేయ‌డం చాలా రిస్క్‌.. జీవా.. జీవించేశాడుగా..!

టీజర్‌లో హీరో జీవా వైయస్ జగన్ పాత్రలో చాలా బాగా నటించాడు. జగన్ బాడీ లాంగ్వేజ్‌ని అచ్చు గుద్దినట్లు దింపేశాడు. టీజర్ రిలీజ్ అయ్యాక చాలామంది జగన్ పాత్రలో జీవా పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యాడని కామెంట్స్ కూడా చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 19, 2024 | 01:28 PMLast Updated on: Jan 19, 2024 | 1:28 PM

Yatra 2 Actor Jiiva About The Movie And Acts Like Ys Jagan

Yatra 2: ఏపీలో ఎన్నిక‌ల వేడి రాజుకుంటున్న వేళ విడుద‌ల‌వుతున్న మూవీ యాత్ర‌-2. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ నిర్వ‌హించిన పాద‌యాత్ర ఆధారంగా తెర‌కెక్కిన సినిమా ఇది. ఈ మూవీలో వైఎస్సార్‌గా మ‌మ్ముట్టి.. జ‌గన్‌గా జీవా న‌టించారు. యాత్ర 2 సినిమాను 2009 నుంచి 2019 వర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల ఆధారంగా తీసున్న‌ట్లు తెలుస్తోంది. అప్పట్లో జగన్ చేసిన పాదయాత్రను కూడా ఈ సినిమాలో ఎంతో ఎమోషనల్‌గా చూపించబోతున్నట్లు ఇటీవల రిలీజైన టీజర్ చూస్తేనే అర్థమవుతోంది.

Prabhas: అప్పుడే ఊపేస్తున్న రాజా సాబ్ మేనియా.. రాజా సాబ్.. హిట్టు ప‌క్కా..!

ముఖ్యంగా టీజర్‌లో హీరో జీవా వైయస్ జగన్ పాత్రలో చాలా బాగా నటించాడు. జగన్ బాడీ లాంగ్వేజ్‌ని అచ్చు గుద్దినట్లు దింపేశాడు. టీజర్ రిలీజ్ అయ్యాక చాలామంది జగన్ పాత్రలో జీవా పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యాడని కామెంట్స్ కూడా చేశారు. అయితే యాత్ర 2పై రీసెంట్‌గా జీవా చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. రంగం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయ్యాడు జీవా. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించ‌డంతో జీవాకు తెలుగులో మంచి మార్కెట్ ఏర్ప‌డుతుంద‌ని భావించారు. కానీ.. అలా జ‌ర‌గ‌లేదు. దీంతో.. జీవా నుంచి పెద్ద‌గా.. ఆశించిన సినిమాలేవీ రాలేదు. అయితే.. చాలా రోజుల గ్యాప్ త‌ర్వాత జీవా యాత్ర‌-2తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్‌లో జీవా యాక్టింగ్‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. జగన్ బాడీ లాంగ్వేజ్‌ని అచ్చు గుద్దినట్లు దింపేశాడు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో ‘యాత్ర 2’ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు జీవా. త‌న‌కు జగనన్న జర్నీ చాలా ఇష్టమ‌ని, కానీ యాత్ర 2 ఆఫర్ వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకున్నాన‌ని తెలిపాడు.

జగన్ ప్రభావవంతమైన వ్యక్తి అని, అలాంటి వ్యక్తి పాత్రలో నటించడం చాలా రిస్క్ అని ఆ పాత్రకి తాను న్యాయం చేయకుంటే తన కెరీర్‌పై తీవ్ర ప్రారంభం చూపుతుందని భావించినట్లు చెప్పాడు. దీంతో జీవా చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. యాత్ర -2 సినిమా 2019లో వ‌చ్చిన యాత్రకు సీక్వెల్‌. గ‌తంలో కూడా వైఎస్ఆర్ బ‌యోపిక్‌గా యాత్ర సినిమాను ఎల‌క్ష‌న్స్ ముందు తీసుకొచ్చారు. ఆ సినిమా అప్ప‌ట్లో మంచి విజ‌యాన్ని సాధించింది. ఇప్ప‌డు మ‌ళ్లీ 2024 ఎల‌క్ష‌న్స్ ముందు యాత్ర 2 సినిమా తెర‌పైకి రానుంది. ‘యాత్ర’ సినిమా ఫిబ్ర‌వ‌రి 8, 2019లో విడుద‌ల అయ్యింది. దానికి సీక్వెల్‌గా వ‌స్తున్న ‘యాత్ర 2’ సినిమాను కూడా అదే తేదీన ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు.