Yatra 2 Review: వైఎస్ జగన్ బయోపిక్.. యాత్ర 2 మెప్పించిందా..? సినిమా ఎలా ఉంది..?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది మూవీ ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం. కథ విషయానికి వస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ‘ప్రజా సంకల్పయాత్ర’ ని బేస్ చేసుకుని ఈ సినిమా సాగుతుంది.
Yatra 2 Review: టాలీవుడ్‌లో పొలిటికల్ ఎజెండాతో తెరకెక్కుతున్న సినిమాలు రిలీజ్ కావడానికి రెడీగా ఉన్నాయి. ఈ ట్రెండును ఫాలో అవుతూ పొలిటికల్ జోనర్‌లో వచ్చిన తాజా మూవీ “యాత్ర 2”. ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది మూవీ ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం. కథ విషయానికి వస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ‘ప్రజా సంకల్పయాత్ర’ ని బేస్ చేసుకుని ఈ సినిమా సాగుతుంది.
Trivikram : గురూజీ ఆ రెండూ వదిలేయాలి
ఇక ఇందులో ఆయనకి ఎదురైన సంఘటనలు ఏంటి. వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా మమ్ముట్టి నటించాడు. మమ్ముట్టి మరణం తర్వాత ప్రజలు అన్ని కోల్పోయామని అనుకుంటున్న సందర్భంలో జీవా వచ్చి జనాలకు ఏం చేశాడు. తన పార్టీని ఎలా కాపాడుకున్నాడు. అదే సమయంలో అధికారంలో ఉన్న పార్టీ తనని అణిచివేయాలని చూస్తే, ఎవ్వరికీ లొంగకుండా ఆయన ముందుకు ఎలా సాగాడు అనే పాయింట్‌ను బేస్ చేసుకొని ఈ సినిమా నడుస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన పూర్తి కథ ఎంటనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. పర్పామెన్స్ విషయానికి వస్తే…మమ్ముట్టి, జీవాల క్యారెక్టర్లు చాలా ఫ్రెష్‌గా ఉండడమే కాకుండా వాళ్ళు పలికించిన హావభావాలు కూడా ఆ పాత్రలకి సరిగ్గా సెట్ అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ లో జీవా కనిపించి మెప్పించడమే కాకుండా ఆ పాత్రలో జీవించాడనే చెప్పాలి. మహేష్ మంజ్రేకర్ కూడా తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించాడు. ఇక స్క్రీన్ మీద కనిపించే ప్రతి యాక్టర్ తమ పరిది మేరకు నటించి మెప్పించారు. టెక్నికల్ విషయానికి వస్తే.. దర్శకుడు మహి వి రాఘవ ఈ సినిమాని ఎక్స్‌ట్రా ఆర్డినరీగా తెరకెక్కించాడు.
సంతోష్ నారాయణ అందించిన మ్యూజిక్ మాత్రం బావుంది. కొన్ని సాంగ్స్ సినిమాకి ప్లస్ పాయింట్ గా మారాయి. ఇక కొన్ని సీన్లకు ఆయన ఇచ్చిన ఆర్ ఆర్ మాత్రం సినిమా చూసే ప్రేక్షకుడికి తెలియకుండానే వాళ్ల కంట్లోనుంచి నీళ్ళు రప్పిస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ కూడా సీన్లని ఎక్కువగా లాగ్ చేయకుండా సీన్లల్లో ఉన్న డెప్త్ ని మాత్రమే పట్టుకొని ఒక సీన్ ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకు మాత్రమే ఉంచి మిగతాదంతా కట్ చేశాడు. ఇక నిజజీవితంలో నుంచి కొన్ని అంశాలను తీస్తే కొన్నింటిని కల్పితంగా సృష్టించాడని తెలుస్తోంది. ఓవరాల్ గా సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.