Yatra 2 Teaser: ఇచ్చిపడేశారుగా.. తండ్రి పోయాడు అనుకుంటే.. కొడుకు వచ్చాడు..!

ఏపీ రాజకీయాల చుట్టూ తిరిగే కథగా రూపొందిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 8న విడుదల విడుదల కానుంది. విడుదల టైం దగ్గర పడుతుండటంతో మూవీ మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ ను అందుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 5, 2024 | 04:40 PMLast Updated on: Jan 06, 2024 | 4:14 PM

Yatra 2 Teaser Released Jiivas Jagan Mohan Reddy Keeps The Legacy Of Mammoottys Ysr Alive

Yatra 2 Teaser: ‘యాత్ర 2’ సినిమా టీజర్ విడుదలైంది. ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిజ సంఘటన నేపథ్యంలో తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా 2019లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దీనికి సీక్వెల్‌గా ‘యాత్ర 2’ను రూపొందిస్తున్నారు. ఇందులో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాత్రలో మ‌ల‌యాళ స్టార్ హీరో మమ్ముట్టి న‌టిస్తుండ‌గా.. సిఎం జగన్ పాత్రలో కోలీవుడ్ హీరో జీవా న‌టిస్తున్నారు. ఏపీ రాజకీయాల చుట్టూ తిరిగే కథగా రూపొందిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 8న విడుదల విడుదల కానుంది. విడుదల టైం దగ్గర పడుతుండటంతో మూవీ మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ ను అందుకుంది. తాజాగా రిలీజైన టీజర్ ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలు పెంచింది.

PM MODI: సికింద్రాబాద్ నుంచి మోడీ.. మెదక్ నుంచి సోనియా.. అగ్రనేతలిద్దరూ తెలంగాణ నుంచే పోటీ?

సోనియా గాంధీ, చంద్రబాబు, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిల, కే రోశయ్య సహా అన్ని ప్రధాన క్యారెక్టర్లను టీజర్‌లో చూపించారు. టీజర్ విషయానికి వస్తే… ‘తండ్రి పోయాడు అనుకుంటే.. కొడుకు వచ్చాడు అనే డైలాగ్ టీజర్ లో హైలెట్ గా నిలిచింది. ఉన్నదంతా పోయినా పర్లేదు అని తెగించిన జగన్‌లాంటి వాళ్లతో యుద్ధం చేయడం మనకే కష్టం మేడం’ అంటూ సోనియాతో పార్టీ నాయకులు చెప్పిన సీన్ నేచురల్‌గా అనిపించింది. ఇక జగన్ ‘చరిత్ర నన్ను గుర్తు పెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్నా.. కానీ ఒకవేళ గుర్తు పెట్టుకుంటే.. తండ్రి కోసం ఇచ్చే మాటను తప్పని కొడుకుగా.. మీరన్నా ఆ చరిత్రను గుర్తుపెట్టుకుంటే చాలు అన్నా..’ అంటూ చెప్పే డైలాగ్ కళ్లల్లో నీళ్లు తెప్పిస్తోంది. జగన్ పాత్రలో జీవా అద్భుతంగా నటించాడు. అసెంబ్లీలో ‘నాకు భయపడడం రాదయ్యా. నేనేంటో, నా రాజకీయమేంటో మీకు అర్థం కాకపోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి.. నేను వైఎస్ రాజశేఖరరెడ్డి కొడుకుని’ అంటూ డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

కొడాలి నానితో వైఎస్సార్ ‘నా రాజకీయ ప్రత్యర్థి అయినా, శత్రువు అయినా ఓడించాలని అనుకుంటా.. కానీ మీ నాయకుడిలా వాళ్ల నాశనం కోరుకోనయ్యా’ అనే డైలాగ్ సూపర్ అని చెప్పాలి. నారా చంద్రబాబు నాయుడు పాత్రలో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాత్రలో సుజానె బెర్నెర్ట్, వై.ఎస్.భారతి పాత్రలో కేతకి నారాయణన్ నటించారు. యాత్ర 2 టీజర్ వైయస్ అభిమానులకు.. ఒక పండగ అని చెప్పవచ్చు కచ్చితంగా టీజర్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి.