మొన్న నందమూరి నేడు మెగా ఫ్యామిలీ… విశ్వక్సేన్ వాడకం
ఈ మధ్యకాలంలో యంగ్ హీరోలు తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి ఏ దారి ఉంటే ఆ దారి వాడేస్తున్నారు. కెరీర్లో పైకి రావడానికి ఎన్నో మార్గాలు ఉండటంతో ఆ మార్గాలు అన్నీ కూడా టాలీవుడ్ యంగ్ హీరోలు వాడుకుంటూ దుమ్ము రేపుతున్నారు.

ఈ మధ్యకాలంలో యంగ్ హీరోలు తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి ఏ దారి ఉంటే ఆ దారి వాడేస్తున్నారు. కెరీర్లో పైకి రావడానికి ఎన్నో మార్గాలు ఉండటంతో ఆ మార్గాలు అన్నీ కూడా టాలీవుడ్ యంగ్ హీరోలు వాడుకుంటూ దుమ్ము రేపుతున్నారు. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ ముందువరుసలో ఉంటారు. వీళ్ళిద్దరూ గత కొన్ని రోజులుగా నందమూరి బాలకృష్ణ తో ఎక్కువగా స్నేహం చేస్తున్నారు. దీనితో నందమూరి అభిమానులు కూడా వీళ్ళిద్దరిని ఎక్కువగానే రిసీవ్ చేసుకున్నారు. వీళ్ళిద్దరూ అటు ఎన్టీఆర్ ఇటు బాలకృష్ణతో ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేస్తున్నారు.
బాలకృష్ణ సినిమా ఈవెంట్ ఏది జరిగిన సరే వీళ్ళిద్దరూ కనబడుతున్నారు. ఇక బాలయ్య కూడా వీళ్ళిద్దరికీ అదే రేంజ్ లో ప్రయారిటీ ఇవ్వడం ఈమధ్య హాట్ టాపిక్ అయింది. ఒక జూనియర్ ఎన్టీఆర్ కూడా వీళ్లకు మంచి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. తన సినిమాల ప్రమోషన్స్ కు వీళ్లిద్దరిని వాడుకుంటున్నాడు. ఇక ఇప్పుడు మెగా ఫ్యామిలీ కూడా వీళ్ళ విషయంలో ఇంట్రెస్ట్ చూపిస్తుంది. వీళ్ళిద్దరి సినిమాలకు ప్రమోషన్ చేయడానికి కూడా మెగా హీరోలు రెడీ అంటున్నారు. ముఖ్యంగా విశ్వక్సేన్ అయితే ఒకవైపు మెగా ఫ్యామిలీ మరోవైపు నందమూరి ఫ్యామిలీతో ఫ్రెండ్షిప్ చేస్తూ టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు.
లేటెస్ట్ గా తన సినిమా లైలా ప్రమోషన్స్ కోసం మెగాస్టార్ చిరంజీవిని వాడుకోవాలని ఈ యంగ్ హీరో డిసైడ్ అయ్యాడు. ఈమధ్య విశ్వక్సేన్ సినిమాలకు పెద్దగా రెస్పాన్స్ ఉండటం లేదు. ప్రమోషన్స్ విషయంలో కూడా కాస్త ఫెయిల్ అవుతున్నాడు అనే కామెంట్ ఉంది. ఈ టైంలో కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని మెగా నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ ను బుట్టలో వేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అందుకే తన సినిమా ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ఇన్వైట్ చేశాడు విశ్వక్సేన్. ఈ సినిమా కోసం కాస్త గట్టిగానే కష్టపడ్డాడు.
అటు చిరంజీవి కూడా వీళ్ళిద్దరి విషయంలో ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో మెగా ఫాన్స్ కచ్చితంగా వీళ్ళ సినిమాలు చూడటం ఖాయమని సినిమా జనాలు కామెంట్ చేస్తున్నారు. అటు సిద్దు జొన్నలగడ్డ కూడా తన సినిమా ప్రమోషన్స్ కు.. ఎన్టీఆర్ ను గట్టిగా వాడుకోవాలని డిసైడ్ అయ్యాడు. తన సినిమా జాక్ ప్రమోషన్ కోసం ఎన్టీఆర్ను పిలిచేందుకు ప్లాన్ చేస్తున్నాడు.