మీను కమర్షియల్ ఫిగరే.. అప్పుడే 10 కోట్లు అడిగేసింది
టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోయిన్లు పెద్దగా కనబడలేదు. ఒక్క రష్మిక మందన తప్ప మిగిలిన హీరోయిన్ల అందరూ చిన్న హీరోయిన్లే. స్టార్ హీరోలతో సినిమాలు చేయాలంటే వాళ్లకు ఎన్నో కష్టాలు ఉన్నాయి.

టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోయిన్లు పెద్దగా కనబడలేదు. ఒక్క రష్మిక మందన తప్ప మిగిలిన హీరోయిన్ల అందరూ చిన్న హీరోయిన్లే. స్టార్ హీరోలతో సినిమాలు చేయాలంటే వాళ్లకు ఎన్నో కష్టాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు కొత్త హీరోయిన్లు కాస్త ఎక్కువగా కష్టపడే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా మీనాక్షి చౌదరి చిన్న సినిమాలతో పాటుగా పెద్ద సినిమాల్లో కూడా నటించేందుకు ఆసక్తి చూపిస్తుంది. ఇటీవలి.. కాలంలో ఆమె నటించిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి.
లేటెస్ట్ గా ఆమె నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి హిట్ అయింది. అలాగే మహేష్ బాబు తో నటించిన గుంటూరు కారం సినిమా కూడా ఆమెకు బాగా కలిసి వచ్చింది. ఇక లక్కీ భాస్కర్ సినిమాతో ఆమె స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఆమె నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయని చెప్పాలి. దీనితో ఇప్పుడు మీనాక్షి చౌదరి రెమ్యూనరేషన్ విషయంలో భారీగా పెంచేసినట్లు సమాచారం. తన రెమ్యూనరేషన్ విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గని మీనాక్షి చౌదరి.. ఇప్పుడు దాదాపు 8 నుంచి 10 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
చిన్న సినిమా అయితే మూడు నుంచి నాలుగు కోట్లు.. పెద్ద సినిమా అయితే ఎనిమిది నుంచి పది కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పుష్పా లాంటి సినిమాకి రష్మిక మందన 10 కోట్లు తీసుకుంటే, మీనాక్షి చౌదరి మాత్రం ఏకంగా ఇప్పుడు స్టార్ హీరో సినిమా ఆఫర్ వస్తే చాలు పది కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అటు బాలీవుడ్ లో కూడా ఈ అమ్మాయికి ఆఫర్లు గట్టిగానే వస్తున్నాయి. పెద్ద హీరోల సినిమాలతో పాటుగా చిన్న హీరోల సినిమాల్లో కూడా నటించేందుకు ఆమె ఇంట్రెస్ట్ చూపిస్తోంది.
స్కిన్ షో విషయంలో కూడా ఎటువంటి కండిషన్స్ లేకపోవడంతో ఆమెకు డైరెక్టర్లు ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. ఇక లిప్ లాక్ సీన్స్ విషయంలో కూడా ఆమె పెద్దగా అభ్యంతరాలు చెప్పడం లేదు. దీనితో బాలీవుడ్ హీరోలు ఆమెతో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఆమె పర్సనాలిటీ కూడా ఆడియన్స్ కు బాగా నచ్చడంతో డైరెక్టర్లు కూడా ఆమెను ఎక్కువగా సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చీర కట్టినా కాస్త మోడరన్ గా కనపడినా… సరే ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఆడియన్స్. ఇక అమ్మడు కూడా స్కిన్ షో విషయంలో ఎటువంటి కండిషన్స్ పెట్టకుండా డైరెక్టర్లకు ఆడియోస్ కు ఏం కావాలంటే అది చూపిచ్చేస్తూ హడావుడి చేస్తోంది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా ఈ అమ్మాయి దూకుడుగానే ఉంటుంది. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్ లో ఈమె ఎక్కువగా పాల్గొంది.