Megastar Chiranjeevi: మా మెగానాన్నకు పెళ్లి.. డీజే టిల్లు ఇన్విటేషన్..!
గతంలో చిరు సినిమానే కాపీ చేసి కథలో మార్పులు చేసి ధమాకా కథ రెడీ చేసిన ఈ రచయిత.. ఇప్పుడు కూడా మరో కాపీ కథనే రెడీ చేశాడటంటున్నారు. మానాన్నకు పెళ్లి స్టోరీ లైన్ తీసుకున్నా అందులో చాలా మార్పులు చేసి కొత్తగా ప్రసన్న కుమార్ ఏదో రాసాడనుకునేలోపు, అది కాపీ కొట్టిన కథ అంటూ ప్రచారం పెరిగింది.

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో బంగార్రాజు ఫేం కళ్యాణ్ కృష్ణ తీయబోతున్న మూవీ కథ అచ్చంగా ఒకప్పటి సినిమా మా నాన్నకు పెళ్లే అని తెలుస్తోంది. అప్పట్లో శ్రీకాంత్, కృష్ణంరాజు కలిసి చేసిన ఈ ప్రయోగమే మెగా నాన్నకు పెళ్లిగా మారబోతోందట. ఇందులోనే కొడుకు పాత్రలో డీజే టిల్లు ఫేం సిద్దూ కనిపించబోతున్నాడు.
తనకి జోడీగా శ్రీలీల, చిరు కి జోడీగా త్రిష అని ఎపటినుంచో ప్రచారం జరుగుతోంది. ఐతే ఇక్కడ కథలో ట్విస్ట్ ఏంటంటే, ఈ కథ రాసిన ప్రసన్న కుమార్ బెజవాడ, కాపీ రైట్స్ ఇష్యూలో ఇరుక్కున్నాడట. గతంలో చిరు సినిమానే కాపీ చేసి కథలో మార్పులు చేసి ధమాకా కథ రెడీ చేసిన ఈ రచయిత.. ఇప్పుడు కూడా మరో కాపీ కథనే రెడీ చేశాడటంటున్నారు. మానాన్నకు పెళ్లి స్టోరీ లైన్ తీసుకున్నా అందులో చాలా మార్పులు చేసి కొత్తగా ప్రసన్న కుమార్ ఏదో రాసాడనుకునేలోపు, అది కాపీ కొట్టిన కథ అంటూ ప్రచారం పెరిగింది.
వెలిగొండ శీను రాసిన కథనే తను ఎత్తేశాడని, కాపీ వివాదం విషయం చిరు వరకు వెళ్లిందని తెలుస్తోంది. ఐతే వెలిగొండ శీనుకు కోటి ఇప్పించి, క్రెడిట్స్ కూడా ఇస్తూనే వివాదానికి మెగాస్టార్ ఫుల్ స్టాప్ పెట్టాడట. ఈ తతంగం మొత్తం జరగటంతో, ఇది ఒకప్పటి మానాన్నకు పెళ్లి స్టోరీలైన్‌తో వస్తున్న మూవీ అని, మ్యాటర్ లీకైపోతోంది.