Devara, romantic : దేవర రొమాంటిక్ రచ్చ..
యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైనమిక్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా దేవర. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Young Tiger NTR and dynamic director Koratala Siva's combination is the movie Devara.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైనమిక్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా దేవర. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, వీడియోస్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. తాజాగా ఈ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఫిలిమ్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తోంది.
దేవర ఈ మధ్యనే గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చింది. అందులో మెయిన్ లీడ్స్ మధ్య ఒక ఫీల్ గుడ్ లవ్ సాంగ్ షూట్ చేశారని తెలుస్తోంది. అది ఎన్టీఆర్, జాన్వీల మధ్య బీచ్ సాంగ్ అని, మంచి లవ్ అండ్ రొమాంటిక్ గా ఉండబోతుందని అంటున్నారు. ఈ సాంగ్ లో జాన్వీ గ్లామర్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని చెప్పుకుంటున్నారు. ఈ పాట మాత్రమే కాదు మొత్తం ఈ సినిమాకే ఎన్టీఆర్ జాన్వీ కపూర్ ల జోడి ప్రధాన ఆకర్షణగా ఉండబోతుందని టాక్.
ఇక ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండగా అదిరిపోయే పాటలు ఇచ్చాడని తెలుస్తోంది. మాస్ మ్యూజిక్ లోనే కాదు మెలోడీస్ లో కూడా అదరగొట్టేస్తాడు. మొత్తానికి దేవర లో ఈ స్పెషల్ సాంగ్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తుందని అంటున్నారు. చూడాలి మరి ఇంతలా ఊరిస్తున్న పాట ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో..