Ram Charan-NTR : బిరుదులు మార్చుకున్నారు
ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో గ్లోబల్ రేంజ్ (Global Star) రీచ్ అందుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), మెగా పవర్ స్టార్ (Mega Power) రామ్ చరణ్ (Ram Charan). ఈ ఇద్దరికి వచ్చిన క్రేజ్‌తో నెక్స్ట్ సినిమాలపై భారీ హైప్ నెలకొంది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర (Dēvara) సినిమా చేస్తున్నాడు.

Young Tiger NTR and Mega Power Star Ram Charan got global reach with RRR movie.
ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో గ్లోబల్ రేంజ్ (Global Star) రీచ్ అందుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), మెగా పవర్ స్టార్ (Mega Power) రామ్ చరణ్ (Ram Charan). ఈ ఇద్దరికి వచ్చిన క్రేజ్‌తో నెక్స్ట్ సినిమాలపై భారీ హైప్ నెలకొంది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర (Dēvara) సినిమా చేస్తున్నాడు. చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ (game changer) షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో.. లేటెస్ట్‌గా ఆర్సీ 16ని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. అయితే.. ఎన్టీఆర్ దేవర, చరణ్ ఆర్సీ 16 సినిమాల నుంచి తమ ట్యాగ్స్ మార్చుకోనున్నారు.
టీనేజ్‌లోనే బాక్సాఫీస్ దగ్గర మాస్ ర్యాంపేజ్ చూపించిన ఎన్టీఆర్‌ను యమదొంగ నుంచి యంగ్ టైగర్‌గా మార్చేసింది టాలీవుడ్. అప్పటి నుంచి ప్రతి సినిమాలో యంగ్ టైగర్‌గానే ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది. కానీ ఎన్టీఆర్‌కున్న మాస్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అందుకే.. మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే బిరుదు కూడా ఎన్టీఆర్‌కే ఉంది.దీంతో.. ఇప్పుడు దేవర సినిమాతో మ్యాన్ ఆఫ్ మాసెస్‌గానే కంటిన్యూ కానున్నాడు ఎన్టీఆర్. దేవర గ్లింప్స్ నుంచి యంగ్ టైగర్ ట్యాగ్‌ని మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా మార్చుకున్నాడు ఎన్టీఆర్.
ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన ట్యాగ్ మార్చుకున్నాడు. తాజాగా ఆర్సీ 16 ఓపెనింగ్‌కు సంబంధించిన ఓ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఇందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అనే ట్యాగ్ చూడొచ్చు. ఇక్కడి నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌గా కాకుండా.. గ్లోబల్ స్టార్‌గా కంటిన్యూ కానున్నాడు చెర్రీ. వాస్తవానికైతే.. ట్రిపుల్ ఆర్ సినిమాకు ఆస్కార్ వచ్చినప్పటి నుంచే చరణ్‌ను గ్లోబల్ స్టార్‌గా మార్చేశారు అభిమానులు. ఇక ఇప్పుడది అఫీషియల్ అయిపోయింది. అయితే.. బిరుదులు మార్చుకున్న చరణ్, తారక్.. హీరోయిన్లను కూడా మార్చుకుంటున్నారు. దేవర సినిమాలో నటిస్తున్న జాన్వీ కపూర్, ఆర్సీ 16లో హీరోయిన్‌గా నటిస్తుండగా.. ట్రిపుల్ ఆర్‌లో చరణ్ సరసన నటించిన ఆలియా భట్ ‘వార్ 2’లో ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేయనుంది.