Jr.Ntr – war : వార్‌-2 కోసం యంగ్ టైగర్ రెడీ..

యంగ్ రెబల్ స్టార్ (Rebel Star) ప్రభాస్.. సలార్ (Salaar) మూవీతో బాక్సాఫీస్‌పై ఎలాంటి దండయాత్ర చేశాడో అందరికీ తెలిసిందే..తన కటౌట్‌కు తగ్గ స్టోరీ పడితే.. డార్లింగ్ ఊచకోత ఎలా ఉంటుందో.. సలార్‌తో మరోసారి ప్రూవ్ అయ్యింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 29, 2024 | 09:41 AMLast Updated on: Jan 29, 2024 | 9:50 AM

Young Tiger Ready For War 2

బాలీవుడ్ (Bollywood) స్టార్ (Star Hero) హృతిక్ రోషన్ (Hrithik Roshan) – యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) మల్టీస్టారర్ గా బిగ్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే.. ‘వార్’ చిత్రానికి సీక్వెల్ గా ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. త్వరలో ప్రారంభం కానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. దేవర సినిమా షూటింగ్ కి గ్యాప్ రావడంతో వార్ 2 (War-2) సినిమాకి డేట్స్ ఇచ్చాడని కొత్తగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మార్చి మొదటి వారం నుంచి తారక్ ‘వార్ 2’ ప్రాజెక్ట్ కోసం డేట్స్ చూపిస్తున్నాడని. ముందుగా ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ ల పై ఓ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తారని టాక్ నడుస్తోంది.. దీంతో.. హృతిక్‌- ఎన్టీఆర్‌ ఎనర్జిటిక్ పెర్మార్ఫెన్స్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఇప్పుడు తెగ సంబరపడిపోతున్నారు.

ఎన్టీఆర్ – హృతిక్ రోషన్‌ కాంబినేషన్ కావడంతో బాక్సాఫీస్ బద్దలైపోవడం ఖాయమని ఇప్పటికే అంచనాలు వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్లుగానే హృతిక్ రోషన్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందని టాక్ వినిసస్తోంది. ఇద్దరు ప్రాణ స్నేహితులు.. చివరకు శత్రువులుగా మారితే ఎలా ఉంటుందన్న యాంగిల్‌లో యాక్షన్‌ మూవీగా పవర్‌ఫుల్‌గా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ మధ్య హోరాహోరా పోరు, ఊహించని స్థాయి యుద్ధ సన్నివేశాలు ఉండనున్నట్టు తెలుస్తోంది.

గతంలో టైగర్ ష్రాఫ్, హృతిక్ అద్భుతమైన యాక్షన్స్ తో ఆడియెన్స్ ను ఫిదా చేశారు. ఇక ఎన్టీఆర్ సైతం ‘ఆర్ఆర్ఆర్’లో యాక్షన్ సీక్వెన్స్ లలో అదరగొట్టాడు. మరో వైపు ఈ మూవీ నుంచి వినిపిస్తున్న మరో క్రేజీ అప్‌డేట్ ఏంటంటే.. సినిమాలో తారక్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో వచ్చిన ‘జై లవ కుశ’లో ఓ పాత్ర నెగెటివ్ షేడ్స్ ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు అంతకు మించిన పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో.. ‘జై లవ కుశలో మాదిరిగానే వార్‌-2లోనూ ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్‌తో ఇరగదీస్తాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. మరి యాక్షన్ ఫిల్మ్ లో హృతిక్‌-ఎన్టీఆర్ కాంబో ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి..