MrBeast: ఇదేం స్టంట్‌ నాయనా.. వారం పాటు సమాధిలో యూట్యూబర్‌.. చివరకు ఏం జరిగిందంటే..

మీరు చూస్తున్న యూట్యూబర్ పేరు మిస్టర్‌ బీస్ట్‌. మనోడికి యూట్యూబ్‌లో 21 కోట్లకు పైగా సబ్స్‌క్రైబర్స్‌ ఉన్నారు. వీళ్లందరి సంతోషం కోసం అప్పుడప్పుడు కొన్ని డేంజరస్‌ స్టంట్లు చేస్తుంటాడు మిస్టర్‌ బీస్ట్‌. రీసెంట్‌గా ఇలాంటిదే ఓ స్టంట్‌ చేశాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 22, 2023 | 01:39 PMLast Updated on: Nov 22, 2023 | 1:39 PM

Youtuber Mrbeast Spends 7 Days Being Buried Alive In Coffin Calls It Mental Agony

MrBeast: ఈ మధ్య కొందరు యూట్యూబర్స్‌ చేసే పనులకు అర్థం పర్థం లేకుండా పోతోంది. లైక్స్‌, వ్యూస్‌ వస్తున్నాయంటే చాలు.. ఏం చేసేందుకైనా రెడీ ఐపోతున్నారు. ఎంత రిస్క్‌ ఐనా చేసేస్తున్నారు. ఇప్పుడు మీకు చెప్పబోయే యూట్యూబర్‌ కూడా అలాంటిదే ఓ స్టంట్‌ చేశాడు. మీరు చూస్తున్న యూట్యూబర్ పేరు మిస్టర్‌ బీస్ట్‌. మనోడికి యూట్యూబ్‌లో 21 కోట్లకు పైగా సబ్స్‌క్రైబర్స్‌ ఉన్నారు. వీళ్లందరి సంతోషం కోసం అప్పుడప్పుడు కొన్ని డేంజరస్‌ స్టంట్లు చేస్తుంటాడు మిస్టర్‌ బీస్ట్‌. రీసెంట్‌గా ఇలాంటిదే ఓ స్టంట్‌ చేశాడు.

Bigg boss: మర్డర్ కేసు.. బిగ్ బాస్ హౌస్‌లో హత్య.. విచారిస్తున్న అర్జున్, అమర్

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వారం రోజుల పాటు సమాధిలోకి వెళ్లిపోయాడు. తన సమాధిని తానే కట్టుకుని వారంపాటు అందులోనే ఉన్నాడు. వారం తరువాత మళ్లీ బయటికి తిరిగి వచ్చాడు. తన ఎక్స్‌పీరియన్స్‌ను తన ఫాలోవర్స్‌తో షేర్‌ చేసుకున్నాడు. అయితే వారం రోజుల పాటు తనకు అవసరం ఉండే వస్తువులను ముందుగానే సమాధిలో పెట్టుకున్నాడు బీస్ట్‌. వారం పాటు లోపల ఉన్న ఆహారాన్నే తింటూ సమాధి లోపలే గడిపాడు. గతంలో కూడా ఇలాంటిదే ఓ స్టంట్‌ చేశాడు మిస్టర్‌ బీస్ట్‌.

2021లో కూడా ఇలాగే సమాధిలోకి వెళ్లిపోయాడు. దాదాపు 50 గంటలు సమాధిలోనే ఉండిపోయాడు. ఇప్పుడు ఏకంగా వారం పాటు సమాధిలో గడిపి తన రికార్డ్‌ను తానే బ్రేక్‌ చేసుకున్నాడు. ఈ స్టంట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.