Shanmukh Jaswanth: అరె ఏంట్రా ఇదీ.. గంజాయి తాగుతూ పట్టుబడ్డ షణ్ముఖ్‌

బిగ్‌బాస్‌ ఫేం షణ్ముఖ్‌ జస్వంత్‌ గంజాయి కొడుతూ పోలీసులకు చిక్కాడు. తన అన్న సంపత్‌ ఇంట్లో షణ్ముఖ్‌ గంజాయి తాగుతుడగా పోలీసులు పట్టుకున్నారు. నిజానికి పోలీసులు అక్కడికి వెళ్లింది వేరే కేసులో. కానీ అనుకోకుండా ఈ కేసులో కూడా ఇరుక్కున్నాడు షణ్ముఖ్‌.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 22, 2024 | 01:25 PMLast Updated on: Feb 22, 2024 | 1:25 PM

Youtuber Shanmukh Jaswanth Gets Caught With Ganja In Hyderabad

Shanmukh Jaswanth: సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్‌, గంజాయి కల్చర్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. చిన్న చిన్న సెలబ్రేటీలు కూడా గంజాయిలో మునిగి తేలుతున్నారు. ఇదేదో గొప్ప స్టేటస్‌ అన్నట్టుగా కాస్త ఫేమ్‌ రాగానే ఈ దిక్కుమాలిన గంజాయి బారిన పడుతున్నారు. అందరూ అని చెప్పలేం కానీ.. చాలా మంది ఇప్పటికే ఈ ఊబిలో చిక్కుకుపోయారు. రీసెంట్‌గానే ఓ హీరోయిన్‌ నార్సింగి పరిధిలో డ్రగ్స్‌తో పట్టుబడింది. గోవా నుంచి తీసుకువచ్చిన డ్రగ్స్‌ హైదరాబాద్‌లో ఎవరికో చేరవేస్తూ పోలీసులకు చిక్కింది.

Divi Vadthya: కాబోయేవాడు ఎలా ఉండాలంటే.. ఆ క్వాలిటీ తప్పనిసరి.. దివి వడ్త్యా ఏం చెప్పిందంటే

ఈ ఇన్సిడెంట్‌ మర్చిపోకముందే ఇప్పుడు మరో సెలబ్రిటీ గంజాయితో పోలీసులకు పట్టుబడ్డాడు. బిగ్‌బాస్‌ ఫేం షణ్ముఖ్‌ జస్వంత్‌ గంజాయి కొడుతూ పోలీసులకు చిక్కాడు. తన అన్న సంపత్‌ ఇంట్లో షణ్ముఖ్‌ గంజాయి తాగుతుడగా పోలీసులు పట్టుకున్నారు. నిజానికి పోలీసులు అక్కడికి వెళ్లింది వేరే కేసులో. కానీ అనుకోకుండా ఈ కేసులో కూడా ఇరుక్కున్నాడు షణ్ముఖ్‌. షణ్ముఖ్‌ అన్న సంపత్‌కు రీసెంట్‌గా పెళ్లి ఫిక్స్‌ అయ్యింది. సరిగ్గా పెళ్లికి వారం రోజుల ముందు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సంపత్‌. దీంతో ఆ అమ్మాయి పోలీస్‌ కేసు పెట్టింది. ఈ కేసులో సంపత్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సంపత్‌ ఇంటికి వెళ్లారు. పోలీసులు వేళ్లే సమయానికి షణ్ముఖ్‌ కూడా సంపత్‌ ఇంట్లోనే ఉన్నాడు. అన్నాదమ్ములు ఇద్దరూ హాయిగా గంజాయి కొడుతున్నారు. దీంతో వాళ్లను అదుపులోకి తీసుకుని ఇంట్లో తనిఖీలు చేశారు పోలీసులు. సంపత్‌ దగ్గర 19 గ్రాముల గంజాయి ఉన్నట్టు గుర్తించారు.

దీంతో వాళ్లిద్దరినీ అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం సంపత్‌, షణ్ముఖ్‌ ఇద్దరూ నార్మింగ్‌ పోలీసుల అదుపులో ఉన్నారు. వీళ్లకు గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది. కేవలం తాగుతున్నారా లేక సరఫరా కూడా చేస్తున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏఏ గంజాయి డీలర్స్‌తో షణ్ముఖ్‌, సంపత్‌కు సంబంధాలున్నాయి అనే కోణంలో విచారణ చేస్తున్నారు. సంపత్‌ ముందు నుంచే గంజాయి తీసుకుంటున్నాడు అని.. గంజాయి కోసం షణ్ముఖ్‌ సంపత్‌ ఇంటికి వెళ్లాడు అని ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తి స్థాయి విచారణ తరువాత మరిన్ని పేర్లు బయటికి వచ్చే ఛాన్స్‌ ఉంది.