EAGLE RATINGS: ఈగల్ రేటింగ్‌తో దెబ్బకొట్టిన ఆ వర్గం.. పవన్ కళ్యాణ్ కారణమా..?

ఈగల్‌తో పాటు రిలీజ్ అయిన యాత్ర 2కి 3 రేటింగ్ ఇస్తే.. ఈగల్‌కు 1.5 మాత్రమే రేటింగ్ ఇచ్చి కడిగిపారేసింది ఒక పాపులర్ వెబ్సైట్. దీనికి ప్రధాన కారణం ఈగల్ నిర్మాత, పీపుల్స్ మీడియా అధినేత టీ జీ విశ్వ ప్రసాద్.. పవన్ కళ్యాణ్‌కు అత్యంత ఆప్తమిత్రుడు కావడమే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 12, 2024 | 03:05 PMLast Updated on: Feb 12, 2024 | 3:05 PM

Ysrcp Media Give Poor Ratings For Ravitejas Eagle Movie

EAGLE RATINGS: రవితేజ మూవీ ఈగల్‌ను మీడియాలో ఒక వర్గం చావు దెబ్బ కొట్టింది. సినిమా అత్యంత నీచంగా ఉందంటూ దయ తలచి 1.5 రేటింగ్ ఇచ్చింది. ప్రధానంగా YSRCPకి చెందిన సోషల్ మీడియా గ్రూపులన్నీ పనిగట్టుకుని ఈగల్ పనికిమాలిన సినిమా అని ప్రచారం లేవనెత్తాయి. ఈగల్‌తో పాటు రిలీజ్ అయిన యాత్ర 2కి 3 రేటింగ్ ఇస్తే.. ఈగల్‌కు 1.5 మాత్రమే రేటింగ్ ఇచ్చి కడిగిపారేసింది ఒక పాపులర్ వెబ్సైట్. దీనికి ప్రధాన కారణం ఈగల్ నిర్మాత, పీపుల్స్ మీడియా అధినేత టీ జీ విశ్వ ప్రసాద్.. పవన్ కళ్యాణ్‌కు అత్యంత ఆప్తమిత్రుడు కావడమే.

Harish Shankar: మాస్ వార్నింగ్.. హరీష్‌ శంకర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌

పవన్ కళ్యాణ్‌తో బ్రో సినిమా నిర్మించారు విశ్వప్రసాద్. ఆ సినిమా రిలీజ్ తర్వాత వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆయన పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. బ్రో సినిమాలో పవన్ తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఈడీకి, సీబీఐకి రిపోర్ట్ చేయడమే కాకుండా.. విశ్వప్రసాద్ ఆర్థిక వ్యవహారాలపై దృష్టి పెట్టాలని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు కూడా. బ్రో సినిమాలో అంబటి రాంబాబుని వెక్కిరిస్తూ శ్యాంబాబు క్యారెక్టర్ పెట్టిన విశ్వ ప్రసాద్.. వైసీపీ నేతల ఆగ్రహానికి గురయ్యారు. అప్పటి నుంచి ఆయన వైసీపీ మీడియాకు టార్గెట్ అయ్యారు. ఈగల్ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్న వైసీపీ వర్గం మీడియా, సినిమా రిలీజ్ అవగానే దారుణంగా ర్యాగింగ్ చేశారు. కేవలం 1.5 రేటింగ్ ఇచ్చి థియేటర్‌కి వెళ్తే దొరికిపోతారంటూ రవితేజను ఒక ఆట ఆడుకున్నాయి కొన్ని వెబ్సైట్లు. ఈగల్‌పై వచ్చిన నెగిటివ్ రివ్యూస్‌పై డైరెక్టర్ హరీష్ శంకర్ ఆగ్రహంతో ఊగిపోయారు. పనిగట్టుకుని ఈగిల్‌ను డామేజ్ చేస్తున్నారంటూ.. ఒకప్పుడు తన గబ్బర్ సింగ్‌‌ను కూడా ఇలాగే డ్యామేజ్ చేయాలని ట్రై చేశారని, కానీ వాటన్నిటినీ అధిగమించి అప్పుడు గబ్బర్ సింగ్ సూపర్ హిట్ అయిందని గుర్తు చేశారు.

హరీష్ శంకర్ తన స్పీచ్‌లో కంట్రోల్ తప్పి.. ఒకప్పుడు రామ్ చరణ్ మీడియాపై చేసిన కామెంట్‌ని గుర్తు చేశారు. మీడియా.. నా బొచ్చు కూడా పీకలేదు అన్నట్లు సిగ్నల్ ఇచ్చారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ నిర్మాతను దారుణంగా కుమ్మేసింది వైసీపీ వర్గం మీడియా. ఈగల్‌కు నెగిటివ్ టాక్ తీసుకురావడం ద్వారా ఊహించని దెబ్బ కొట్టింది. ఆ దెబ్బ ఎలా ఉందంటే సినిమా రిలీజైన మూడు రోజుల తర్వాత నిర్మాత విశ్వప్రసాద్ ఈగల్ మూవీ యాడ్స్ కూడా నిలిపేశారు. ఈగల్‌పై ఒక రూపాయి ఖర్చుపెట్టినా దండగ అని అనుకునేంత రేంజ్ కి తీసుకొచ్చింది వైసీపీ మీడియా. కానీ, సినిమా మాత్రం బాక్సీఫీస్ దగ్గర మంచి కలెక్షన్లే సాధిస్తోంది. రివ్యూల ప్రభావంకన్నా మౌత్ టాక్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఇది ఒక రకంగా ఆ వెబ్‌సైట్లకు షాకే.