యువరాజ్ బయోపిక్, హీరో అతనే… ఫైనల్ చేసిన టీ సీరీస్
ఇండియన్ సినిమాలో బయోపిక్ ల ట్రెండ్ కాస్త ఎక్కువగానే నడుస్తోంది. క్రికెటర్లు ఆర్మీ అధికారుల జీవిత కథలపై సినిమాలు తీస్తూ మంచి వసూళ్లు సాధిస్తున్నారు నిర్మాతలు.
ఇండియన్ సినిమాలో బయోపిక్ ల ట్రెండ్ కాస్త ఎక్కువగానే నడుస్తోంది. క్రికెటర్లు ఆర్మీ అధికారుల జీవిత కథలపై సినిమాలు తీస్తూ మంచి వసూళ్లు సాధిస్తున్నారు నిర్మాతలు. ఇక ప్రజల్లో కూడా వాళ్లకు మంచి క్రేజ్ ఉండటం ఆడియన్స్ కూడా వాళ్ల గురించి తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపించడంతో బయోపిక్ లకు మంచి డిమాండ్ క్రియేట్ అవుతుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన బయోపిక్ లు లు అన్ని సూపర్ హిట్లయ్యాయి. రీసెంట్ గా వచ్చిన అమరన్ సినిమా కూడా సూపర్ హిట్ కొట్టింది.
ఇక ఇప్పుడు టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ జీవిత కథ ఆధారంగా ఒక సినిమాను సిల్వర్ స్క్రీన్ పై చూపించేందుకు రెడీ అవుతున్నారు నిర్మాతలు. ఇప్పటికే దీనికి సంబంధించి కథ కూడా రెడీ చేశారు. వరల్డ్ క్రికెట్లో యువరాజ్ సింగ్ ఒక సెన్సేషన్. 2011 ప్రపంచ కప్ టైం లో యువరాజ్ సింగ్ చూపిన పోరాట పటిమ అందరికీ గుర్తుంది. క్యాన్సర్ తో పోరాడుతూ కూడా జాతీయ జట్టుకు యువరాజ్ సింగ్ ఆడటం అప్పట్లో ఒక సెన్సేషన్. మైదానంలోనే రక్తపు వాంతులు చేసుకున్నా అతను మాత్రం ఎక్కడా బ్యాక్ స్టెప్ వేయలేదు.
ఆ తర్వాత కూడా క్యాన్సర్ నుంచి కోలుకొని టీమిండియా తరఫున మంచి ప్రదర్శనలు చేశాడు. ఒక రకంగా అతని లైఫ్ సినిమాకు మించి ఉంటుంది. చిన్న వయసులోనే జాతీయ జట్టులోకి అడుగుపెట్టడం… కెప్టెన్ కావాల్సిన అర్హతలు ఉన్న క్రమశిక్షణ లేకపోవడం వంటివి యువరాజ్ సింగ్ కెరీర్ లో బిగ్గెస్ట్ మైనస్. తన తల్లి యువరాజ్ సింగ్ కోసం ఎన్నో త్యాగాలు చేసారని కూడా చెప్తూ ఉంటారు. అతని తండ్రి కంటే తల్లితోనే ఎక్కువగా యువరాజ్ సింగ్ గడిపాడు. తండ్రి వద్ద క్రికెట్ పాఠాలు నేర్చుకున్నా.. అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లింది మాత్రం యువరాజ్ సింగ్ తల్లే.
అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేతో ప్రేమాయణం ఆ తర్వాత ఆమె గురించి టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనితో విభేదాలు… ఇక ధోనిని తన పెళ్లికి పిలవకపోవడం అన్నీ కూడా ఒక సెన్సేషన్. ఇప్పుడు అతని లైఫ్ ని సిల్వర్ స్క్రీన్ పై చూపించేందుకు టీ సిరీస్ రెడీ అయింది. భూషణ్ కుమార్, రవి బగ్ చందక్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆగస్టులోనే దీన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసినా ఆ తర్వాత అప్డేట్స్ ఏమీ రాలేదు. అయితే యువరాజ్ రోల్ లో ఎవరు నటిస్తారో అనేదానిపై క్లారిటీ లేదు. కానీ లేటెస్ట్ గా వస్తున్న అప్డేట్ ప్రకారం సిద్ధాంత్ చతుర్వేది యువరాజ్ సింగ్ రోల్ లో నటించనున్నాడు. రీసెంట్ గా ఒక చిట్ చాట్ లో డ్రీమ్ రోల్ ఏదని… ఛాలెంజ్ విసిరే ఏ పాత్ర కోసం ఎదురుచూస్తున్నారని ఒక అభిమాని అడగగా యువరాజ్ ఫోటోను సమాధానంగా చూపించాడు సిద్ధాంత్.
దీనితో యువరాజ్ బయోపిక్ లో అతను కీ రోల్ ప్లే చేస్తున్నాడు అనే క్లారిటీ జనాలకు వచ్చింది. ఈ బయోపిక్ లో సిద్ధాంత్ పేరు బయటకు రావడం ఇదే మొదటిసారి. ఇక 2020లో కూడా ఒక ఇంటర్వ్యూలో యువరాజ్ మాట్లాడుతూ తన బయోపిక్ లో సిద్ధాంత్ నటిస్తే బాగుంటుందని ఒపీనియన్ చెప్పాడు. ఆ తర్వాత కొన్ని నెలల క్రితం సినిమాను అనౌన్స్ చేసినా డైరెక్టర్ ను ఎవరు అనేది మాత్రం ఇప్పటివరకు ఎక్కడా రివీల్ చేయలేదు.