అతడి వయసు 30 ఆమె వయసు 39 వీళ్ళ ప్రేమ కు వయస్సు అడ్డు రాలే..

అక్కినేని వారి ఇంట వరుస పెళ్ళిళ్ళు సందడి చేస్తున్నాయి. నాగ చైతన్య, శోభిత వచ్చే నెల 4 న వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ వివాహం కూడా ఖరారు అయింది. ఏ మాత్రం హడావుడి లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా నిశ్చితార్ధం చేసుకున్నారు అఖిల్

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 27, 2024 | 03:30 PMLast Updated on: Nov 27, 2024 | 3:30 PM

Zainab Older Than Akhil

అక్కినేని వారి ఇంట వరుస పెళ్ళిళ్ళు సందడి చేస్తున్నాయి. నాగ చైతన్య, శోభిత వచ్చే నెల 4 న వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ వివాహం కూడా ఖరారు అయింది. ఏ మాత్రం హడావుడి లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా నిశ్చితార్ధం చేసుకున్నారు అఖిల్. జైనాబ్ రావ్ద్జీ అనే అమ్మాయితో అఖిల్ వివాహం జరుగుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రావ్‌డ్జీ కుమార్తె జైనాబ్ రావ్‌జీతో నిశ్చితార్థం చేసుకున్నట్టు నాగార్జున అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించారు.

ఈ సందర్భంగా నిశ్చితార్ధం ఫోటోలను కూడా షేర్ చేసారు. ఈ వేడుక అక్కినేని కుటుంబ సమేతంగా అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించారు. దీనితో జైనాబ్ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ప్రకారం, జైనాబ్ లైవ్ స్టైల్ బ్లాగర్, స్కిన్ కేర్ కూడా చూస్తూ ఉంటుంది. హైదరాబాద్ లో ఓ ఎగ్జిబిషన్ ద్వారా ఆమె ఫేమస్ అయింది. ఆమె హైదరాబాద్‌లో పుట్టినా… ఎక్కువగా చదువుకుంది మాత్రం లండన్, దుబాయ్ లోనే. ప్రస్తుతం ముంబైలో నివాసం ఉంటుంది.

పెళ్లి తేదీలు ఇంకా ఖరారు కాలేదు, వచ్చే ఏడాది జరిగే అవకాశం ఉంది. ఫలక్ నుమా ప్యాలెస్ లో వీరి వివాహం జరపనున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ విషయం బాగా వైరల్ అవుతోంది. అఖిల్ కంటే ఆమె 9 ఏళ్ళు పెద్దది. జైనాబ్ మరియు అఖిల్ రెండేళ్ల క్రితం ఓ ఈవెంట్ లో కలుసుకున్నారట. అక్కడి నుంచి డేటింగ్ మొదలుపెట్టారు. ఈ విషయాన్ని ఎక్కడా అక్కినేని ఫ్యామిలీ గాని అఖిల్ గాని లీక్ చేయలేదు. గతంలో శ్రేయా భూపాల్ తో అఖిల్ నిశ్చితార్ధం చేసుకుని బ్రేకప్ చెప్పాడు.

పలు కారణాలతో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో దూరమయ్యారు. ఆ తర్వాత సింగిల్ గా ఉన్న అఖిల్… ఈసారి తనకంటే వయసులో పెద్ద అయినా సరే జైనాబ్ తో డేటింగ్ స్టార్ట్ చేసాడు. చివరికి ఇద్దరూ వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యారు. దీనిపై సోషల్ మీడియాలో డిఫరెంట్ కామెంట్స్ వస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా ఈ జంట మాత్రం హాట్ టాపిక్ అయ్యారు. సినిమాలు వరుస ఫ్లాప్ లు కావడంతో ఇబ్బంది పడుతున్న అఖిల్… ఇప్పుడు పెళ్లి చేసుకుని సెటిల్ కావాలి అనుకోవడం… కొందరు స్టార్ల కంటే ముందే పెళ్లి చేసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.