ప్రభాస్ లాంటి కొడుకు కావాలి… దేవర తల్లి కామెంట్స్

ఇండియన్ సినిమాలో ప్రభాస్ కు కొన్ని విషయాల్లో సేపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ప్రభాస్ ను దగ్గర నుంచి చూసిన వాళ్ళు... సినిమాల్లో రెబల్ స్టార్ గాని బయట మాత్రం చాలా సాఫ్ట్ క్యారెక్టర్ అని చెప్తూ ఉంటారు. ప్రభాస్ తో సినిమా చేసిన నటులు అందరూ... అతని పద్ధతులకు ఫిదా అవుతూ ఉంటారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 28, 2024 | 05:39 PMLast Updated on: Nov 28, 2024 | 5:39 PM

Zarina Wahab Comments On Rebal Star Prabhas

ఇండియన్ సినిమాలో ప్రభాస్ కు కొన్ని విషయాల్లో సేపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ప్రభాస్ ను దగ్గర నుంచి చూసిన వాళ్ళు… సినిమాల్లో రెబల్ స్టార్ గాని బయట మాత్రం చాలా సాఫ్ట్ క్యారెక్టర్ అని చెప్తూ ఉంటారు. ప్రభాస్ తో సినిమా చేసిన నటులు అందరూ… అతని పద్ధతులకు ఫిదా అవుతూ ఉంటారు. ఒక్కసారి వర్క్ చేస్తే చాలు సినిమా సెట్స్ లో తమను ఎలా చూసుకుంటాడు అనేది చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఫుడ్ విషయంలో ప్రభాస్ తో వర్క్ చేసిన ప్రతీ యాక్టర్ కూడా తమ అనుభవాలను చెప్తూ ఉంటారు.

ఇంటి వద్ద నుంచి భోజనం వస్తుందని… ఆ భోజనం సెట్స్ లో అందరికి పెడతారు అని… గోదావరి జిల్లాల స్పెషల్స్ అన్నీ తమకు వడ్డిస్తారు అంటూ ఎందరో నటులు చెప్తూ ఉంటారు. అలాగే తన లైఫ్ ఎలా ఉంటుందో కూడా ప్రభాస్ చూపిస్తూ ఉంటాడు చాలా మంది యాక్టర్స్ కు. తాజాగా ఈ విషయాన్ని మరో యాక్టర్ కూడా బయటపెట్టారు. దేవర సినిమాలో ఎన్టీఆర్ తల్లిగా నటించిన హిందీ నటి జరీనా వాహబ్ ప్రభాస్ పద్ధతులకు ఫిదా అయిపోయారు. ‘ది రాజా సాబ్’ సినిమాలో ప్రభాస్ తల్లిగా నటిస్తున్నారు ఆమె.

లేటెస్ట్ గా ఆమె ఒక హిందీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ.. ప్రభాస్ గురించి అనేక విషయాలు పంచుకున్నారు. ప్రభాస్ గురించి చెప్పే టైం లో ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మాట్లాడారు. ప్రభాస్ ఎంత గొప్ప మనిషి అంటే నేను ఇప్పటివరకు ఏ ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడలేదు అంటూ ప్రభాస్ గొప్పతనం గురించి వివరించారు. సెట్ లో ప్రతి ఒక్కరిని వారి క్రాఫ్ట్స్ తో సంబంధం లేకుండా సమానంగా చూసుకుంటారు అని చెప్పుకొచ్చింది. నాకు ఆకలేస్తుందని తెలిస్తే.. ఇంటికి ఫోన్ చేసి 40-50 మందికి ఫుడ్ తెప్పిస్తారని ఆమె తన అనుభవం వివరించింది.

వచ్చే జన్మలో ప్రభాస్ లాంటి కొడుకుకి తల్లి కావాలని కోరుకుంటా అని ఆమె చెప్పడం గమనార్హం. ఇక జరీనా వాహబ్ దేవర సినిమాలో దేవరకు తల్లిగా నటించారు. ఆమె పేరుకి హిందీ యాక్టర్ అయినా.. ఆమె తెలుగింటి అమ్మాయే. వైజాగ్ లోనే పుట్టి పెరిగారు. ఆ తర్వాత బాలీవుడ్ లో ఫేమస్ అయ్యారు. బాలీవుడ్ యాక్టర్, ప్లే బ్యాక్ సింగర్, ప్రొడ్యూసర్ ఆదిత్య పాంచోలిని వివాహం చేసుకుని అక్కడ సెటిల్ అయ్యారు. హిందీ, తమిళ్, మలయాళ భాషలతో పాటు తెలుగులో కూడా అనేక సినిమాల్లో ఆమె నటించారు. రక్త చరిత్ర 2, విరాట పర్వం, దేవర సినిమాలతో ఆమెకు పేరు వచ్చింది. ఆమెకి ఇద్దరు సంతానం కాగా ఒకరు బాలీవుడ్ హీరో సూరజ్ పాంచోలి ఇప్పుడు అక్కడ యంగ్ హీరోగా బిజీగా ఉన్నాడు.