ఇండియన్ సినిమాలో ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలతో పాటుగా లో బడ్జెట్ సినిమాలు డామినేషన్ కూడా కంటిన్యూ అవుతుంది. తక్కువ బడ్జెట్ తో వస్తున్న సినిమాల ఎక్కువ హడావుడి లేకుండా సూపర్ హిట్ కొడుతున్నాయి. ఈ విషయంలో ముఖ్యంగా హీరోల కంటే స్టార్ ప్రొడ్యూసర్లు పక్క ప్లానింగ్ తో దిగిపోతున్నారు. అందులో ముఖ్యంగా సూర్యదేవర నాగ వంశీ రిస్క్ తక్కువ ప్రాఫిట్ ఎక్కువ సినిమాలు పై ఫోకస్ పెడుతున్నాడు. రీసెంట్ గా ఆయన ఇన్వెస్ట్ చేస్తున్న సినిమాలన్నీ కూడా ప్రాఫిట్ ఎక్కువగా వస్తున్నవే. బడ్జెట్ కూడా ఎక్కువగా ఖర్చు పెట్టకుండా చాలా జాగ్రత్తగా పగడ్బందీగా ముందుకు వెళుతున్నాడు. చిన్న సినిమాలు పై ధైర్యంగా ఇన్వెస్ట్ చేస్తున్నాడు. టిల్లు స్క్వేర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, లక్కీ భాస్కర్, లేటెస్ట్ గా వచ్చిన డాకు మహారాజ్ సినిమాలకు పెద్దగా పెట్టుబడి పెట్టలేదు. కానీ ప్రాఫిట్ మాత్రం భారీగా వస్తుంది. ఈ సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ కావడంతో తర్వాతి సినిమాలపై ఇదే ప్లానింగ్ తో వెళుతున్నాడు. సిద్దు జొన్నలగడ్డ హీరోగా డీజె టిల్లు సీరిస్ లో మరో సినిమా రానుంది. ఇలా మరికొన్ని చిన్న సినిమాలు లైన్ చేసాడు. స్టోరీ నచ్చి తక్కువ బడ్జెట్ సినిమా ఉంటే వెంటనే ఫైనల్ చేసేస్తున్నాడు నాగ వంశీ. ఇదే టైంలో అప్పుడప్పుడు భారీ బడ్జెట్ సినిమాలను కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్లో.. చెంగిస్ ఖాన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు రెడీ అయ్యాడు. రీసెంట్ గా దేవర సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఆ సినిమా కూడా భారీ బడ్జెట్ తోనే వచ్చింది. అలాగే దేవర 2 సినిమాపై కూడా భారీగానే పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. అటు డిస్ట్రిబ్యూటర్లు కూడా నాగవంశీ సినిమాలపై ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తున్నారు. ఒకపక్క స్టార్ నిర్మాతలు ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్ సినిమాలు తో బోల్తా పడుతున్నారు. గేమ్ చేంజర్ సినిమా దిల్ రాజుకు భారీ షాక్ ఇచ్చింది. అలాగే తమిళంలో స్టార్ హీరో విజయ్ తో చేసిన సినిమా కూడా దిల్ రాజుకు గట్టు షాక్ ఇచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ అయితే భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే చేస్తోంది. అప్పుడప్పుడు చిన్న సినిమాలు చేసినా నాగవంశీ రేంజ్ లో ప్రాజెక్టులు ఉండటం లేదు. అయితే స్టార్ ప్రొడ్యూసర్ల సినిమాలు కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు భయపడుతున్నారు. కానీ నాగ వంశీ విషయంలో మాత్రం సీన్ డిఫరెంట్ గా ఉంది. డాకు మహారాజు సినిమాకు భారీ లాభాలు రావడంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా పండగ చేసుకుంటున్నారు. దేవర సినిమా టైంలో కూడా డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు వచ్చాయి.